BigTV English

Kiran Royal Vs Lakshmi Reddy: రాయల్‌తో రాజీ పడ్డ లక్ష్మి.. కారణం ఇదేనా?

Kiran Royal Vs Lakshmi Reddy: రాయల్‌తో రాజీ పడ్డ లక్ష్మి.. కారణం ఇదేనా?

Kiran Royal Vs Lakshmi Reddy: తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్‌పై అరోపణలు చేసి కేసులు పెట్టిన లక్ష్మిరెడ్డి అలియాస్ లక్ష్మి యూ టర్న్ తీసుకుంది. గతం గత: అంటూ.. ఇక తాను కిరణ్ రాయల్ తో గొడవ పడనని రాజీ మార్గంలో ఉంటానని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది తాను కాదంట. పోస్టులకు తనకు ఎలాంటి సంబంధం లేదంట. అయితే ఇదే సమయంలో తన వద్ద కిరణ్ రాయల్ వీడియోలు ఏడాది క్రితమే జనసేన ముఖ్య నేత ఒకరు తీసుకున్నాడని సరికొత్త బాంబు పేల్చింది. అసలు రెండు రోజుల క్రితం వరకు కిరణ్ రాయల్ కు వ్యతిరేకంగా నానా యాగీ చేసిన లక్ష్మి ఎందుకు యూ టర్న్ తీసుకుంది? కిరణ్ రాయల్ ను టార్గెట్ చేయడం వెనుక కుట్ర కోణం ఉందా?


పదేళ్లుగా జనసేన వాయిస్ వినిపించిన కిరణ్‌రాయల్

జనసేన వాయిస్‌గా గత పది సంవత్సరాల నుంచి తిరుపతి జనసేన ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ పనిచేశారు. జనసేన పార్టీపై, పవన్‌కళ్యాణ్‌పై విమర్శలను తనదైన స్టైల్లో తిప్పికొడుతూ రాష్ట్రవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు . అయితే ఇదే సమయంలో వ్యక్తిగతంగా పార్టీతో పాటు బయట కూడా శత్రువులను పెంచుకున్నారు. ఇక ఆయన వ్యక్తిగత వ్యవహారాలు ఆయనకున్నాయంటారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల ముందు తిరుపతి టికెట్ కోసం కిరణ్‌రాయల్ ప్రయత్నించారు. కిరణ్ రాయల్ తో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్ కూడా ప్రయత్నాలు సాగించారు.


ఆరణి శ్రీనివాసులుని పవన్ దగ్గరకు తీసుకెళ్లిన కిరణ్ రాయల్

అయితే అప్పటి చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులుకి తిరుపతి జనసేన టికెట్ దక్కింది. ఆరణి శ్రీనివాసుల్ని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్లింది కిరణ్‌రాయలే అని చెపుతారు. తర్వాత ఆరణికి టికెట్ వచ్చినప్పుడు వ్యతిరేకించింది కూడా కిరణ్‌ రాయలే. వారి మధ్య అవే గొడవలు ఇంకా కొనసాగుతున్నాయంట. పార్టీలో ఇప్పుడు కిరణ్ రాయల్ ది ఓ గ్రూపు, ఎంఎల్ ఎ అరణీ శ్రీనివాసులది ఓ గ్రూపు నడిచేది. ఎమ్మెల్యే వర్గానికి వ్యతిరేకంగా మీడియాలో ఏ వార్త వచ్చిన కిరణ్ రాయల్ లీక్ చేస్తున్నాడనే అనుమానులు అవతలి గ్రూపులో రావడం మొదలైంది. అయితే కిరణ్ రాయల్ మాత్రం తన దైన శైలిలో వైసీపీలోని కీలక నాయకులపై విమర్శలు చేస్తూ వార్తలలో నిలిచారు.

