BigTV English

CM Revanth Progress Report: ట్రిపుల్ ఐటీలో సమస్యలకు చెక్ పెట్టేందుకు రేవంత్ మాస్టర్ ప్లాన్

CM Revanth Progress Report: ట్రిపుల్ ఐటీలో సమస్యలకు చెక్ పెట్టేందుకు రేవంత్ మాస్టర్ ప్లాన్

CM Revanth Progress Report: ప్రజాపాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సహా ఇతర కీలక కార్యక్రమాల్లో ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. దశాబ్దకాలంగా నిర్లక్ష్యానికి గురైన కవులు, కళాకారులను సత్కరించారు. జనానికి జవాబుదారీగా ఉండేందుకు మరింత, పారదర్శకత తెచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది సర్కార్.


(08-12-2024 ఆదివారం) ( ప్రజాపాలన విజయోత్సవం )

రేవంత్ సర్కార్ ఏడాది పాలనలో సాధించిన విజయాలకు సంకేతంగా ఈనెల 8న ట్యాంక్ బండ్ పరిసరాల్లో వేడుకలు సంబరంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఎయిర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వీటిని చూసేందుకు వేలాది మంది జనం తరలివచ్చారు. ట్యాంక్ ​బండ్ ​పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏరోబాటిక్​ విన్యాసాలు ప్రదర్శించారు. సూర్యకిరణ్ ​ఏరోబాటిక్​ టీమ్ లీడర్ కెప్టెన్ అజయ్ దాశరథి నాయకత్వంలో 9 ఎయిర్​ క్రాఫ్ట్స్ ​ఆకాశంలో విన్యాసాలు చేశాయి. వీటిని సీఎం రేవంత్ రెడ్డి తిలకించారు.


(09-12-2024 సోమవారం) ( తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ )

ఏ ప్రాంతానికైనా ఒక గుర్తింపు, అస్తిత్వం తల్లి. సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. ప్రజలు దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకోవడం ప్రజలందరికీ గర్వకారణమైన సందర్భమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈనెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల సమక్షంలో ఆవిష్కరించారు. గత పాలకులు తెలంగాణ తల్లి రూపం ఇలా ఉండాలని గానీ, ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా చేయాలని గానీ ఏ రోజూ ఆలోచన చేయలేదు. కానీ సీఎం రేవంత్ మాత్రం తెలంగాణ ఉద్యమగుర్తులకు పట్టం కట్టేలా నిర్ణయాలు తీసుకున్నారు. వాహన రిజిస్ట్రేషన్లు టీఎస్ నుంచి జనం సెంటిమెంట్ అయిన టీజీకి మార్చారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో మార్మోగిన జయజయయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా తీసుకొచ్చారు. కవి గూడ అంజయ్య, గద్దర్ , బండి యాదగిరి , గోరటి వెంకన్న , సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరిని సన్మానించారు. తెలంగాణ తల్లి విగ్రహ శిల్పులను సన్మానించారు. వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల చొప్పున స్థలంతో పాటు కోటి రూపాయల నగదు, తామ్రపత్రం అందించారు. తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకున్న రోజు డిసెంబర్ 9 న ఒక పండుగలా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించేలా జీవో రిలీజ్ చేశారు.

(09-12-2024 సోమవారం) ( స్కూళ్లలో టీచర్ల ఫోటోలు పెట్టాల్సిందే )

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో, కేజీబీవీలు, మోడల్, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్ల ఫొటోలను అందరికీ కనిపించే ప్రాంతంలో పెట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. కొన్ని స్కూళ్లల్లో ఒకరికి బదులు మరొకరు పనిచేస్తున్న విషయాలు ప్రభుత్వం దృష్టి రావడంతో పిల్లల చదువు విషయంలో రాజీ పడొద్దన్న ఉద్దేశంతో చర్యలకు దిగింది సర్కార్. కొన్ని స్కూళ్లల్లో అసలు టీచర్లను గుర్తించే పరిస్థితే స్టూడెంట్లకు లేకుండా పోయిందంటున్నారు. దీంతో ప్రభుత్వం పేద పిల్లల చదువుల కోసం చేస్తున్నది వృధా కావొద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.

(10-12-2024 మంగళవారం) ( హాస్పిటల్స్ సంఖ్య పెంపు దిశగా )

అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలకు మేలు అని రేవంత్ ప్రభుత్వం మొదటి నుంచి అనుకుంటోంది. అందులో భాగంగానే హాస్పిటల్స్ ను క్రమపద్ధతిలో జనాభాకు తగ్గట్లు, డిస్టెన్స్ కు తగ్గట్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 636 phcలు, 249 సీహెచ్సీలు ఉన్నాయి. అలాగే 4693 సబ్‌ సెంటర్లు ఉన్నాయి. గతంలో వీటి ఏర్పాటుకు ఒక ప్రాతిపదిక అంటూ లేకపోయింది. స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో వారివారి సొంత గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు కొందరికి చాలా సమీపంలో ఉంటే.. మరికొందరికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండిపోయాయి.

