Rahul Ravindran:ప్రముఖ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చిలాసౌ సినిమాతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న రాహుల్ రవీంద్రన్ చాలా కాలం తర్వాత ఇప్పుడు ‘ ది గర్ల్ ఫ్రెండ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే ఇలాంటి సమయంలో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఒక పోస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కారణం ఆయన క్షమాపణలు చెప్పడం. సినిమా హిట్ అయితే క్షమాపణలు చెప్పడం ఏంటి అనే అనుమానాలు వ్యక్తమవ్వచ్చు. కానీ అసలు విషయం తెలిసి.. ఆయన ఆలోచన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. మరి రాహుల్ క్షమాపణలు చెప్పడం వెనక అసలు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే రాహుల్ రవీంద్రన్ తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా పోస్ట్ పంచుకుంటూ క్షమాపణలు తెలియజేశారు. ఆ పోస్టులో.. ” దయచేసి అందరూ నన్ను క్షమించండి. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఎవరైతే సినిమాలో తమకు నచ్చిన అంశాల గురించి చెబుతూ పోస్ట్ పెడుతున్నారో వారందరికీ కూడా నేను రియాక్ట్ అవుతున్నాను. అయితే ఈ వరుస ట్వీట్స్ వల్ల టైం లైన్ అంతా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసమే నిండిపోతోంది. ఇలా వరుసగా సినిమాకు సంబంధించిన వార్తలు పంచుకోవడం వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తోంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో మౌత్ టాక్ తోనే చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఇక అందుకే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా బాగుంది అని ప్రతి ఒక్కరూ తమ రెస్పాన్స్ షేర్ చేస్తుంటే.. అది ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా నేను ఇలా ప్రతి ట్వీట్ కి రిప్లై ఇస్తున్నాను. కానీ ఇలా ప్రతి ట్వీట్ రిపీట్ చేస్తూ రెస్పాన్స్ అవ్వడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతోంది. అలాంటి వారికి నా తరఫున క్షమాపణలు కోరుతున్నాను” అంటూ రాహుల్ తెలిపారు. ప్రస్తుతం రాహుల్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) లేడీ ఓరియంటెడ్ మూవీగా వచ్చిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. దీక్షిత్ శెట్టి( Deekshith Shetty)ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఎమోషనల్ లవ్ స్టోరీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ , ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని , విద్య కొప్పినీడు సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
also read:Rashmika Mandhanna : అఫీషియల్‌గా చెప్పేసింది… రౌడీతో పెళ్లి ఇక రూమర్ కాదు!
I apologise for flooding your timelines. We were never going to be a film that opened massively on Friday. We were always going to depend on word of mouth. And it’s crucial we amplify all the outpouring of love and affection audiences are showing for the film, so that more people…
— Rahul Ravindran (@23_rahulr) November 8, 2025