BigTV English

Bhagavanth Kesari: భగవంత్ కేసరి ప్రపంచం లో ఆ ఐదు పాత్రలు.. అనిల్ రావిపూడి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ..

Bhagavanth Kesari: భగవంత్ కేసరి ప్రపంచం లో ఆ ఐదు పాత్రలు.. అనిల్ రావిపూడి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ..

Bhagavanth Kesari : నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో దసరాకు విడుదల కాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం భగవంత్ కేసరి. అక్టోబర్ 19 రిలీజ్ సిద్ధంగా ఉన్న ఈ చిత్రం పై ట్రైలర్,సాంగ్స్ ఇప్పటికే చాలా పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ మూవీకి తమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రానికి సంబంధించి అనిల్ రావిపూడి కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ షేర్ చేసుకోవడం జరిగింది.


భగవంత్ కేసరి సినిమాకి సంబంధించిన కొన్ని ఎక్స్ క్లూజివ్ పాయింట్స్ ను అనిల్ రివీల్ చేశారు. మొత్తానికి ఈ కథ ఐదు పాత్రలు, వాళ్ల మధ్య ఉన్న ఎమోషన్స్ మీద ఆధారపడి ముందుకు సాగుతుంది. ఇందులో మొదటి పాత్ర విజ్జి.. ఆమె తన ఎమోషన్స్ ను ఒక గోల్ వైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేసే తరుణంలో తన కోసం భగవంత్ కేసరి ఏం చేశాడో తెలుస్తుంది. నెక్స్ట్ క్యారెక్టర్ భగవంత్ కేసరి.. ఇది కాస్త సస్పెన్స్ అనుకోండి.

ఇక నెక్స్ట్ ఈ మూవీకి ఎంతో ఇంపార్టెంట్ అయిన విలన్ క్యారెక్టర్. అదే రాహుల్ పాత్ర. భగవంత్ కేసరితో రాహుల్ యుద్ధం మూవీని ఓ రేంజ్ కు తీసుకెళ్తుంది. ఈ క్యారెక్టర్ గురించి రాసుకున్నప్పుడే దీనికి అర్జున్ రాంపాల్ మాత్రమే సెట్ అవుతాడు అని ఫిక్స్ అయిపోయారట. నిజంగా మూవీ లో రాహుల్ క్యారెక్టర్ లో అర్జున్ రాంపాల్ యాక్షన్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది అని టాక్. సినిమా కోసం తెలుగు నేర్చుకుని మరి సొంతగా డబ్బింగ్ చెప్పాడంటే.. యాక్టింగ్ పై అతనికి ఏ లెవల్లో డెడికేషన్ ఉందో తెలుస్తుందని అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించాడు.


ఇక ఆ తర్వాత వచ్చే పాత్ర సైకాలజిస్ట్ గా కాజల్ పాత్ర. ఈ మూవీలో కాజల్ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది. ఇక కాజల్ కి, బాలయ్య కి మధ్య సీన్స్ ఎక్స్ లెంట్ గా ఉన్నాయని అనిల్ అన్నాడు. మరి ఇవన్నీ ఆన్ స్క్రీన్ చూసి ఆనందించాల్సిందే తప్ప ఎక్స్ లెంట్ చేస్తే అవ్వదు కదా. ఇక ఆ తర్వాత పాత్రలు భగవంత్ కేసరిని ప్రోత్సహించే జైలర్ శరత్ కుమార్ , జయ చిత్ర లకు సంబంధించినవి. మూవీలో వీళ్ళ ప్రభావం చాలా ఎక్కువే. ఇలా ఈ ఐదు పాత్రల మధ్య భగవంత్ కేసరి ప్రపంచం ఉంటుంది అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇది ఒక హై యాక్షన్ ఎమోషనల్ మూవీ అని అనిల్ రావిపూడి వెల్లడించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ యాక్షన్ గురించి కూడా అనిల్ రావిపూడి ఓ రేంజ్ లో పొగిడేసాడు. “చిన్నప్పటి నుంచి బాలయ్య సినిమాలు చూస్తూ పెరిగాను. ముఖ్యంగా ఆయనకున్న ఫాలోయింగ్ ఏ లెవెల్ లో ఉంటుందో నాకు తెలుసు. సమరసింహారెడ్డి , నరసింహనాయుడు లాంటి సినిమాలలో ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేశాను. అలాంటి నాకు బాలయ్యతో ఇలాంటి సినిమా చేసే అవకాశం రావడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి” అని అనిల్ రావిపూడి చెప్పాడు. మొన్న సంక్రాంతికి వీరసింహారెడ్డి వీర విహారం చేసింది మరి ఈ దసరాకి భగవంత్ కేసరి ఎంత బీభత్సం సృష్టిస్తాడో చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×