ఈ పరిస్థితిని మార్చాలని ప్రజా ప్రభుత్వం డిసైడ్ అయింది. ప్రజారోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్య సేవలందించే ఆస్పత్రుల సంఖ్యను పెంచబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 78 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 220 సబ్‌ సెంటర్లను ఏర్పాటు చేయబోతోంది. అలాగే కొత్తగా మరికొన్ని బస్తీ దవాఖానాలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. వీటి నిర్మాణానికి సుమారు 350 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

(11-12-2024 బుధవారం) ( ఈవీల ఆటోలతో మహిళలకు ఉపాధి )

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్ కొత్త పాలసీని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపై దృష్టి సారించింది. ఓవైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు మహిళల ఉపాధికి సహకరించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ ఆటోల్ని కొని డ్రైవింగ్‌ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కొత్త పథకం రూపకల్పనపై దృష్టి పెట్టింది. ఆటో కొనుగోలుకు అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని భరించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఎలక్ట్రిక్‌ ఆటోలు కొనే వారికోసం ఓ కొత్త పథకాన్ని రూపొందించాలని రవాణాశాఖకు ఇటీవలే సీఎం సూచించారు. సో ఇదే జరిగితే మహిళల ఉపాధి విషయంలో మరో అడుగు ముందుకు పడినట్లే.

(11-12-2024 బుధవారం) ( ప్రభుత్వం చేయూతతో ముందడుగు )

రేవంత్ ప్రభుత్వం చేసిన ఓ సరికొత్త ఆలోచన సివిల్స్ ఆశావహుల్లో వెన్నుతట్టి ప్రోత్సాహం నింపింది. ఆర్థికంగా వెనుకబడి సివిల్స్ ప్రిపేర్ అవుతున్న 135 మందికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద ప్రజా ప్రభుత్వం వారిని సెక్రటేరియట్ కు పిలిచి లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆగస్ట్ లో అందజేసింది. ఆ సహకారం అందుకున్న వారిలో ఇప్పుడు 20 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. చేయూత ఇస్తే మన అభ్యర్థులు సత్తా చాటుతారనడానికి ఇదే నిదర్శనం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

(11-12-2024 బుధవారం) ( ఇక ఉత్తమ శాసనసభ వక్త అవార్డు)

తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఉత్తమ పార్లమెంటేరియన్‌ మాదిరిగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డు పరిశీలన చేసేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా బుధ, గురు వారాల్లో ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ సెషన్ నిర్వహించారు. ఇందులో అసెంబ్లీకి మొదటి సారి ఎన్నికైన ఎమ్మెల్యేలు 57మంది ఉన్నారు. వారికి సభా సంప్రదాయాలు, ప్రొసీజర్ గురించి శిక్షణాతరగతులు నిర్వహించారు.

(12-12-2024 గురువారం) ( సిటీలో సంతోష్ ట్రోఫీ )

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడలను ప్రోత్సహిస్తోంది. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా అందరినీ ఆటలవైపు మళ్లించడం, నగరంలో పెద్ద పెద్ద టోర్నీలు, క్రీడోత్సవాల నిర్వహణ విషయంలో సీఎం రేవంత్ స్వయంగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలోనే 57 సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీకి హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇచ్చేలా చేశారు. సంతోష్ ట్రోఫీ హైదరాబాద్ లో జరగడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

(12-12-2024 గురువారం) ( మహిళలకు పట్టం)

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాం చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు ఉచితంగా ఈ యూనిఫాం చీరలు ఇవ్వాలనుకుంటోంది. ఈ చీరల కోసం ప్రత్యేకంగా డిజైన్లు రూపొందించారు. మహిళా సంఘాల కోసం తయారు చేసిన యూనిఫాం చీరలను సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఈనెల 12న మంత్రి సీతక్కకు చూపించారు. ప్రభుత్వ నిర్ణయంపై మహిళా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ మహిళాశక్తి పథకాన్ని ప్రారంభించింది. గ్రామాల్లోని మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించి వారిని కోటీశ్వర్లును చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు యూనిఫాం చీరలు అందించబోతున్నారు.

