The Family Man 3 Trailer: ప్రముఖ దర్శకులు రాజ్ (Raj)అండ్ డీకే(DK) ద్వయం దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిరీస్ లలో ది ఫ్యామిలీ మెన్ సిరీస్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇప్పటికే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ త్వరలోనే మూడవ భాగం కూడా విడుదలకు సిద్ధమవుతోంది ఈ క్రమంలోనే తాజాగా ది ఫ్యామిలీ మెన్ 3 (The Family Man 3)నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సిరీస్ కూడా భారీ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఉండబోతుందని స్పష్టం అవుతుంది. ఈ స్పై యాక్షన్ త్రిల్లర్ సిరీస్ లో మనోజ్ బాజ్ పాయ్ సందడి చేశారు.
ఈ ట్రైలర్ ప్రారంభంలోనే మనోజ్ బాజ్ పాయ్ తాను ఒక స్పై ఏజెంట్ అంటూ తన కుటుంబ సభ్యులతో మాట్లాడటంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అదే సమయంలోనే ఆయనని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ప్రకటిస్తూ అరెస్ట్ వారెంట్లను కూడా జారీ చేస్తారు. మనోజ్ బాజ్ పాయ్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఈయన తన కుటుంబ సభ్యులతో కలిసి పారిపోవడం జరుగుతుంది. ఆ సమయంలో మనోజ్ ప్రాణ స్నేహితుడైన షరీబ్ హష్మి తనకు సహాయం చేస్తారు అయితే తనని ఈ కుట్రలో భాగం చేసింది ఎవరు అనే ఆలోచనలో మనోజ్ఉంటారు. ఇదే సమయంలోనే నిమ్రత్ కౌర్ పాత్ర రంగంలోకి దిగడంతో ఈ ట్రైలర్ మరింత ఆసక్తికరంగా మారటమే కాకుండా ఈ సీజన్ పై మరిన్ని అంచనాలను కూడా పెంచేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సిరీస్ పట్ల మంచి అంచనాలు పెరిగిపోయాయి. ఇక మీ ఫ్యామిలీ మెన్ 3 నవంబర్ 21వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాబోతోంది.