E-Paper
Advertisement

TVS Apache RTR 160 vs Yamaha XSR 155: TVS అపాచీ RTR 160 vs యమహా XSR 155.. మైలేజీలో దుమ్మురేపే బైక్ ఇదే!

TVS Apache RTR 160 vs Yamaha XSR 155: TVS అపాచీ RTR 160 vs యమహా XSR 155.. మైలేజీలో దుమ్మురేపే బైక్ ఇదే!
Advertisement

TVS Apache RTR 160 vs Yamaha XSR 155 Comparison: యమహా, టీవీఎస్ కంపెనీల నుంచి క్రేజీ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి TVS అపాచీ RTR 160, యమహా XSR 155. ఈ రెండూ 150-160cc విభాగంలో మంచి పవర్, స్టైల్ ను కలిగి ఉన్నాయి. అపాచీ 159.7cc ఇంజన్‌ తో ఎక్కువ మైలేజ్  ఇస్తుంది. XSR 155 రెట్రో డిజైన్, శక్తివంతమైన ఇంజన్, ప్రీమియం లుక్‌ను కలిగి ఉండగా, అపాచీ మెరుగైన మైలేజ్, ఫీచర్లతో వాల్యూ ఫర్ మనీగా ఉంటుంది.

TVS అపాచీ RTR 160, యమహా XSR 155 కీలక తేడాలు  

ఇంజిన్, పవర్

TVS అపాచీ RTR 160 159.7 cc, ఎయిర్ కూల్డ్, సుమారు 15.82 – 17.31 bhp పవర్, 13.85 – 14.73 Nm టార్క్ ను కలిగి ఉంటుంది. యమహా XSR 155.. 155 cc, లిక్విడ్ కూల్డ్, 18.15 – 18.4 PS పవర్, 14.2 – 14.7 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుది. మైలేజ్ విషయానికి వస్తే.. TVS అపాచీ RTR 160 లీటర్ పెట్రోల్ కు సుమారు 45-61 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. యమహా XSR 155 లీటర్ కు సుమారు 45-50 కిలో మీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.

ధర వివరాలు

Advertisement

TVS అపాచీ RTR 160 సుమారు రూ. 1.12 నుంచి రూ. 1.16 లక్షల వరకు ఉంటుంది. యమహా XSR 155 సుమారు రూ. 1.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Read Also: బజాజ్ పల్సర్ 220 F vs హీరో ఎక్స్‌ట్రీమ్ 250R.. వీటిలో ఏది బెస్ట్ అంటే?

డిజైన్, ఫీచర్లు

Advertisement

అపాచీ అగ్రెసివ్ స్ట్రీట్ ఫైటర్ డిజైన్ ను కలిగి ఉంటుంది. XSR 155  రెట్రో స్టైల్ డిజైన్ తో వస్తుంది. అపాచీలో అర్బన్, రైన్, స్పోర్ట్ రైడింగ్ మోడ్స్  ఉంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, స్లిప్పర్ క్లచ్  లాంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇక XSR 155లో LED హెడ్‌ లైట్, USD ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి.

Read Also: న్యూ ఇయర్ టాప్ ట్రెండింగ్ క్రూయిజర్ బైక్స్ ఇవే.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఏ బైక్ కొనుగోలు చేయడం మంచిది?   

బడ్జెట్, ఫీచర్లు, మెరుగైన మైలేజ్ కోసం చూస్తుంటే TVS అపాచీ RTR 160 బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అలా కాకుండా రెట్రో లుక్, ఎక్కువ పవర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కావాలనుకుంటే యమహా XSR 155 సరైన ఎంపిక. రెండు బైక్స్ కూడా చూడ్డానికి చాలా మోడ్రన్ గా, అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటాయి. వీటిలో మీకు ఏ బైక్ బాగా నచ్చిందో చెప్పేయండి.

Read Also: యమహా To కవాసకి.. 2026లో ట్రెండింగ్ స్పోర్ట్స్ బైక్స్ ఇవే!

Related News

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

Big Stories

Advertisement
×