(12-12-2024 గురువారం) ( జవాబుదారీతనం పెంచేలా)

జనానికి జవాబుదారీతనం తెచ్చేందుకు, చేసే పనిలో పారదర్శకత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సచివాలయంలో ఈనెల 12 నుంచి ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ అమలులోకి తెచ్చింది. మధ్యాహ్నం 12 గంటలు దాటినా కొందరు ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడం, తొందరగా వెళ్తుండడం మంత్రుల తనిఖీల్లో గుర్తించారు. దీంతో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ తో ఉద్యోగుల హాజరుపై కఠినంగా ఉంటోంది ప్రభుత్వం. రాష్ట్ర సచివాలయం పాలన విభాగానికి గుండెకాయ లాంటిది. అలాంటి చోట నిర్లక్ష్యానికి తావు లేదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

(13-12-2024 శుక్రవారం) ( కేంద్ర సహకారం కోసం )

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మరోసారి వరుసగా కేంద్రమంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, చేయాల్సిన పనులపై సీఎం స్వయంగా రిప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ‌లోని వెనుక‌బ‌డిన జిల్లాల‌కు పెండింగ్‌లో ఉన్న 1,800 కోట్ల గ్రాంటును వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విన్నవించారు. అటు కాజీపేట‌లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వేగంగా ఏర్పాటు చేయాలని రైల్వేమంత్రిని కలిసి విన్నవించారు సీఎం. వీటితో పాటే ఇతర పెండింగ్ రైల్వే పనులపైనా రిప్రజెంటేషన్ ఇచ్చారు.

అటు RRR ఉత్తర భాగానికి అవ‌స‌ర‌మైన సాంకేతిక‌, ఆర్థిక‌ప‌ర‌మైన అనుమతులు వెంట‌నే ఇవ్వాల‌ని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని సీఎం కోరారు. అటు వరంగల్ సౌత్ పార్ట్ బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలన్నారు. తెలంగాణకు కేంద్రీయ విద్యాల‌యాలు కేటాయించాల‌ని కేంద్ర విద్యా శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. అటు హైద‌రాబాద్ మెట్రో ఫేజ్- 2 తోపాటు హైద‌రాబాద్, వ‌రంగ‌ల్‌ లో సీవ‌రేజీ, అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్‌, సింగ‌రేణి సంస్థకు బొగ్గు గ‌నుల కేటాయింపు స‌హా ప‌లు అంశాల‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోనూ సీఎం రేవంత్ చ‌ర్చించారు.

(13-12-2024 శుక్రవారం) ( జవాబుదారీకి వీఆర్వో వ్యవస్థ )

తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం డిసైడ్ అయింది. వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సంక్రాంతిలోగా ఈ వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామన్నారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్వోలకు నేరుగా బాధ్యతలు అప్పగించి, మిగతా వారికి ప్రత్యేక రిక్రూట్‌మెంట్ ద్వారా పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల మంది వీఆర్వోలు ఉండగా, మరో 8 వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారంటున్నారు. ప్రభుత్వ భూముల విషయంలో లెక్కలు పక్కాగా ఉంచడం, జవాబుదారీతనం, పారదర్శకత పెంచేందుకే ఈ వ్యవస్థను మళ్లీ యాక్టివేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

(13-12-2024 శుక్రవారం) ( గ్రీన్ పవర్ కోసం )

గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. డిసెంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా.. తెలంగాణలో విద్యుత్ శాఖ పొదుపు వేడుకలు జరుపుతోంది. 2035 నాటికి 40 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ స్థాపన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తోంది. కరెంట్ పొదుపు, క్వాలిటీ పవర్ కోసం అన్ని రంగాల్లో టెక్నాలజీ ఆధారిత చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. విద్యుత్ ఆదాపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు 168 ఎనర్జీ క్లబ్‌లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అమలులో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉంది.

(13-12-2024 శుక్రవారం) ( బాసర ట్రిపుల్ ఐటీలో సంస్కరణలు )

బాసర ఆర్జీయూకేటీని రాష్ట్రంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్కకు విద్యార్థులు సమస్యలు తెలపడంతో వివిధ అభివృద్ధి పనుల కోసం తక్షణం కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సమస్యలపై నివేదిక ఇవ్వాలని, వాటిపై సీఎం దృష్టికి తీసుకెళ్తామని వీసీకి సూచించారు.

14-12-2024 శనివారం ( హాస్టల్స్ లో క్వాలిటీ ఫుడ్ )

రాష్ట్రంలోని సంక్షేమ వసతిగృహాల పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సహా ఇతర మంత్రులు వసతిగృహాలను సందర్శించారు. సీఎస్ సహా ఇతర ఐఏఎస్, ఐపీఎస్ లూ తనిఖీల్లో పాల్గొన్నారు. విద్యార్ధులతో కలసి భోజనం చేసి పరిస్థితులను అంచనా వేశారు. సీఎం రేవంత్ చిల్కూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించారు. విద్యార్థులకు ల్యాప్ టాప్స్ అందించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల వసతిగృహాల్లో దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచుతూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలల్లో 667 కోట్లతో మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది. అయినా సమస్యలు పెరుగుతుండడంతో ఈ తనిఖీలు చేశారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×