Singer Kalpana Update : సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం చాలా కష్టం.. వచ్చిన తర్వాత అవి ఉంటాయో పోతాయో ఊహించడం కష్టం.. మనలో ఎంత టాలెంట్ ఉన్నా సరే ఆవగింజంత అదృష్టం లేకపోతే మన బ్రతుకులు ఆవిరి అయిపోతాయని పెద్దలు ఊరికే అనలేదు. ఈ పరిస్థితి కేవలం నటీనటులకు మాత్రమే కాదు సింగర్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. టాలీవుడ్ లో గాయకులకు ఎదురవుతున్న సమస్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఒకప్పుడు వరుసగా సినిమాల్లో పాటలు పాడిన అనేక మంది సీనియర్ సింగర్స్ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.. కొందరు వేరే మార్గాలను వెతుక్కుంటే మరికొందరు మాత్రం ఎప్పటికైన అవకాశాలు రాకుండా పోవు అని ఎదురుచూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతుండటంతో ఇక చేసేదేమి లేక తనువు చాలీస్తున్నారు. తాజాగా తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలకు తన మధురమైన గాత్రాన్ని ఇచ్చిన కల్పన సూసైడ్ అటెంప్ట్ చెయ్యడం చర్చనీయాంశంగా మారింది.. తాజాగా ఆమె హెల్త్ అప్డేట్ ను డాక్టర్లు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందాం..
ప్రముఖ సింగర్ కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన కల్పన, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటిగా కూడా గుర్తింపు పొందారు. ఆమెకు గతంలోనూ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని, సింగర్ చిత్ర ధైర్యం చెప్పడంతో ఆగిపోయానని తెలిపారు. నిజాంపేటలోని ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కల్పన, రెండు రోజులుగా తలుపు తీయకపోవడంతో స్థానికులు ఆమె భర్త ప్రసాద్‌కు సమాచారం అందించారు. ప్రసాద్ చెన్నై నుండి వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా కల్పన స్పృహ లేకుండా పడి ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఆమె భర్త ప్రసాద్‌ను విచారిస్తున్నారు. ఆయన రెండు రోజులుగా తాను ఇంట్లో లేనని సమాధానమిచ్చారు. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కల్పన.. ఎందుకిలా ఆత్మహత్యకు పాల్పడింది అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.. అయితే తాజాగా ఆమె హెల్త్ అప్డేట్ ను డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. త్వరలోనే కోలుకుంటుందని అంటున్నారు. ఈ వార్త విన్న ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈమె సింగర్ గానే సెటిల్ అయ్యింది. అయితే తనకు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత 2010లో తన భర్తతో విడిపోయానని చాలాకాలం క్రితం పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన లైఫ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది కల్పన. అప్పట్లో తన పిల్లలను చదివించుకునే అవకాశం లేక ఏం తోచని పరిస్థితిలో మిగిలిపోయానని తెలిపింది. ఎలా జీవించాలో తెలియక ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని అనుకున్నట్టు బయటపెట్టింది. కానీ అదే సమయంలో సింగర్ చిత్రకు తన కష్టం గురించి తెలిసి ధైర్యం చెప్పారని, ఆత్మహత్య చేసుకోకుండా ఆపారని చెప్పుకొచ్చింది.. కానీ ఇప్పుడు ఈమె సూసైడ్ వెనుక కారణాలు ఏంటా అని పోలీసులు తెలుసుకోనే ప్రయత్నం చేస్తున్నారు.. త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది…