Intinti Ramayanam Today Episode March 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతి నేను ప్రేమించిన వ్యక్తి కోసం వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను ఇప్పుడైతేనే నాకు కుదురుతుంది రేపు ఎలాగో పెళ్ళంటున్నారు కాబట్టి ఈరోజు ఇంట్లోంచి వెళ్లి పోతేనే నేను పెళ్లి చేసుకోగలను అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పలేను కాబట్టి ఒక లెటర్ రాసి నేను ఇంట్లోంచి ఈ రాత్రికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అవుతుంది. ప్రణతి బాధపడుతూ లెటర్ రాయడం పల్లవి చూస్తుంది. ఇదేంటి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్టు రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇలా లెటర్ వస్తుందా లేకపోతే ఇంకేదైనా రాసుకుంటుందని పల్లవి ఆలోచిస్తుంటుంది. ప్రణతిని పార్వతి పిలవడంతో ఆ లెటర్ ని తీసుకొని పల్లవి చదువుతుంది. ఒక అబ్బాయిని ప్రేమించింది అన్న విషయాన్ని అందులో రాసి ఉంటుంది. ఇది కథ నాకు కావాల్సింది ఇంట్లో వాళ్ళందరూ ఒకేసారి అవమానంగా ఫీల్ అవ్వడానికి ఇదే మెయిన్ అని పల్లవి అనుకుంటుంది. పల్లవి ఎలాగైన ఇంట్లోని వాళ్లందరి పరువు తియ్యాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రియుడుతో ఎలాగైనా ఈ రాత్రికి వెళ్ళిపోవాలని ప్రణతి రాత్రి లేచి అందరూ ఉండరు కదా అని బయటికి వెళ్లాలనుకుంటుంది కానీ ఎదురుగా పల్లవి కనిపించి నిన్ను ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వను కదా అనేసి అనుకుంటుంది ప్రణతి పల్లవిని చూసి లోపలికి వెళ్తుంది ఉదయం 5:30 కి లేచి చూస్తే అప్పటికే అందరూ ఇంట్లోకి వచ్చేస్తారు. ప్రణతిని రెడీ చేయడానికి తన ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు. వాళ్ళందరిని చూసి ప్రణతి షాక్ అవుతుంది ఇప్పుడు నేను ఇంట్లోంచి ఎలా వెళ్లాలి ఇంట్లోంచి తప్పించుకునే మార్గం లేదు నాకు వదిన ఉంటే ఏదో ఒక మార్గం చూపించేది అని ప్రణతి ఆలోచిస్తూ ఉంటుంది.. అవని ఎంట్రీ కోసం ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా కమ్మలు, శ్రీకర్ వదిన కోసం గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలని అనుకుంటారు.
అవని ఇంటికి రాదని మరుదులు చేసిన హడావిడి చూసి సంతోషపడుతుంది. కన్నయ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అనగానే లేదు వదినా నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెడితేనే ఆ కల వేరేలా ఉంటుంది అందుకే నీకోసం ఇంత ప్లాన్ చేశాను ఎలా ఉంది వదిన అనేసి కమలంటాడు. ఇంట్లో వాళ్ళందరిని కమల్ పిలుస్తాడు. ఈమె ఏమైనా ఆకాశంలోంచి ఉడిపడి వచ్చిందని పార్వతి అంటుంది. నువ్వు నోరు కంట్రోల్లో చేసుకోకపోతే గొడవలు అవుతాయి గాని పెళ్లి అవదు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఇక పల్లవి, శ్రీయ లను కమల్ హారతి తీసుకురమ్మని చెప్తాడు..
వాళ్ళిద్దరూ హారతి తీసుకొని వస్తారు. ఉనికి హారతి ఇవ్వగానే పల్లవి శ్రియాలు చూసావా అక్క మా ఆయన మీ ఆయన తమ వదిన రాగానే ఎంత సంతోష పడుతున్నారో.. ఆమె సీత లాగా వీళ్లు వరలక్ష్మి లాగా ఫీల్ అవుతున్నారు. అని అనగానే శ్రీఆ చూస్తున్నాను ఈ అవనికి ఎలాగైనా దారుణమైన అవమానం జరిగేలా చేసి ఇంకెప్పటికీ ఇంట్లోకి రానివ్వకుండా చేయాలని పల్లవి అంటుంది నువ్వేం చేస్తే దానికి నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ప్లీజ్ అని శ్రియ చెప్తుంది.
ప్రణతితో మాట్లాడవా అవని అని స్వరాజ్యం అడుగుతుంది. అవకాశం రాలేదు పిన్ని అసలు ఏం జరుగుతుందో ప్రణతి ఏదో చెప్పాలనుకునింది తన మనసులోని మాట ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు పిన్ని అని అనగానే అప్పుడే వీళ్ళందరూ భానుమతి పార్వతి పెళ్లికూతురికి పసుపు కుంకుమ గంధం పెట్టాలని తీసుకెళ్తుంటారు. దానికి స్వరాజ్యం అడ్డుపడుతుంది. నువ్వు ఇంటి పెద్ద కోడలు వి నీ మరదలికి నువ్వే అన్ని దగ్గరిని చేయాలి అసలే పెళ్లి వాళ్ళకి పట్టింపులు ఎక్కువ అంట ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు అని అంటుంది పార్వతి వచ్చి ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరు అని అంటే అవనికి నేను పిన్ని అంటే మీకు వియ్యపురాల్ని వదినగారు అని కౌంటర్ఇస్తుంది..
స్వరాజ్యం పార్వతి దగ్గర బలవంతంగా పసుపు కుంకాలు తీసుకొని అవని చేతుల పెడుతుంది ఇక పల్లవి ఎలాగైనా అవనిని అవమానించాలని కంకణం కట్టుకుంటుంది.. అవని కి ఘోర అవమానం జరగాలని ప్లాన్ చేసి మరి నవ్వుల పాలు ఎలా చేస్తుంది. అవని తీసుకెళ్తున్న పసుపు కుంకాలు కింద పడడంతో పార్వతి పల్లవి ఇద్దరు రెచ్చిపోయి మాట్లాడతారు ఈ పెళ్లి జరగకుండా చేయాలని అవని అనుకుంటుంది అందుకే ఇలా అశుభలు ఎదురయ్యేలా చేస్తుందని పల్లవి అంటుంది. నువ్వు ఈ పెళ్లి అయ్యేంతవరకు ఎక్కడికి వెళ్ళకూడదు నువ్వే పనిలో చెయ్యి పెట్టద్దని అవనికి పార్వతి వార్నింగ్ ఇస్తుంది.
అటు ప్రణతి అవనీని పిలవడం పల్లవి చూస్తుంది. విషయాన్ని వెంటనే పార్వతికి చెప్తుంది. అవని ప్రణతితో మాట్లాడడానికి పైకి వెళుతుంది ప్రణతి నువ్వేదో నాకు చెప్పాలని చూస్తున్నావు ఏంటో చెప్పమ్మా అని అడగ్గాని పార్వతి నువ్వు అసలు నా కూతురుతో నేను మాట్లాడొద్దని చెప్పాను అలాంటిది తన గదిలోకి వస్తావా ఈ పెళ్లయ్యేంతవరకు ఒక మూలన ఉండి నీ పని ఏదో నువ్వు చూసుకో అనేసి పార్వతి అవని బలవంతంగా కిందకు తీసుకొస్తుంది. దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ప్రణతి లెటర్స్ పెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అది అవని మెడకు చుట్టుకుంటుందా? అవని తెలివిగా ప్రణతిని మళ్ళీ తీసుకొస్తుంది అనేది చూడాలి..