E-Paper
Advertisement

New Bajaj Electric Scooter: బజాజ్ చేతక్ కొత్త వేరియంట్లు వచ్చేస్తున్నాయ్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

New Bajaj Electric Scooter: బజాజ్ చేతక్ కొత్త వేరియంట్లు వచ్చేస్తున్నాయ్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Bajaj New Electric Scooter 2026: 2026లో బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని మరింత విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చేతక్ మోడల్స్ ముఖ్యంగా 300 సిరీస్, 350 సిరీస్ ఆధారంగా కొత్త వేరియంట్లు విడుదల చేయాలని భావిస్తోంది. అదే సమయంలో వీటిలో పలు అప్ డేట్స్ తీసుకురావాలని భావిస్తోంది.

కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్

కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఈ నెల  చివరిలోగా లేదంటే, ఫస్ట్ క్వార్టర్ లో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. మరింత చౌకైన వేరియంట్లను తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం చేతక్ మోడల్ కంటే తక్కువ ధరలో పరిచయం చేయనుంది. ఈ స్కూటర్ అంచనా ధర రూ. 80 వేల నుంచి రూ. 90 వేల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

Read Also: BMW నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్.. హెల్మెట్ లేకుండానే నడిపేయొచ్చు!

కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు

కొత్త బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరింత అప్ డేటెడ్ గా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న రెట్రో డిజైన్ అలాగే కొనసాగించనుంది. కానీ, కొన్ని మార్పులు చేర్పులు చేయనుంది. ముఖ్యంగా రివైజ్డ్ సైడ్ ప్యానెల్స్, న్యూ సీట్, ఇంటిగ్రేటెడ్ టైల్‌లైట్, హ్యాండిల్‌బార్‌పై ఇండికేటర్స్ ను యాడ్ చేయబోతోంది. హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటర్ ను పరిచయం చేయబోతోంది. LCD డిస్‌ప్లే, బేసిక్ స్విచ్‌గేర్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉంటాయి. మెటల్ బాడీ కొనసాగనుంది. లేదంటే, లైటర్ మెటీరియల్స్ ఉపయోగించి కాస్ట్ తగ్గించవచ్చు. ప్రస్తుత మోడల్స్ లాగా 3 kWh, 3.5 kWh బ్యాటరీ ఆప్షన్స్ తో రానుంది. ఒక్క ఛార్జ్ తో సుమారు 100-150 కిలో మీటర్ల పరిధిని అందించనుంది. తాజాగా రిపోర్ట్స్ ప్రకారం నెక్స్ట్ జెన్ చేతక్ మిడ్ ఇయర్ లో రానున్నట్లు తెలుస్తోంది. మరిన్ని కాస్మెటిక్ చేంజెస్, బెటర్ పర్ఫార్మెన్స్‌ తో విడుదలకానుంది. ఈ బజాజ్ చేతక్ TVS Orbiter, Ola, Ather లాంటి మోడల్స్‌ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

Advertisement

Read Also: జస్ట్ రూ. 3.5 లక్షలకే 1200 కి.మీ రేంజ్, మార్కెట్లోకి సూపర్ ఎలక్ట్రిక్ కారు!

బజాజ్ ఇతర ఎలక్ట్రిక్ ప్లాన్స్

బజాజ్ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్లాట్‌ఫారమ్ ను డెవలప్ చేస్తోంది. కానీ, లాంచ్ 2026లో తర్వాత ఉంటుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు లాంచ్ చేసి, 2027లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. Yezdi బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపించినా, ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. జస్ట్ ఇండస్ట్రీ రిపోర్ట్స్ కారణంగా ఈ స్కూటర్ గురించి చర్చ జరుగుతోంది. త్వరలోనే బజాజ్ ఈ స్కూటర్ గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: ఇండియన్ మార్కెట్ ను ఏలిన టాప్ కార్లు, ప్రజలు ఇప్పటికీ వాటిని మర్చిపోలేరు తెలుసా!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×