E-Paper
Advertisement

టీమిండియాను ఓడించిన ప్లేయర్లకు బిర్యానీ పార్టీ…? పాక్ ప్రధాని షరిఫ్‌పై ట్రోలింగ్ షురూ!

టీమిండియాను ఓడించిన ప్లేయర్లకు బిర్యానీ పార్టీ…? పాక్ ప్రధాని షరిఫ్‌పై ట్రోలింగ్ షురూ!
Advertisement

PM Shehbaz Sharif On IND VS PAK : హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో శుక్రవారం పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించిన తరుణంలో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Pakistan Pm Shehbaz Sharif) సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాను ఓడించినందుకు పాకిస్తాన్ జట్టుకు శుభాకాంక్షలు చెప్పాడు. కలిసి కట్టుగా జట్టును ముందుకు సాగించారని, ఇలాంటి విజయాలను మరిన్ని సాధించాలని ఆకాంక్షించాడు.

టీమిండియా జట్టును ఓడించిన పాకిస్తాన్ ప్లేయర్లకు విందు ?

టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్న సేపు మజా వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కసితో ఆడి, టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న ప్లేయర్లకు విందు ఏర్పాటు చేయాలని కూడా షెహబాజ్ షరీఫ్ ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. అటు హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టును తయారు చేసిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీని కూడా అభినందించాడు. బలమైన జట్టును తయారు చేసి, పంపినందుకు అతన్ని మెచ్చుకున్నాడు. ఇదే అంకిత భావంతో పాకిస్తాన్ జట్టు ముందుకు సాగాలని పిలుపునిచ్చాడు. హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ లో పాకిస్తాన్ ను చాంపియన్ చేయాలని దిశా నిర్దేశం చేశాడు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి

హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా జట్ల మధ్య శుక్రవారం బిగ్ ఫైట్ జరిగింది. 6 ఓవర్ల ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్, టీమిండియాను 4 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ తరుణంలో నిర్ణీత 6 ఓవర్లు ఆడిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 88 పరుగులు సాధించింది. కేవలం శశాంక్ సింగ్ మాత్రమే 40 పరుగులతో రాణించగా నితీశ్ రాణా 19 పరుగులు చేశాడు. మిగతా ప్లేయర్లు అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. ఈ తరుణంలోనే చిన్న లక్ష్యాన్ని 3.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు నష్టపోయి పాకిస్తాన్ చేధించింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ అబ్బాస్ అఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. పొదుపుగా బౌలింగ్ చేసిన అతడు, 8 బంతుల్లో 35 పరుగులు రాబట్టాడు. దీంతో ఈ అవార్డు దక్కింది. ఇక హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ యూనైటెట్ అరబ్ ఎమిరేడ్స్ జట్ల మధ్య శనివారం ఉదయం మ్యాచ్ ఉంది.

Advertisement

పాక్ ప్రధాని షరిఫ్‌పై ట్రోల్స్

హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ గెలిచిన పాకిస్తాన్ పై ఆ దేశ ప్రధాని షరిఫ్ స్పందించడంపై ఇండియన్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. వరల్డ్ కప్ గెలిచినప్పుడు తమ ప్రధాని మోడీ రియాక్ట్ అవుతారని, కానీ షరీఫ్ చాలా చిల్లరగా వ్యవహరిస్తూ హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీపై స్పందించడం దారుణమంటున్నారు. ఇక వరల్డ్ కప్ గెలిస్తే, పాకిస్తాన్ వాళ్లు అసలు భూమిపైనే ఆగబోరంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

 

 

Related News

అభిషేక్, వైభవ్, ఇషాన్‌లను వన్డేల్లోకి తీసుకోండి..ఆ రాక్షసులు భూకంపం సృష్టిస్తారు

గంభీర్ బుర్ర తక్కువ నిర్ణయాల వల్లే 4వ టీ20లో టీమిండియా ఓటమి..గవాస్కర్ ఫైర్

పాకిస్తాన్ ప్లేయ‌ర్ తో SRH బౌల‌ర్ న‌ట‌రాజ‌న్‌ దోస్తానా..దేశం నుంచి త‌రిమేయాలంటూ ట్రోల్స్‌!

రాహుల్, కృనాల్ డకౌట్…పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర ఓట‌మి

కాగితంపై రాసి పెట్టుకోండి..2027 వ‌రల్డ్ క‌ప్‌ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ తీసుకు వ‌స్తారు

Hong Kong Sixes 2026:  యూఏఈ చేతిలో పాకిస్తాన్ ఘోర‌ ఓట‌మి

అభిషేక్ శర్మ వ‌న్డేలు ఆడితే, 500 ప‌రుగులు ఈజీగా కొట్టేస్తాడు

Big Stories

Advertisement
×