E-Paper
Advertisement

BMW Vision CE: BMW నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్.. హెల్మెట్ లేకుండానే నడిపేయొచ్చు!

BMW Vision CE: BMW నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్.. హెల్మెట్ లేకుండానే నడిపేయొచ్చు!
Advertisement

New BMW Vision CE 2026: లగ్జరీ కాన్సెప్ట్ బైక్స్ విడుదల చేయడంలో ముందుండే BMW ఎప్పటికప్పుడు సరికొత్త బైక్ ను ఆవిష్కరించింది.  BMW మోటర్రాడ్ విజన్ CE అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. రీసెంట్ గా జరిగిన IAA మొబిలిటీ షోలో ఈ ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ను పరిచయం చేసింది. ఈ బైక్ అర్బన్ మొబిలిటీని రీడిఫైన్ చేయడానికి డిజైన్ చేసింది. ఈ బైక్ ను హెల్మెట్, ప్రొటెక్టివ్ గేర్ అవసరం లేకుండా నడిపే ఐడియాతో రూపొందించింది. ఇప్పటి వరకు ఏ బైక్ లో లేని కొత్త ఫీచర్లతో మోటర్రాడ్ విజన్ CE విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

మోటర్రాడ్ విజన్ CE కీ ఫీచర్లు

 

⦿ సేఫ్టీ కేజ్

Advertisement

మెటల్ ట్యూబ్ కంపోజిట్‌ తో కేజ్  స్ట్రక్చర్ ను రూపొందించింది. ఇది బైక్ నడిపే వారిని ప్రొటెక్ట్ చేయడంలో సాయపడుతుంది.  ఇతర బైక్ లకు భిన్నంగా సీట్ బెల్ట్ ను కలిగి ఉంటుంది. హెల్మెట్, జాకెట్ లాంటివి అవసరం లేకుండానే సేఫ్టీ ఇస్తుంది. ఈ బైక్ 2000లో వచ్చిన BMW C1 స్కూటర్ ను మోడ్రన్ గా రీ ఇమాజిన్ చేసినట్లు కంపెనీ ప్రకటించింది.

⦿ సెల్ఫ్ బ్యాలెన్సింగ్

ఈ బైక్ లో మరో ఫీచర్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్. ఈ బైక్ ఆగినప్పుడు స్కూటర్ ఆటో మేటిక్ గా బ్యాలెన్స్ అవుతుంది. కాలు కింద పెట్టాల్సిన అవసరం లేదు.  బిగినర్స్‌ కు ఈ బైక్ చాలా ఈజీ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

⦿ ఎలక్ట్రిక్ డ్రైవ్

Advertisement

ఈ బైక్ పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ లో అందుబాటులోకి రానుంది. ఎలాంటి కాలుష్య కారకాలను వెదజల్లదు. ఈ బైక్ BMW CE 04 మోడల్ టెక్నాలజీని బేస్ చేసుకుని తయారు చేసింది.

⦿ డిజైన్

లాంగ్ వీల్‌ బేస్, లో స్టాన్స్, బీచ్ బగ్గీ వైబ్ లాంటి డిజైన్ ను కలిగి ఉంటుంది. మ్యాట్ వైట్, బ్లాక్ కలర్స్‌ తో నియాన్ రెడ్ యాక్సెంట్స్ కలిగి ఉంటుంది. ఓపెన్, ఎయిరీ ఫీల్ ఇవ్వనుంది.

ఇక ఈ బైక్ కు సంబంధించి BMW జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే రివీల్ చేసింది. ప్రొడక్షన్ ప్లాన్స్ గురించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. BMW CE సిరీస్ కాన్సెప్ట్స్‌ ను త్వరగా ప్రొడక్షన్‌ కు తీసుకురాబోతోంది. ఇది సిటీ కమ్యూటింగ్‌ ను చాలా ఉపయోగపడుతుంది. రైడర్స్ ను క్యాజువల్ గా, సేఫ్ ఉంచుతుంది.

2026లో భారత్ లో లాంచ్ కాబోయే బైక్స్!  

BMW కంపెనీ 2026లో సరికొత్త బైక్స్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు మోడల్స్ రిలీజ్ కానుండగా, ఇండియాలో మాత్రం BMW F 450 GS అనే మోడల్ రిలీజ్ కాబోతోంది. ఇది TVSతో పార్టనర్‌షిప్‌ లో హోసూర్‌ లో రెడీ అవుతోంది. ఈ నెలలో లేదంటే వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఈ బైక్ ధర సుమారు రూ. 4.5 నుంచి రూ.5 లక్షలు ఉంటుంది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450, KTM 390 అడ్వెంచర్ కు గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: కారు టైర్ల తయారీ డేట్ చాలా ఇంపార్టెంట్.. కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Related News

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

Big Stories

Advertisement
×