E-Paper
Advertisement

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!
Advertisement

Samantha Baby Shower: సినీనటి సమంత మరి కొద్ది రోజులలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈమె గత ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimori)తో కలిసి ఈషా ఫౌండేషన్ లో ఏడడుగులు వేశారు. పెళ్లి తర్వాత సమంత తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే ఈమె తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి తరచూ తన ప్రెగ్నెన్సీ కి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే సమంత డెలివరీ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈమెకు ఎంతో ఘనంగా సీమంతపు(Baby Shower) వేడుకను నిర్వహించారని తెలుస్తోంది.

 శ్రీ కల్పం పద్ధతిలో సమంత సీమంతపు వేడుక..

తాజాగా సమంత(Samantha) తన శ్రీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఇలా ఈమె షేర్ చేసిన ఫోటోలను చూస్తుంటే తన సీమంతపు వేడుకలలో భాగంగా అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారని తెలుస్తోంది. ఇక ఈ వేడుక కోయంబత్తూర్ లోని ఈశా ఫౌండేషన్ ఆశ్రమంలో నిర్వహించారు. శ్రీ విద్యా సాంప్రదాయంలోనే శ్రీ కల్పం (కాలా ఆవరణ) పద్ధతిలో ఈ వేడుక జరిగిందని సమంత చెప్పుకు వచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య సమంతకు తన భర్త రాజ్ అలాగే బంధువుల సమక్షంలో మంగళ స్నానం చేయించారు. ఇలా ఈ సాంప్రదాయం ప్రకారం సీమంతపు వేడుకలను నిర్వహించడం అనేది కాబోయే తల్లిని సాక్షాత్తు దేవతగా పరిగణిస్తారని చెప్పుకు వచ్చారు.

తన బిడ్డకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను…

Advertisement

ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని జరుపుకోవడం తనుకు తన బిడ్డకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ఈ సీమంతపు వేడుకకు సంబంధించి ఈమె ఒక సుదీర్ఘమైన పోస్టును తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె కుటుంబ సభ్యులతో పాటు తన ప్రాణ స్నేహితురాలు శిల్పారెడ్డి కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇలా సాంప్రదాయపదంగా సమంతకు నిర్వహించిన ఈ సీమంతపు వేడుకకు సంబంధించిన ఫోటోలు చూసిన అభిమానులు ఈమెకు అభినందనలు తెలియజేయడమే కాకుండా డెలివరీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

ఇక సమంత ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన ప్రేగ్నెన్సీ గురించి మాట్లాడుతూ అసలు తాము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేదని ఇది మాకు దేవుడు ఇచ్చిన వరమని తెలియజేశారు. ఒకానొక సమయంలో మాకు పిల్లలు ఉన్నా లేకపోయినా తన భర్తతో అనుబంధమే తనకు ముఖ్యమని భావించాను కానీ భగవంతుడు మాకు బిడ్డను ప్రసాదంగా అందించారని తెలిపారు. ఇక తనకు పుట్టబోయేది పాప లేక బాబు పుడతారా అనే ఆలోచనలు లేవని, ఎవరు పుట్టిన సంతోషమే అంటూ సమంత తెలియజేశారు.

Also Read: నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

Related News

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×