Rukmini Vasanth:ప్రముఖ కన్నడ ముద్దుగుమ్మ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రాంతీయంగా సక్సెస్ అందుకోకపోయినా.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.. కన్నడ పరిశ్రమకు చెందిన ఈమె తొలిసారి కన్నడ చిత్రం ‘బీర్బల్ ట్రైలాజీ కేస్1: ఫైండింగ్ వజ్రముని’ సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె.. ఆ తర్వాత ‘
సప్తసాగర దాచేయెల్లో: సైడ్ ఏ’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. హేమంత్ ఎం రావు తెరకెక్కించిన ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించగా.. ప్రముఖ హీరో రక్షిత్ శెట్టి (Rakshith Shetty) హీరోగా నటించారు.
తెలుగులో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddharth) హీరోగా వచ్చిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా ఈమెకు పెద్దగా గుర్తింపును అందివ్వలేదు. తర్వాత ‘కాంతార :చాప్టర్ 1’ సినిమాలో కనకావతి పాత్ర పోషించి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టేటస్ అందుకున్న ఈమె కొన్ని సన్నివేశాలలో హీరో రిషబ్ శెట్టిని కూడా డామినేట్ చేసింది అంటే ఇక ఆమె తన నటనతో ఏ విధంగా పాత్రకు ప్రాణం పోసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక అలాంటి ఈమె ప్రస్తుతం ఎన్టీఆర్(NTR ) – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాలో నటిస్తోంది . ప్రస్తుతం షూటింగ్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే . అలాగే కన్నడ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో కూడా ఈమె మరో హీరోయిన్గా నటిస్తోంది.
అలా ప్రస్తుతం వరుస క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా మారిన ఈమె.. ఇప్పుడు మరో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగమైనట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. ధనుష్(Dhanush ) సరసన నటించే అవకాశాన్ని పొందినట్లు తెలుస్తోంది. ‘లబ్బర్ పందు’ ఫేమ్ తమిళసన్ పచ్చముత్తు దర్శకత్వంలో ధనుష్ హీరోగా చేయనున్న కొత్త సినిమాలో రుక్మిణీ వసంత్ ను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. ఇదిలా ఉండగా మరొకవైపు ఇప్పటికే ఈమె ఏ. ఆర్.మురగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ‘మదరాసి’ సినిమాలో నటించి డిజాస్టర్ ను మూటగట్టుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ అదే కోలీవుడ్ కి చెందిన స్టార్ హీరో సినిమాలో అవకాశం లభించడం అంచనాలు పెంచేస్తోంది. ఏది ఏమైనా ప్రాంతీయంగా ఈమె చేసిన గత చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించకపోయినా.. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో ఆమె కెరియర్ మలుపు తిరుగుతుంది అనే విషయం మాత్రం స్పష్టంగా వ్యక్తం అవుతోంది.
also read: Tollywood: ఆ పార్ట్ కి కూడా మేకప్ వేసుకోవాలని బలవంత పెట్టారు.. ఎన్టీఆర్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్!