CM Chandrababu: వైసిపిలోని వారికి పనులు చేయిస్తే పాముకు పాలు పోసినట్లే అని ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖల వెనుక ఆంత్యరమేంటని తెలుగు తమ్ముళ్లతో పాటు కూటమి నేతలు సైతం విస్తృతంగా చర్చించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీలోని నాయకులతో టీడీపీలోని కొందరు లోపాయి కారీ ఒప్పందాలు కుదుర్చుకుని పనులు చేయించి పెడుతున్నారన్న ప్రచారం ఉంది. వైసీపీ ప్రభుత్వానికి వీరవిధేయులుగా పనిచేసిన ఉద్యోగులు సైతం కూటమి ప్రజా ప్రతినిధుల వద్ద చక్రం తిప్పుతున్నారంటున్నారు. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకునే సీఎం సదరు వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్న లోకేష్, తాజా చంద్రబాబు అలా సున్నితంగా వార్నింగ్ ఇస్తున్నట్లు మాట్లాడటంతో.. పార్టీ లైన్ దాటుతున్న నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయంట.
వైసీపీ నేతల పెత్తనంపై కూటమి శ్రేణుల ఫిర్యాదులు
ప్రభుత్వం మారి తొమ్మిది నెలలు అయినా పలుచోట్ల వైసీపీ మూలాలు ఉన్నవాళ్లే పెత్తనం చేస్తున్నారని కూటమి పార్టీల క్యాడర్లు సీరియస్‌గా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నాయంట. దానికితోడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి విధేయత ప్రదర్శించిన యంత్రంగం అంతా ఇప్పుడు మరో సారి హాడావుడి చేస్తున్నారనేది అతిపెద్ద కంప్లయింట్ గా మారింది. పలు దఫాలుగా టీడీపీ శ్రేణులు ఈ విషయాలపై పలు మార్గాల ద్వారా సీఎంఓ నుంచి ఇన్ చార్జ్ మంత్రి వరకు ఫిర్యాదులు చేశారంట. ఆ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయంట. ఆ మాటలు జీడి నెల్లూరు నేతలకు పరిమితమా లేక జిల్లా అంతటికి వర్తిస్తుందా అన్న చర్చ మొదలయింది.
ఎమ్మెల్యేల చుట్టూ చేరి వైసీపీ నేతల పెత్తనం
జిడి నెల్లూరు నియోజకవర్గంలో పెత్తనం మొత్తం వైసీపీ నేతల చేతుల్లోకి పోయిందని క్యాడర్ అంటోంది. గతంలో చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానికి పనిచేసిన వైసీపీ నేతలంతా ఇప్పడు టీడీపీ ఎమ్మెల్యే థామస్ చుట్టు చేరిపోయి పెత్తనం చేస్తున్నారంట. నియోజకవర్గంలో ఈ మధ్య జరిగిన సిమెంట్ రోడ్ల నిర్మాణం పనులన్నీ వైసీపీ నేతలే చేసారంట. దానికి తోడు ఇసుక, గ్రావెల్, క్యారీల పెత్తనము అంతా వారు దగ్గరుండి చేసున్నారంట. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలు ఎక్కువయ్యారని టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయంట. గతంలో వైసీపీ మీడియాలో పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్యే పిఅర్‌ఓగా ఉండగా విజయానందరెడ్డి దగ్గర పనిచేసిన వారి పెత్తనం నియోజకవర్గంలో పెరిగిందన్న విమర్శలు వస్తున్నాయి.
సమయం చూసి చెక్ పెడతారని ఎగురుచూస్తున్న క్యాడర్
వైసీపీ ప్రభుత్వ హయాంలో అలుపెరుగని పోరాటం చేసి, నానా ఇబ్బందులు ఎదుర్కొన్న తెలుగు తమ్ముళ్లు అసలు అధికారం ఎవరిది అని ప్రశ్నించే స్థితిలో ఉన్నారంట. చివరకు చంద్రబాబు సమావేశానికి ముందు సైతం ఎవరూ చంద్రబాబుకు పిర్యాదలు చేయకూడదని స్థానిక ప్రజా ప్రతినిధితో పాటు ఆయన కోటరీ నేతలు అల్టిమేటం ఇచ్చారంట. అయితే బాబు గారికి తెలియకుండా ఉంటుందా.. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడ లేదని అనుకున్నట్లుంది వ్వవహారం అని.. అప్పటికే జరుగుతున్న వ్యవహారంపై ఫిర్యాదులు చేసిన టీడీపీ వారు యద్దేవా చేస్తున్నారు. ద్దాయనకు అంతా తెలుసు చెక్ పెట్టే సమయానికి పెడతారని సమావేశానికి వచ్చిన క్యాడర్ చర్చించుకోవడం కనిపించింది.