లక్ష్మిరెడ్డిని సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు

ఈ నేపధ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ సమయంలో బాంబు పేలింది. లక్ష్మి రెడ్డి అనే మహిళ కిరణ్ రాయల్ పై అధారాలతో సహా మీడియా ముందుకు వచ్చి వీడియోలు విడుదల చేసింది. తనను కోటి 20 లక్ష్లల రూపాయలు మోసం చేసాడని, అన్ని రకాలుగా వాడుకున్నాడని అరోపించింది. వీళ్లిద్దరి వ్యవహారం పదిరోజులు పాటు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పరస్పరం కేసులు పెట్టుకున్నారు. తర్వాత లక్ష్మిరెడ్డిని సైబర్‌ క్రైమ్ కేసులో జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయడం.. వైసీపీ లాయర్లు అమెను విడుదల చేయించడం చకచక జరిగిపోయాయి. తాజాగా రెండు రోజుల క్రితం మీడియాకు వైసిపి లాయర్లు కొన్ని లీకులు కూడా ఇచ్చారు. కిరణ్ రాయల్ బెదిరిస్తున్నాడని.. ఆయన వేధింపులు తట్టుకోలేక లక్ష్మి సూసైడ్ చేసుకుంటుందని మీడియాకు ఉప్పు అందించారు.

సడెన్‌గా రాజీ మంత్రం పఠిస్తున్న లక్ష్మిరెడ్డి

రొమాంటిక్ వీడియోలతో కిరణ్‌రాయల్‌‌తో పాటు తన పరువు కూడా బజారున పడేసుకుని.. అంత తతంగం నడిపించిన లక్ష్మి ఉన్నట్లుండి మీడియా ముందుకు వచ్చి గతం గత: అంటు రాజీ మంత్రం వల్లించింది. ఇకపై తనకు కిరణ్ రాయల్ మధ్య వివాదాలను రాజీచేసుకుంటానని ప్రకటించింది. అదే సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు తాను బాధ్యురాలిని కాదని.. తన దగ్గరున్న వీడియోలు ఏడాది క్రితం జనసేనకు చెందిన ఒక ముఖ్యనేత తీసుకున్నాడని బాంబు పేల్చింది. తన వెనుక రాజకీయ పార్టీలు ఎవీ లేవంటూనే.. తన ఉదంతాన్ని వారు వాడుకున్నారని విచిత్రమైన లాజిక్ వినిపించింది.

తిరుపతి టికెట్ కోసం సీరియస్‌గా ప్రయత్నించిన హరిప్రసాద్

జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హారి ప్రసాద్ అప్పట్లో సీరియస్‌గా తిరుపతి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే అర్థిక కారణాల వల్ల పోటీకి దూరంగా ఉన్నట్లు అయన అనుచరులు చెప్పుకొచ్చారు. కిరణ్ రాయల్ అప్పట్లో సీరియస్ గా టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ చివరికి అర్థిక కారణాలు అన్నారు. అయితే వారిద్దరు ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకున్నారన్న టాక్ నడిచింది. సరిగ్గా అప్పుడే జనసేనలోనే ఉన్న గ్రూప్‌ పాలిటిక్స్‌ తోడు లక్ష్మిరెడ్డి ఇష్యూను వైసీపీ క్యాష్‌ చేసుకోవాలని ప్రయత్నం చేసిందంట. కిరణ్ రాయల్ అభ్యర్థి అయితే ఆ వీడియోలు విడుదల చేయాలని వైసీపీ నేతలు పెద్ద స్కెచ్చే గీశారంట.

Also Read: పార్టీ లైన్ దాటితే! ఆ నేతలకు బాబు వార్నింగ్

వైసీపీ లాయర్లు చెబుతున్నట్లు కిరణ్ రాయల్ బెదిరించారా?

ఇప్పుడు లక్ష్మి యు టర్న్ వెనుక ఎవ్వరున్నారు? వైసీపీ లాయర్లు చెబుతున్నట్లు కిరణ్ రాయల్ బెదిరించారా? లేక రాజీకి వస్త కిరణ్ రాయల్ డబ్బులు ఇస్తానన్నారా? అసలేం జరిగిందన్నది తిరుపతిలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కిరణ్ రాయల్ రాజకీయంగా నష్టపోతే.. లక్ష్మి రెడ్డి సామాజికంగా నష్ట పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వీళ్లిద్దరి వ్యవహారం లబ్ధి పొందింది మాత్రం జనసేనలోని కిరణ్ రాయల్ ప్రత్యర్థి వర్గంతో పాటు వైసీపీ నేతలు అని అంటున్నారు. మొత్తం మీదా లక్ష్మిరెడ్డి ఎపిసోడ్ వెనుక జిల్లాలోని వైసిపి అగ్ర నాయకులు కూడా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కర్ణుడి చావుకు అనేక కారణాలు ఉన్నట్లు కిరణ్ రాయల్ విషయంలో కూడా అనేక మంది శత్రువులు ఓక్కటయ్యారని అంటున్నారు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×