BigTV English

Brahmamudi Serial Today March 5th : ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ను బ్లాక్‌ మెయిల్ చేసిన యామిని – యామిని పోలీసులకు పట్టించిన రాజ్‌

Brahmamudi Serial Today March 5th : ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ను బ్లాక్‌ మెయిల్ చేసిన యామిని – యామిని పోలీసులకు పట్టించిన రాజ్‌

Brahmamudi serial today Episode: రాజ్‌కు యామిని వాయిస్‌ మెసేజ్‌ చేస్తుంది. మెసేజ్‌ ఓపెన్‌ చేసి విన్న రాజ్‌ షాక్‌ అవుతాడు. నీకో సర్‌ఫ్రైజ్‌ మీ హాల్లో ఉంది. అందరూ వచ్చే టైంకు వెళ్లి ఆ సర్‌ఫ్రైజ్‌ ఏంటో చూడు వెళ్లు అని వాయిస్‌ మెసేజ్‌లో ఉంటుంది. రాజ్‌ వెంటనే హాల్లోకి వెళ్లగానే.. అక్కడ యామినితో రాజ్‌ ఉన్న ఫోటోలు చెల్లాచెదురుగా పడి ఉంటాయి. వాటిని చూసి రాజ్‌ షాక్‌ అవుతాడు. వెంటనే ఇంకో మెసేజ్‌ వస్తుంది. అందులో యామిని మన గతం నీ దారి పొడవునా కనిపిస్తుందా..? ఈ గతాన్ని నీ భార్య చూస్తే ఏమవుతుంది. నీ ఇంట్లో వాళ్లు చూస్తే ఏమవుతుంది. అందరూ నిద్ర లేవకముందే గతాన్ని నిద్ర పుచ్చు.. లేదంటే నీ భవిష్యత్తు గందరగోళంగా మారిపోతుంది అని చెప్పగానే.. రాజ్‌ ఫోటోలన్నీ ఏరుతుంటాడు. ఇంతలో రూంలోంచి సుభాష్‌ వస్తాడు. సుభాష్‌ వచ్చే సరికి అంతా క్లీన్‌ చేసి సోఫా కింద పెట్టి కూర్చుంటాడు.


ఇంతలో ఒక్కోక్కరుగా వస్తుంటారు. కావ్య వచ్చి ఏవండి ముందే లేచి వచ్చారేంటి అని అడుగుతుంది. రాజ్ మెలుకువ వచ్చింది అందుకే వచ్చాను అని చెప్తాడు. రాత్రి సరిగ్గా నిద్రపోయినట్టు లేదు.. కాసేపు పడుకోలేకపోయారా..? అంటుంది. రాజ్‌ మళ్లీ నిద్ర వస్తే పడుకుంటాలే అంటాడు. ఇంతలో సుభాష్‌ కాస్త అటు జరగరా..? అంటాడు. నేను జరగలేను డాడీ పక్కన కూర్చోండి అంటాడు. ఇంతలో రుద్రాణి ఏమైంది రాజ్‌ అని అడుగుతుంది. బ్యాక్‌ పెయిన్‌ అని ప్రతి ఒక్కరికీ బొట్టు పెట్టి చెప్పాలా..? అని విసుగ్గా తిట్టగానే.. సుభాష్‌ పక్కన కూర్చుంటాడు. కావ్య కాఫీ తీసుకురావడానికి కిచెన్‌లోకి వెళ్తుంటే.. రాజ్‌కు యామని మెసేజ్‌ చేస్తుంది. హాల్ లో ఫోటోలు తీస్తే సరిపోతుందా..? కిచెన్‌లో ఎవరు తీస్తారు.. నీ భార్య తీస్తే అని మెసేజ్‌ చదివిన వెంటనే రాజ్‌ షాకింగ్‌ గా గట్టిగా కళావతి అని అరుస్తాడు.

అందరూ షాక్‌ అవుతారు. కావ్య కంగారుగా తిరిగి వచ్చి ఏవండి ఏమైంది నొప్పి ఎక్కువ అవుతుందా..? అని అడుగుతుంది. నా ఫోన్‌ పైన మర్చిపోయాను అని చెప్తాడు. కావ్య ఫోన్‌ తీసుకురావడానికి వెళ్తుంది. రాజ్‌ కిచెన్‌లోకి వెళ్లి అక్కడున్న ఫోటోలు తీసుకుంటాడు. ఇంతలో యామిని నుంచి మరో మెసేజ్‌ వస్తుంది.  మెసేజ్‌ చూస్తూ రాజ్‌ హాల్లోకి వస్తాడు. పైనుంచి వచ్చిన కావ్య కోపంగా ఏవండి ఫోన్‌ మీ దగ్గరే ఉంది కదా నన్నెందుకు పైకి పంపించారు అని అడుగుతుంది. సారీ చెప్పి రాజ్‌ పైకి వెళ్లిపోతాడు. సుభాష్‌ ఏమైందమ్మా వాడికి అని అడుగుతాడు. ఓరేయ్‌ వాడు రాత్రి నిద్ర పోలేదు అంట కదా ఏదో అలా బిహేవ్‌ చేస్తున్నాడు అని  ఇందిరాదేవి చెప్తుంది.


తర్వాత రాజ్‌ హాస్పిటల్ కు ఫోన్‌ చేసి డ్రగ్‌ అడిక్ట్‌ అయిన పేషెంట్‌ యామిని ఉన్నారా..? అని అడుగుతాడు. లేరని రెండు రోజుల క్రితమే డిష్చార్జ్‌ అయి వెళ్లిపోయారు. మీరు స్వరాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్త్ర్టీస్‌ ఎండీ రాజ్‌ కదూ అని అడుగుతాడు. అవును నా పేరు మీకెలా తెలుసు..అని రాజ్‌ అడగ్గానే.. యామిని గారే చెప్పారు.. మీరు ఫోన్‌ చేస్తారని చేస్తే తన అడ్రస్‌ మీకు ఇవ్వమని చెప్పారు. ఈ నెంబర్‌కు అడ్రస్‌ మెసేజ్‌ చేస్తాను అని చెప్తాడు. మెసేజ్‌ రాగానే.. రాజ్‌ కారులో వెళ్తూ.. యామినితో కాలేజ్‌ డేస్‌ గుర్తు చేసుకుంటాడు రాజ్‌.

తను యామిని లవ్‌ చేసుకున్న విషయాలను జ్ఞాపకం చేసుకుంటాడు. తర్వాత యామిని శాడిజాన్ని గుర్తు చేసుకుంటాడు. యామిని సూసైడ్‌ అటెంప్ట్‌ చేసుకున్నవిషయం గుర్తు చేసుకుంటాడు. తర్వాత యామినిని పోలీసులకు పట్టించిన విషయం గుర్తు చేసుకుంటాడు. ఆ రోజుతో యామిని చాప్టర్‌ క్లోజ్‌ అయిపోయిందనుకుంటాడు. యామిని డ్రగ్‌ అడిక్ట్‌ అయిన విషయం.. రాజ్‌ హాస్టల్‌ కు వెళ్లి మళ్లీ సూసైడ్‌ అటెంప్ట్ చేసిన విషయం గుర్తు చేసుకుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Stories

×