E-Paper
Advertisement

EV Car Charging in Summer: సమ్మర్ లో ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్.. ఎంత సేపు చేస్తే మంచిది?

EV Car Charging in Summer: సమ్మర్ లో ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్.. ఎంత సేపు చేస్తే మంచిది?
Advertisement

Electric Car Charging Time in Summer: వేసవిలో ఎలక్ట్రిక్ కార్లకు ఛార్జింగ్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆటో నిపుణులు సూచిస్తున్నారు. ఎండా కాలంలో ఎంత సేఫ్ గా ఛార్జింగ్ చేస్తే, అంత మంచిది అంటున్నారు. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనానికి ఛార్జింగ్ చేయడానికి 30 నిమిషాల నుంచి 12 గంటల సమయం పడుతుంది. ఇది ఛార్జర్ రకం, బ్యాటరీ పరిమాణాన్ని బట్టి ఉంటుంది. వేడి వాతావరణం కొన్నిసార్లు బ్యాటరీ వేడెక్కకుండా రక్షించేందుకు ఛార్జింగ్ కాస్త నెమ్మదిగా అవుతుంది. తీవ్రమైన వేడి అంటే 35°Cకు పైగా ఉంటే బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్ నష్టాన్ని నివారించడానికి ఛార్జింగ్‌ ను స్లోగా అయ్యేలా చేస్తుంది.

వేసవిలో ఛార్జింగ్ టైమ్ డ్యూరేషన్   

⦿ పబ్లిక్ DC ఫాస్ట్ ఛార్జింగ్: 80 శాతం ఛార్జ్ అవ్వడానికి సాధారణంగా 20–60 నిమిషాలు పడుతుంది.

Advertisement

⦿ హోమ్ వాల్‌ బాక్స్ లెవల్ 2 ఛార్జింగ్: సాధారణంగా పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3–8 గంటలు పడుతుంది.

⦿ స్టాండర్డ్ సాకెట్ లెవల్ 1 ఛార్జింగ్: పూర్తిగా ఛార్జ్ చేయడానికి 8–20 గంటల వరకు సమయం పడుతుంది. సాధారణంగా వేడి వాతావరణంలో రోజువారీ ఉపయోగం కోసం ఈ ఛార్జింగ్ విధానాన్ని సిఫార్సు చేయరు.

సమ్మర్ లో ఛార్జింగ్‌ ను ప్రభావితం చేసే అంశాలు

Advertisement

⦿ బ్యాటరీ ఉష్ణోగ్రత: ఎక్కువ ఎండలో డ్రైవింగ్ చేయడం వల్ల బ్యాటరీ వేడిగా ఉంటే, వేడెక్కకుండా నిరోధించడానికి ఛార్జర్ ప్రారంభంలో నెమ్మదిగా ఛార్జింగ్ చేస్తుంది.

⦿ థర్మల్ థ్రోట్లింగ్: బ్యాటరీ ఎక్కువ ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడు, బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడటానికి BMS ఇన్‌ కమింగ్ పవర్‌ ను పరిమితం చేస్తుంది.

⦿ సామర్థ్యం తగ్గడం: ఎక్కువ వేడి ఛార్జింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. పూర్తి ఛార్జ్‌ ను చేరుకోవడానికి కొంచెం ఎక్కువ పవర్ అవసరం అవుతుంది.

⦿ క్యాబిన్ కూలింగ్:  ప్లగిన్ చేసినప్పుడు కారు క్యాబిన్‌ ను ప్రీ కండిషన్ చేస్తే, అది కొంత శక్తిని వినియోగిస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది.

Read Also: మెర్సిడెస్ బెంజ్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ వ్యాన్‌.. వామ్మో ఒకే ఛార్జ్ తో అంత దూరం వెళ్తుందా?

సమ్మర్ లో ఛార్జింగ్ ఎలా చేయాలి?   

⦿ నీడలో ఛార్జ్ చేయండి: ఎండ ఎక్కువగా ఉండే టైమ్ లో కంటే తెల్లవారుజామున, లేట్ నైట్ ఛార్జ్ చేయడం మంచిది.

⦿ కారు ఆపిన తర్వాత ఛార్జింగ్ చేయండి: కారు నడిపిన తర్వాత ప్లగ్ ఇన్ చేసే ముందు 10-15 కూల్ చేయాలి.

⦿ 80 శాతం ఛార్జ్ చేయండి: రోజువారీ ఉపయోగం కోసం, మీ ఛార్జింగ్ ను 20 శాతం నుంచి 80 వరకు చేయడం మంచిది.  ఇలా చేయడం వల్ల బ్యాటరీ వేడెక్కకుండా నిరోధిస్తుంది.

Read Also: సమ్మర్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్.. ఎంతసేపు చేస్తే మంచిది?

Related News

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

Big Stories

Advertisement
×