E-Paper
Advertisement

Kakinada Crime: రుణం తీర్చుకోలేక కాదు.. రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక! సామర్లకోటలో వ్యక్తి ఆత్మహత్య

Kakinada Crime: రుణం తీర్చుకోలేక కాదు.. రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక! సామర్లకోటలో వ్యక్తి ఆత్మహత్య
Advertisement

Kakinada Crime: కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన అత్యంత విషాదకరం. అప్పుల బాధ కంటే కూడా రికవరీ ఏజెంట్ల వేధింపులు ఒక మనిషి ప్రాణాన్ని తీసే వరకు వెళ్లడం సామాజికంగా ఆందోళన కలిగించే విషయం.

కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన కరణం ఉమామహేశ్వరరావు ఎనిమిది నెలల క్రితం ఓ ప్రైవేటు బ్యాంకు నుండి సుమారు రూ. 8 లక్షల వరకు రుణం తీసుకున్నారు. అయితే.. కొంతకాలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన నెలవారీ వడ్డీని సకాలంలో చెల్లించలేకపోయారు. ఇదే తరుణంలో బ్యాంకు రికవరీ ఏజెంట్లు ఆయనపై ఒత్తిడి పెంచడం ప్రారంభించారు.

Advertisement

వడ్డీ కట్టలేదన్న సాకుతో రికవరీ ఏజెంట్లు ఫోన్ల ద్వారా, ప్రత్యక్షంగా తీవ్రంగా వేధించేవారు. గౌరవప్రదంగా బతికే వ్యక్తి కావడంతో.. ఏజెంట్ల అసభ్య ప్రవర్తన, వేధింపుల వల్ల ఉమామహేశ్వరరావు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఆ మానసిక ఒత్తిడిని భరించలేక, చివరకు తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి ప్రాణం ఇలా గాలిలో కలిసిపోవడం స్థానికంగా కలకలం రేపింది.

ALSO READ:  మోండా మార్కెట్‌లో భారీ చోరీ.. 16 తులాల బంగారం మాయం

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×