E-Paper
Advertisement

Thursday:  మీరు గురువారం పుట్టారా..? అయితే మీ జీవితంలో జరగబోయే అతి పెద్ద మార్పులు ఏంటో తెలుసా..?

Thursday:  మీరు గురువారం పుట్టారా..? అయితే మీ జీవితంలో జరగబోయే అతి పెద్ద మార్పులు ఏంటో తెలుసా..?

Thursday: మీరు గురువారం పుట్టారా..? జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కసితో బతుకుతున్నారా..? మీ జీవిత గమనంలో ఒంటరి పోరాటం  చేస్తున్నారా..? అయితే మీ జీవితంలో జరగబోయే అతి పెద్ద మార్పులు ఏంటో తెలుసా..? జ్యోతిశ్యశాస్త్రం ప్రకారం గురువారం పుట్టిన జాతకుల జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

గురువారం పుట్టిన వారు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురు(బృహస్పతి) గ్రహ ప్రభావం కలిగి ఉంటారు. నవగ్రహాలలో గురువును శుభ గ్రహంగా, జ్ఞానానికి, సంపదకు కారకుడిగా భావిస్తారు. అందుకే గురువారం జన్మించిన వారి జీవితం చాలా వరకు సానుకూలంగా, గౌరవప్రదంగా ఉంటుందట.

వ్యక్తిత్వం మరియు స్వభావం: గురువారం పుట్టిన వారు పుట్టుకతోనే తెలివైనవారు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన వీరిలో ఉంటుందట. వీరు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, పాజిటివ్‌గా ఆలోచిస్తారట. వీరి చుట్టూ ఉన్నవారికి కూడా ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇస్తారట. వీరు క్రమశిక్షణతో ఉంటూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారట. ఇతరులకు సలహాలు ఇవ్వడంలో వీరు దిట్టమైన వారట.

కెరీర్ మరియు ఆర్థిక స్థితి: గురువారం పుట్టిన వారిపై గురువు ప్రభావం ఉంటుందట. అందువల్ల వీరు ఉపాధ్యాయులుగా, ప్రొఫెసర్లుగా, న్యాయవాదులుగా, ఆధ్యాత్మిక గురువులుగా లేదా ప్రభుత్వ ఉన్నత పదవుల్లో రాణిస్తారట. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో కూడా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందట. వీరు డబ్బు సంపాదించడం కంటే, గౌరవాన్ని సంపాదించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. వీరు మధ్య వయస్సు తర్వాత ఆర్థికంగా చాలా స్థిరపడతారట.

కుటుంబం మరియు సంబంధాలు: గురువారం పుట్టిన వారికి వారి కుటుంబం పట్ల  అమితమైన ప్రేమ ఉంటుందట. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడంలో ముందుంటారట. వీరి దాంపత్య జీవితం సాధారణంగా సుఖసంతోషాలతో సాగుతుందట. వీరు జీవిత భాగస్వామి పట్ల నమ్మకంగా ఉంటారట. అయితే, వీరు కొన్నిసార్లు తమ అభిప్రాయాలను ఇతరుల మీద రుద్దాలని చూస్తారట. ఇది తగ్గించుకుంటే ఇంకా మంచిదని పండితులు సూచిస్తున్నారు.

అదృష్ట అంశాలు: గురువారం  పుట్టిన వారికి లక్కీ నెంబర్‌ మూడు అలాగే మూడు, పన్నెండు, ఇరవై ఒకటి, ముఫ్పై తేదీలు కూడా కలిసి వస్తాయట. వీరు గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల ఎంతో శుభం జరుగుతుందట. వీళ్లు దత్తాత్రేయుడు, శివుడు లేదా విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల వీరికి జీవితంలో ఉన్న  అడ్డంకులు తొలగిపోతాయట.

సవాళ్లు (ప్రతికూలతలు): గురువారం పుట్టిన వారు చేసే అతి పద్ద తప్పిదాలలో ఒకటి అతి ఆత్మవిశ్వాసమట. ఒక్కోసారి తామే అపర మేధావులమని భావించడం వల్ల ఇతరులతో విభేదాలు వచ్చి జీవితంలో అనుకోని పెద్ద పెద్ద సంఘటనలు జరగవచ్చని పండితులు హెచ్చరిస్తున్నారు.

మొత్తంగా చూస్తే, గురువారం పుట్టిన వారు సమాజంలో ఒక మార్గదర్శకులుగా ఎదిగే అవకాశం ఉంది. మీకున్న జ్ఞానాన్ని పదిమందికి పంచుతూ, అహంకారం లేకుండా ఉంటే మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: శ్రీశైలంలో ఎవ్వరికీ తెలియని రహస్య ఆలయాలు – ఎక్కడ ఉన్నాయో తెలుసా..?

 

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×