BigTV English

Covid : పెరుగుతున్న జేఎన్.1 కేసులు.. ఒడిశాలో తొలి కేసు నమోదు..

Covid : దేశంలో కొవిడ్‌-19 సబ్ వేరియంట్ ‘జేఎన్‌.1’ కేసులు మరింతగా పెరిగాయి. దేశవ్యాప్తంగా జేఎన్.1 కేసుల సంఖ్య 197కు చేరింది. కేరళలోనే అత్యధికంగా 83 కేసులు నమోదు అయినట్టు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం ప్రకటించింది. ఒడిశాలో ‘జేఎన్‌.1’ తొలి పాజిటివ్‌ కేసు నమోదు అయింది. ఇండియాలో ఇప్పటివరకు 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

కేరళలో అత్యధికంగా 83, గోవా (51), గుజరాత్ (34), కర్ణాటక (8), రాజస్థాన్ (5), మహారాష్ట్ర (8), తమిళనాడు (4), తెలంగాణ (2), ఒడిశా (1), ఢీల్లీ (1) కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా నవంబర్‌లో 17న సబ్‌వేరియంట్‌ కేసులను తొలిసారిగా గుర్తించారు. డిసెంబర్‌లోనే ఈ కొత్త వేరియంట్ కేసులు 180 నిర్ధారించినట్లు ‘ఇన్సాకాగ్‌’ ప్రకటించింది.

మరోవైపు లద్ధాఖ్‌లోని లేహ్‌ జిల్లాలో కేసులు పెరుగుతుండటంతో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కు‌లు తప్పనిసరిగా ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో పెరుగుతున్న కేసులు వల్ల అందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు దేశంలో 636 కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసులు సంఖ్య 4,394 కి చేరుకున్నాయి.

కొవిడ్ సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశలున్నాయని వైద్య అధికారులు ప్రకటించారు. అయితే ఈ వేరియంట్ తో ప్రమాదం తక్కువేనని వైద్యాధికారులు వెల్లడించారు. ‘జేఎన్‌.1’ సబ్ వేరియంట్ ని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×