చంద్రబాబును కలవడానికి వచ్చిన మహిళను అడ్డుకున్న పోలీసులు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెజార్టీ నియోజకవర్గాలలో ఇదే విదమైన పెత్తనం సాగుతుందని అంటున్నారు. పుంగనూరు నుంచి వచ్చి చంద్రబాబును కలవడానికి వచ్చిన ఒక మహిళ.. బందోబస్తు డ్యూటీలో ఉన్న పుంగనూరు సిఐ అడ్డుకున్నాడని అరోపించింది. పుంగనూరులో టీడీపీ ఇన్‌చార్జ్ చల్లా బాబు రెడ్డి అనుచరుడు వైసీపీ నేతలతో కలసి తన భూమిని అక్రమించాడని ఆ మహిళ అరోపణగా ఉంది. చిత్తూరు జిల్లాలో అధికారుల వ్యవహారం కూడా వైసీపీకి అనుకూలంగా ఉందంట. స్బీలో ఉన్న కీలక అధికారి ఒకరు మొత్తం జిల్లాలో జరిగే రాజకీయ పరిణామాలను డే టు డే వైసీపీకి పంపుతున్నాడని ఆరోపణలున్నాయి. తను బదిలీ కాకుండా మూడు సంవత్సరాలుగా అక్కడే అంటిపెట్టుకుని ఉన్నాడంట.
చెవిరెడ్డికి ఓఎస్టాగా పనిచేసిన వ్యక్తికి కీలక పోస్టింగ్
ఇక చెవిరెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తికి జిల్లా అత్యంత కీలక మైన పోస్టింగ్ ఇచ్చారు. అదే విదంగా అప్పట్లో హాడావుడి చేసిన వారు కీలక పోస్టులలో కొనసాగుతున్నారంట .. దీంతో పాటు తిరుచానూరులో వైసీపీకి వంత పాడిన అధికారికి ప్రమోషన్ ఇచ్చి మరీ తిరుపతి జిల్లా లో టూరిజం అధికారి లాంటి కీలక పోస్టు కట్టబెట్టారంట. త్యవేడు , తిరుపతి కూటమి ఎమ్మెల్యేల దగ్గర పీఏలుగా గతంలో వైకాపా కీలక నేతల దగ్గర పీఏలుగా పనిచేసిన వారిని పెట్టుకున్నారనేది బహిరంగ విమర్శ .. ఇసుక, గ్రావెల్ దందా మొత్తం గతంలో పెద్దిరెడ్డి వద్ద కీలకంగా ఉండి నడిపించిన వ్యక్తులే వివిధ రకాల పేర్లతో వచ్చి ఇప్పుడు కూడా చేస్తున్నారంట. అధికార యంత్రాగం సైతం వారి అడుగులకు మడుగులు వత్తుతుందనేది బహిరంగ రహాస్యం.. కొన్ని చోట్ల స్థానిక నాయకులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఎమ్మెల్యేలు వైసీపీ వారికి మద్దతుగా మాట్లాడుతున్నారంట.
తిరుమల ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యహరిస్తున్
తిరుమలలో వైసీపీ నేతల అక్రమ వ్యాపారాలను టిడిపి లోని కొంతమంది నేతలు కాపాడుతున్నారనేది ఇప్పుడు బహిరంగ చర్చగా మారింది. ముఖ్యంగా కొంతమంది కమీషన్లకు కక్కుర్తి పడి వారికి అండగా ఉంటూ చివరకు సీఎంఓను సైతం తప్పుదారి పట్టిస్తున్నారంట. తాజాగా తిరుమలలోని ఎస్టేట్ అఫీస్‌లో జరుగుతున్న దందా వెలుగు చూసింది. దాంతో పాటు ఓ డిప్యూటీ ఈఓ తిరుమలలో ఏం జరిగినా నిమిషాలలో అ సమాచారానికి వైసీపీ వర్గాలకు పంపుతూ తిరుమల ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా వ్యవహారిస్తున్నాడంటున్నారు. గత ప్రభుత్వంలో కొండపై డిప్యూటేషన్ మీద నియమించిన వారిని తిప్పి పంపకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. సాక్షాత్తూ టిటిడి చైర్మన్ అదేశాలు ఇచ్చినా వారిని కొనసాగించడంలో అంతర్యం ఏంటని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.
అన్నీ గమనిస్తున్నానంటున్న ముఖ్యమంత్రి
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు జీడి నెల్లూరు కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలతో క్యాడర్‌లో ఆశలు చిగురిస్తున్నాయంట. సీఎం హోదాలో ఉండి కూడా చంద్రబాబు క్షేత్ర స్థాయిలో ఆ విధంగా మాట్లాడటంతో బాబు మారడు అని అనుకుంటున్నారంట. అయితే బాబు మారితే ఏం ప్రయోజనం.. ఇప్పటికే ఎమ్మెల్యేల్లో సగం మంది క్యాడర్‌కి అందుబాటులో లేకుండా.. ప్రైవేటు పనులలో నిమగ్నమైనప్పుడు.. అదికూడా ప్రతిపక్ష వైసీపీ వారితోతో కలసి నడుస్తున్నప్పుడు అని నిట్టూరుస్తున్నారంట. మరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ పరిస్థితులను అధిష్టానం ఎలా చక్కబెడుతుందో చూడాలి.