BigTV English

2024 Scientific Developments| 2024లో టెక్నాలజీ ఎలా ఉండబోతోంది?.. అద్భుత ఏఐ.. ఎగిరే కార్లు అందుబాటులోకి వస్తాయా?

2024 Scientific Developments| 2024.. అనేక అధ్భుత ప్రయోగాలకు కేరాఫ్‌ కానుంది. ఇస్రోతో పాటు నాసా కీలక ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. మళ్లీ జాబిల్లిపై పాదం మోపేందుకు రంగం సిద్ధమవుతుండగా.. ఇక రోడ్లపై కాదు.. గాల్లో దూసుకెళ్లేందుకు కార్లు రెడీ అయిపోతున్నాయి. అంతేగాక అనేక నూతన ఆవిష్కరణలతో పాటు ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలేందుకు సిద్ధమవుతోంది.

2024 Scientific Developments| 2024లో టెక్నాలజీ ఎలా ఉండబోతోంది?.. అద్భుత ఏఐ.. ఎగిరే కార్లు అందుబాటులోకి వస్తాయా?

2024 Scientific Developments| 2024.. అనేక అధ్భుత ప్రయోగాలకు కేరాఫ్‌ కానుంది. ఇస్రోతో పాటు నాసా కీలక ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. మళ్లీ జాబిల్లిపై పాదం మోపేందుకు రంగం సిద్ధమవుతుండగా.. ఇక రోడ్లపై కాదు.. గాల్లో దూసుకెళ్లేందుకు కార్లు రెడీ అయిపోతున్నాయి. అంతేగాక అనేక నూతన ఆవిష్కరణలతో పాటు ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలేందుకు సిద్ధమవుతోంది.


భారత కీర్తిని ప్రపంచ దేశాల్లో ఆకాశాన్నందుకునేలా చేసిన భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం.. ఈ ఏడాది ఏకంగా 10 ప్రయోగాలను చేపట్టనుంది. ఇందులో 6 PSLV ప్రయోగాలతోపాటు 3 జీఎస్‌ఎల్వీ GSLV, ఒక లాంచ్ వెహికల్ మార్క్-3 ఉన్నాయి. ఆరు ఉపగ్రహాల్లో.. అంతరిక్ష పరిశోధన, భూ పరిశీలన ఉపగ్రహాలు, సాంకేతిక అభివృద్ధి కోసం 2 శాటిలైట్లు, 2 కమర్షియల్ శాటిలైట్లు ఉన్నాయి. వీటితో పాటు భారత్‌ చేపడుతున్న ప్రతిష్ఠాత్మక మిషన్‌ గగన్‌యాన్‌ ద్వారా కక్ష్య మాడ్యూల్‌ను నిర్ధారించుకునేందుకు మానవ రహిత మిషన్‌ను చేపట్టే ఆలోచనలో ఉంది ఇస్రో. వీటితో పాటు మంగళయాన్ 2 పేరుతో మళ్లీ అంగారకుడిపై ప్రయోగానికి మళ్లీ సిద్ధమవుతోంది. మంగళయాన్ 2 స్పేస్ క్రాఫ్ట్ లో 4 పేలోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా ఇస్రో ప్రకటించలేదు.

చంద్రుడిపై మరోసారి మానవ పాదం మోపేందుకు నాసా రెడీ అవుతోంది. నాసా అర్టెమిస్-1 మిషన్‌‌ను నవంబరు 16న ప్రయోగించింది. ఇది సక్సెస్ అవ్వడంతో 2024లో నాసా ఆర్టెమిస్-2 ప్రయోగం ద్వారా అస్ట్రోనాట్స్‌ను స్పేస్‌లోకి పంపనుంది. అది కూడా విజయవంతమైతే 2025లో అర్టెమిస్- 3 ద్వారా తొలి మహిళా వ్యోమగామిని చంద్రుడి మీదకి పంపించనుంది నాసా.


