E-Paper
Advertisement

చైన్ స్నాచర్ల ఆటకట్టించిన రియల్ హీరో.. వృద్ధ దంపతులను కాపాడిన దృశ్యాలు వైరల్!

చైన్ స్నాచర్ల ఆటకట్టించిన రియల్ హీరో.. వృద్ధ దంపతులను కాపాడిన దృశ్యాలు వైరల్!
Advertisement

Ajmer Chain Snatching: రాజస్థాన్ లోని అజ్మేర్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్కూటర్ పై వెళ్తున్న వృద్ధ దంపతులను ఇద్దరు చైన్ స్నాచర్లు లక్ష్యంగా చేసుకోగా.. వారి బారి నుంచి ఓ వ్యక్తి విరోచితంగా బాధితులను కాపాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్థానిక యువకుడు చూపిన తెగువపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే..

సెప్టెంబర్ 12న విశ్రాంత డాక్టర్ తన భార్యతో కలిసి స్కూటర్‌పై ఇంటికి తిరుగుపయనమయ్యారు. తమ ఇంటికి మరో 100 మీటర్ల దూరంలో ఉన్నారనగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వారిని అడ్డుకున్నారు. మహిళ మెడలోని బంగారు గొలుసును తెంచేందుకు యత్నిస్తుండగా.. రెండు బైక్స్ అదుపు తప్పి కిందపడిపోయాయి.

నకిలీ తుపాకీతో బెదిరింపులు

Advertisement

కిందపడిన తర్వాత కూడా ఆ దంపతుల్ని బైక్ పై వెనుక కూర్చున్న వ్యక్తి వదల్లేదు. తన వద్ద ఉన్న ఒక నకిలీ తుపాకీని బయటకు తీసి వారిని బెదిరించాడు. అనంతరం మహిళ మెడలో నుంచి గొలుసును గుంజుకున్నాడు. అయితే బాధిత మహిళ గట్టిగా కేకలు వేయడంతో ఒక్కసారిగా వీధి మార్మోగింది.

కాపాడిన రియల్ హీరో..

మహిళ కేకలు విన్న స్థానిక యువకుడు.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఘటనా స్థలికి పరిగెత్తుకు వచ్చాడు. తుపాకీ ఉందని తెలిసినా.. ప్రాణాలకు తెగించి బైక్ నడుపుతున్న నేరస్థుడిని గట్టిగా తోసి కిందపడేసాడు. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి ఎలాగోలా అక్కడి నుంచి పారిపోగా.. గొలుసు దొంగిలించిన రెండో వ్యక్తి మాత్రం తప్పించుకోలేకపోయాడు.

Advertisement

Also Read: 32 ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లి.. తిరిగి రాని భార్య.. 67 ఏళ్ల వయసులో భర్తకు విడాకులు!

నేరస్థుడికి దేహశుద్ధి..

అప్పటికే అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న స్థానికులు.. పారిపోతున్న దుండగుడిని వెంటాడి పట్టుకున్నారు. అతడికి దేహశుద్ధి చేసి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటీనా ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పారిపోయిన మరొక నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సకాలంలో స్పందించి నేరస్థులను అడ్డుకున్న యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: ఖైరతాబాద్ తరహాలో.. దేశంలోనే పాపులర్ గణేశ్ మందిరాలు.. ఈ 6 పక్కా చూడాల్సిందే!

Tags

Related News

32 ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లి.. తిరిగి రాని భార్య.. 67 ఏళ్ల వయసులో భర్తకు విడాకులు!

సుశాంత్ రాజ్ పుత్ మేనేజర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్!

నవ వధువు దారుణ హత్య.. భార్య తల నరికి ఫ్రిజ్‌లో దాచిన హంతకుడు

సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు, పార్టీల్లో చర్చ

కుక్క పెట్టిన చిచ్చు.. లిఫ్ట్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్!

రియా హత్య కేసులో.. అసలు విషయాలు తేలకుండానే, భార్యని చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టి

హిట్-అండ్-రన్ ఘటన.. వుమెన్ రైడర్ని వెంటాడి కారుతో ఢీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Big Stories

Advertisement
×