E-Paper
Advertisement

Hemamalini: ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. హేమమాలిని ఎమోషనల్..

Hemamalini: ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. హేమమాలిని ఎమోషనల్..
Advertisement

Hema malini: ప్రతి ఏడాది భారత ప్రభుత్వం వివిధ రంగాలలో ఎనలేని కృషి చేసిన వారికి పద్మ అవార్డుల(Padma Awards)ను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్మ అవార్డుల జాబితా విడుదల చేసింది ఈ ఏడాది ఏకంగా 131 మందికి పద్మ అవార్డులను అందజేశారు. ఇక చిత్ర పరిశ్రమకు సంబంధించి పలువురికి పద్మ అవార్డులు వరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దివంగత నటుడు ధర్మేంద్ర(Dharmendra)కు సైతం పద్మ విభూషణ్ (padma vibhushan)ప్రకటించింది.

ఈ గౌరవానికి ఆయన అర్హుడు..

ధర్మేంద్రకు పద్మ విభూషణ అవార్డు రావడంతో ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్రకు పద్మ విభూషణ్ ప్రకటించడం పై ఆయన సతీమణి హేమాలిని(Hema Malini) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు . ఈ సందర్భంగా హేమ మాలిని తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. భారత ప్రభుత్వం ధర్మేంద్రకు ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డుకు ఈమె కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు అంతేకాకుండా ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకోవడానికి ఆయన పూర్తి అర్హులని పేర్కొన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోవడానికి ప్రస్తుతం ధర్మేంద్ర మన మధ్య లేకపోవడం కలిసి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మేంద్రకు పద్మ విభూషణ్…

Advertisement

ఇక ధర్మేంద్ర తన సినీ ప్రయాణంలో ఎప్పుడు అవార్డుల కోసం పాకులాడలేదని ఈమె ధర్మేంద్రకు ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డుపై స్పందిస్తూ ఎమోషనల్ అవుతూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది . దాదాపు ఏడు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగిన నటుడు ధర్మేంద్ర ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్నో పురస్కారాలను కూడా సొంతం చేసుకున్నారు. అయితే ఈయన ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement

ఇలా ధర్మేంద్ర మరణించిన తర్వాత ఆయనకు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఏడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన ధర్మేంద్ర 300కు పైగా సినిమాలలో నటించారు యాక్షన్ రొమాంటిక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈయన ప్రేక్షకుల మదిలో హీ మ్యాన్ గా గుర్తింపు పొందారు. ధర్మేంద్రకు నేడు “పద్మ విభూషణ్” అవార్డు వచ్చినప్పటికీ ఈయనకు 2012 వ సంవత్సరంలోనే భారత ప్రభుత్వం”పద్మభూషణ్” పురస్కారంతో సత్కరించింది. ఇక ధర్మేంద్ర సినీ కెరియర్ లో ఇప్పటివరకు ఎలాంటి ఫిలింఫేర్ అవార్డులు అందుకోకపోయినా పద్మ విభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. అలాగే ఈయన జీవిత సాఫల్య పురస్కారాలు కూడా అందుకున్నారు.

Also Read: David Reddy film: రెబల్ గా మంచు మనోజ్..డేవిడ్ రెడ్డి ఫస్ట్ లుక్ రిలీజ్

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×