E-Paper
Advertisement

Bajaj Pulsar 220 F vs Hero Xtreme 250R: బజాజ్ పల్సర్ 220 F vs హీరో ఎక్స్‌ట్రీమ్ 250R.. వీటిలో ఏది బెస్ట్ అంటే?

Bajaj Pulsar 220 F vs Hero Xtreme 250R: బజాజ్ పల్సర్ 220 F vs హీరో ఎక్స్‌ట్రీమ్ 250R.. వీటిలో ఏది బెస్ట్ అంటే?
Advertisement

Bajaj Pulsar 220 F vs Hero Xtreme 250R Comparison: ఇండియన్ టూ వీలర్ మార్కెట్ లో బజాజ్, హీరో కంపెనీలు అదిరపోయే బైక్స్ తో సత్తా చాటుతున్నాయి. ఈ రెండు కంపెనీ నుంచి వచ్చిన సూపర్ బైక్స్ బజాజ్ పల్సర్ 220 F, హీరో ఎక్స్‌ ట్రీమ్ 250R. ఈ రెండూ ఇంచుమించు ఒకే ధరతో పాటు ఫీచర్లకు కూడా కాస్త తేడాతో సేమ్ ఉంటాయి. ఇంతకీ బజాజ్ పల్సర్ 220 F, హీరో ఎక్స్‌ ట్రీమ్ 250Rలో ఏ బైక్ బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే సమయంలో ఏ బైక్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనే వివరాలను తెలుసుకుందాం..

బజాజ్ పల్సర్ 220 F, హీరో ఎక్స్‌ ట్రీమ్ 250R మధ్య తేడాలు

పల్సర్ 220 F క్లాసిక్ పవర్, మంచి మైలేజ్, తక్కువ ధరతో వస్తే, ఎక్స్‌ ట్రీమ్ 250R 30 PS శక్తి, 25 Nm టార్క్, లేటెస్ట్  249cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ తో అత్యుత్తమ పని తీరును అందిస్తుంది. ఈ రెండు బైకుల ఇంజిన్, పనితీరును పరిశీలిస్తే, హీరో ఎక్స్‌ ట్రీమ్ 250R 249.03 cc, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ తో 30 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పల్సర్ 220 F 220 cc, ఆయిల్ కూల్డ్ ఇంజన్‌తో 20.9 PS పవర్ ను అందిస్తుంది. అంటే ఎక్స్‌ ట్రీమ్ 250R చాలా ఎక్కువ పవర్ ను కలిగి ఉంది. మైలేజ్ విషయానికి వస్తే బజాజ్ పల్సర్ 220 F లీటరుకు సుమారు 40 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250R లీటరుకు సుమారు 36 నుంచి 37 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

బజాజ్ పల్సర్ 220 F, హీరో ఎక్స్‌ ట్రీమ్ 250R ధరలు

Advertisement

బజాజ్ పల్సర్ 220 F అనేది రూ.1.28 నుంచి రూ.1.29 లక్షల ధరతో అందుబాటులో ఉంది. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250R ధర  సుమారు రూ. 1.66 లక్షలు ఉంటుంది. ఎక్స్‌ ట్రీమ్ 250R సుమారు రూ.37,000 నుంచి రూ.38,000 వరకు పల్సర్ 220 F కంటే ఎక్కువ ధరను కలిగి ఉంది.

బజాజ్ పల్సర్ 220 F, హీరో ఎక్స్‌ ట్రీమ్ 250R  డిజైన్

బజాజ్ పల్సర్ 220 F సెమీ ఫెయిర్డ్, క్లాసిక్ లుక్‌ తో వస్తే, ఎక్స్‌ ట్రీమ్ 250R నేక్డ్ లేదంటే స్పోర్టియర్ డిజైన్‌తో వస్తుంది.

Advertisement

Read Also: హోండా యాక్టివా To యమహా ఫాసినో.. లేడీస్ ఎక్కువగా ఇష్టపడే స్కూటర్లు ఇవే!

ఏ బైక్ కొనుగోలు చేయడం బెస్ట్?

ఒకవేళ మీరు క్లాసిక్ లుక్, లో మెయింటెనెన్స్ ఖర్చు, మెరుగైన మైలేజ్ కావాలంటే పల్సర్ 220 F కొనుగోలు చేయడం బెస్ట్.  ఎక్కువ పవర్, ఆధునిక ఫీచర్లు, 250cc క్లాస్ పెర్ఫార్మెన్స్ కావాలంటే, ఎక్స్‌ ట్రీమ్ 250Rను తీసుకోవడం మంచిది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఏ బైక్ కొనాలనుకుంటున్నారో చెప్పేయండి.

Read Also: న్యూ ఇయర్ టాప్ ట్రెండింగ్ క్రూయిజర్ బైక్స్ ఇవే.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×