Intinti Ramayanam Today Episode October 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. కమల్ ఎలక్ట్రిషన్ జాబు లో జాయిన్ అవుతాడు.. మొదటి రోజు తను ఎలక్ట్రిషన్ గా పనిచేసేందుకు ఓ ఆర్డర్ వచ్చిందని ఓనర్ చెప్పగానే ఆ ఇంటికి వెళ్తాడు.. ఇది చక్రధర్ మామయ్య ఇల్లు కదా.. మనకు భయం ఎందుకు రాజు అలాగా వెళ్లి పని ఏంటో చూసుకొని వద్దామని వెళ్తాడు. రాజేశ్వరి అల్లుడు వచ్చాడు కదా అని సంతోష పడుతూ మర్యాదగా పలకరిస్తుంది. చక్రధర్ మాత్రం ఎందుకొచ్చావ్ ఏం పనితో వచ్చావు అని అడుగుతాడు. నేను ఎలక్ట్రిషన్ గా జాబ్ లో జాయిన్ అయ్యాను. ఇంట్లో ఏదో పని ఉందంట కదా నాకు ఆ పని అప్పగించారు అందుకే నేను వచ్చాను ఏంటో చెప్పండి అని కమల్ అడుగుతాడు.. కమల్ని చక్రధర్ దారుణంగా అవమానిస్తాడు.. కమల్ తనకు ఎలక్ట్రిషన్ గా జాబ్ వచ్చింది అని చెప్పగానే అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. నా మొదటి సంపాదన 2000 అమ్మ ఇదిగో అని పార్వతికి ఇవ్వబోతుంటే పల్లవి ఆపండి అని క్లాస్ పీకుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లో అవని వదిన ఒక్కటే కష్టపడుతుంది. ఇంటి అడ్డు కట్టడానికి ఆమె ఎన్ని కష్టాలు పడిందో అందరికీ తెలుసు. వదినకు సాయంగా ఉండాలని ఎవరు అనుకోలేదు. భార్య ఇంటి వద్ద కట్టడానికి డబ్బులు ఇవ్వకుండా టీవీ కొన్నది. అందుకే నేను వదినకి సాయంగా ఉండాలని అనుకుంటున్నాను. నేను ఇలానే ఉంటాను ఇలానే చేస్తాను అని కమల్ అంటాడు. కమల్ మాటకి అందరూ సంతోషపడతారు. పల్లవి నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదు బావ నీ చేత నేను బిజినెస్ చేయిస్తాను అని అంటుంది.. ఆ తర్వాత అవని దగ్గరికి వెళ్లిన అక్షయ్ ఏంటండీ ఉద్యోగం వచ్చిందా అని అడుగుతుంది అవని. లేదు అవి రాలేదు అని అక్షయ్ అంటాడు.
మీరేం ఫీల్ అవ్వకండి మీకు మంచి క్వాలిఫికేషన్ ఉంది కదా ఖచ్చితంగా మీకు మంచి జాబ్ ఏ వస్తుంది అని అంటుంది. ఆరాధ్య అమ్మాయి ఏది చెప్తే అది జరుగుతుంది నాన్న అని ధైర్యం చెబుతుంది.. మీకు త్వరగా జాబ్ రావాలని నేను కూడా దేవుని కోరుకుంటాను నాన్న అని ఆరాధ్య అనగానే ఆరాధ్యను ఎత్తుకొని ముద్దాడుతాడు అక్షయ్.. ఆ తర్వాత అమ్మ కూడా ఇదే మాట చెప్పింది కదా.. నువ్వు అమ్మ కూడా ముద్దు పెట్టాలి కదా అని ఆరాధ్య అంటుంది. ఓ నేను ఇక్కడ ఉన్నాను అని నువ్వు సిగ్గు పడుతున్నావు కదా నేను వెళ్ళిపోతాను అని అక్కడ నుంచి ఆరాధ్య వెళ్ళిపోతుంది.