ప్రపంచం వ్యాప్తంగా రోజురోజుకు ఎలక్ట్రిక్‌ వాహనాల జోరు పెరుగుతుంది. వినియోగదారులు కూడా ఈవీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. 2024లో టాప్‌ కంపెనీలతో పాటు స్టార్టప్‌లు కూడా అనేక ఈవీలు లాంచ్‌ చేయనున్నాయి. భారత మార్కెట్‌లో ఇప్పటీకే ఈవీ స్కూటర్ల జోరు పెరిగింది. కాబట్టి అన్ని కంపెనీలు ఫీచర్లతో పాటు మైలేజ్‌ దృష్టిలో పెట్టుకుని ఈవీలు లాంచ్‌ చేయనున్నాయి. ఇప్పటికే విదేశీ కార్ల సంస్థలు ఈవీ కార్ల తయారీలో దూసుకుపోతుండగా.. దేశీయ కార్ల కంపెనీలు కూడా ఇప్పుడీ రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. దేశంలోనే ప్రముఖ కార్ల తయారీ కంపెనీలైన టాటా, మారుతీ సుజుకీ, మహీంద్రా, బీవైడీలు కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మకైన మార్పులకు కారణమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. 2024లో మరింత రాటు దేలనుంది. ఏకంగా మనిషిని పోలిన మెదడు సామర్థ్యం కలిగిన సూపర్ కంప్యూటర్‌పై ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. మనిషి మెదడులో న్యూరాన్‌ల నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుందో అదే పద్ధతిలో పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సైంటిస్టులు. 2024లో ఏప్రిల్ నాటికి ఈ సూపర్ కంప్యూటర్ అందుబాటులోకి రానుంది. సెన్సింగ్, బయోమెడికల్ రీసెర్చ్, రోబోటిక్స్, స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ పెద్ద-స్థాయి ఏఐ అప్లికేషన్‌లు వంటి వివిధ రంగాలలో పురోగతికి ఇది ఉపయోగపడనుంది. అంతేగాకుండా రోజువారీ జీవితంలో ఉపయోగపడే విధంగా జనరేటివ్ ఏఐ మోడల్స్ 2024లో డెవలప్ అవ్వనున్నాయి. ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, కమ్యూనికేషన్.. ఇలా కార్పొరేట్ సొల్యూషన్స్ నుంచి చేతికి పెట్టుకునే స్మార్ట్ వాచీ వరకూ అన్ని పరికరాల్లో ఏఐ మోడల్స్ అందుబాటులోకి వస్తాయి.

రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. ఎలక్ట్రిక్ కార్లను చూస్తామని ఎవరూ ఊహించలేదు కానీ ప్రస్తుతం రోడ్లపై మన కళ్ల ముందే చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు దీన్ని బీట్ చేసేలా అతి త్వరలోనే ఫ్లైయింగ్ కార్లను చూడబోతున్నామనడంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రపంచంలోని మొట్టమొదటి ఎగిరే కారు ఇప్పటికే ఫ్లైట్ సర్టిఫికెట్ పొందింది. అమెరికాకు చెందిన ఓ కార్ల తయారీ కంపెనీ ఇప్పుడు ఎగిరే కార్లను కూడా అందుబాటులో తెస్తోంది. అలెఫ్ ఏరోనాటిక్స్ తయారు చేస్తున్న ఫ్లయింగ్‌ కారు ఎగరడానికి యూఎస్‌ ప్రభుత్వం నుంచి చట్టపరమైన ఆమోదం పొందింది. ఈ విషయంలో చైనా ఎప్పుడో ముందుడుగు వేసింది. ఇప్పటికే చైనాలోని అన్హూయ్‌ ప్రావిన్స్‌లో ఇప్పటికే ఫ్లైయింగ్ ట్యాక్సీలు ప్రారంభమయ్యాయి. 2024లో మరికొన్ని దేశాల్లో ఈ ఫ్లైయింగ్‌ కార్ల ట్రెండ్ ప్రారంభం కావడం పక్కా.

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×