తర్వాత రోజు ఉదయం పార్వతి రాజేంద్రప్రసాద్ కి భానుమతికి కాఫీ ఇస్తుంది. ప్రణతి భరత్ ఇద్దరూ లగేజ్ తో బయటికి వస్తారు. ఏంటి ఏమైంది అని ప్రణతిని పార్వతి అడుగుతుంది. ప్రణతి మాత్రం అవనీని పిలుస్తుంది. మేము ఇంట్లోంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నాము. మా కాళ్ళ మీద మేము నిలబడాలని నిర్ణయించుకున్నాము అని ప్రణతి భరత్లు ఇద్దరూ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించే పనిలో ఉంటారు. కానీ శ్రీయ పల్లవి మాత్రం ఇక్కడ ఉంటే మందిలో ప్రైవసీ లేదని వెళ్ళిపోతున్నారేమో అని తప్పుగా అంటారు.
మీలాగా ఆలోచించడానికి మా చెల్లి మీలాంటిది కాదు అని కమల్ దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్తాడు. ఇక ప్రణతి భరత్లను ఎంత చెప్పినా హాజరు కాబట్టి అవని రాజేంద్రప్రసాద్ ఏమీ మాట్లాడకుండా వాళ్ళు నీ వెళ్ళనిస్తారు. ఆ తర్వాత పల్లవి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లాలని అనుకుంటుంది. రాజేశ్వరి మౌనంగా ఉండడం చూసినా చక్రధర్ దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు అని అంటాడు. నేను దేని గురించి అని చెప్పినా మీరు పెద్దగా పట్టించుకోరు కదా అది చెప్పడం కూడా వేస్ట్ అని రాజేశ్వరి అంటుంది.
అక్కడికొచ్చిన పల్లవి తనకు డబ్బులు కావాలని అడుగుతుంది. నాకు ఒక కోటి రూపాయలు కి చెక్కు రాసి ఇవ్వండి నాన్న అని అంటుంది. అదేంటమ్మా ఇంత సడన్గా నీకు డబ్బులు ఎందుకు అని చక్రధర అడుగుతాడు. నా భర్తతో బిజినెస్ చేయించాలని నేను అవనితో ఛాలెంజ్ చేశాను. తన భర్త కోసం 50 లక్షలు అప్పు చేస్తుంది తెచ్చిన అవనికన్నా నేను తక్కువ ఎం కాదు.. నేను ఇంకో 50 లక్షలు ఎక్కువ వేసి కోటి రూపాయలు తో నా భర్తతో బిజినెస్ చేయించాలని అనుకుంటున్నాను. నాకు ఆ డబ్బులు ఇవ్వండి డాడ్ అని పల్లవి అడుగుతుంది.
Also Read:ఇంటి కోసం బాలు మాస్టర్ ప్లాన్.. ప్రభావతికి షాక్..మనోజ్ కు రోహిణి బంఫర్ ఆఫర్..
పల్లవి అన్న దానికి రియాక్ట్ అయిన చక్రధర్ నేను ఆ మూర్ఖుడి కోసం డబ్బులు ఇవ్వను. నన్ను నిన్ను కొట్టిన వాడి కోసం నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని చక్రధర్ పల్లవికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు. మీ ఆస్తికి వారసురాలు నేనే కదా ఆస్తిని వాటపంచండి అని అడుగుతుంది.. ఏ తండ్రి తన బిడ్డలకి వాటపరచాలని కచ్చితంగా రూల్ లేదు. నేను వాడికైతే అస్సలు రూపాయి కూడా ఇవ్వను. నీకు కావాలంటే చెప్పు ఎంతైనా ఇస్తాను. వాన్ని వదిలేసి వచ్చేసేయ్ నువ్వు ఇక్కడే ఉంటే నా బిజినెస్లకు నువ్వే మహారాణి అవుతావు అని చక్రధరంటాడు.. పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డబ్బులు తీసుకొని వస్తానని వెళ్ళావు కదా.. నా చేత ఏం బిజినెస్ పెట్టిస్తున్నావు అని కమల్ అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…