Priyanka Gandhi Parliament | పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం చాలా బోరింగ్ గా ఉందని.. తనకు ఏదో స్కూల్ లో ఒకేసారి రెండు మెథమెటిక్స్ పీరియడ్స్ లో కూర్చున్నట్లుగా అనిపించిందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ శనివారం డిసెంబర్ 14న లోక్ సభలో ఉన్నారు.
పార్లమెంటులో ప్రధాన మంత్రి మోడీ చేసిన 11 తీర్మానాలు చాలా డొల్లగా ఉన్నాయని.. అవినీతిపై సహించేది లేదని చెప్పిన మోడీ, భారతీయ జనతా పార్టీ (బిజేపీ).. ఆ మాటకు కట్టుబడి ఉంటే అదానీ అవినీతిపై చర్చకు అంగీకరించాలని ప్రియాంక గాంధీ సవాల్ చేశారు.
ప్రధాన మంత్రి మోడీ ప్రసంగంపై స్పందింస్తూ.. ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. “ప్రధాని ప్రసంగంలో ఒక్క అంశం కూడా కొత్తది లేదు. ఆయన మాట్లాడుతుంటే అందరూ చాలా బోర్‌గా ఫీలయ్యారు. నాకైతే దశాబ్దాల క్రితం స్కూల్ లో ఒకేసారి రెండు మేథమేటిక్స్ పీరియడ్ లో కూర్చున్నట్లు అనిపించింది. మేమే కాదు బిజేపీ నాయకులు కూడా చాలా బోర్ గా ఫీలయ్యారు. మోడీ మాట్లాడుతుంటే.. జెపి నడ్డా చేతులు రుద్దు కుంటూ కూర్చున్నారు. ఇది మోడీ గ్రహించగానే నడ్డా ఏదో ఆసక్తిగా వింటున్నట్లు నటించారు. అమిత్ షా కూడా చేతులు తలపై పెట్టుకొని కూర్చున్నారు. పియుష్ గోయల్ అయితే నిద్రపోతున్నారు. కానీ నాకైతే పార్లమెంటులో కూర్చోవడం ఇదే తొలిసారి. అందుకే ప్రధాని ప్రసంగం అంటే ఏదైనా కొత్తగా ఉంటుందని, బాగుంటుందని భావించాను. కానీ నిరాశ చెందాను”. అని ప్రియాంక చెప్పారు.
Also Read: అమెరికా నుంచి డిపోర్ట్ కాబోతున్న18000 మంది భారతీయులు.. ట్రంప్ దెబ్బ
రాజ్యంగం 75వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ రక్తం రుచి మరిగిందని, రాజ్యాంగాన్ని పదే పదే గాయపరుస్తూనే ఉందని అన్నారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం 2014 నుంచి రాజ్యాంగం సూచించిన దారిలోనే నడుస్తూ.. భారతదేశంలో ఐకమత్యం కోసం కృషిచేస్తోందన్నారు.
గత రెండు రోజులుగా లోక్ సభలో జరుగుతున్న వాదోపవాదాలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ గత ప్రభుత్వాలు దేశం విభిన్నత్వంలో విష బీజాలు నాటాయని అన్నారు. రాజకీయాల్లో కుటుంబ వారసత్వాలు ఉండకూడదని అవినీతి రహిత సమాజం కోసం రాజీపడకుండా ప్రభుత్వంతో పాటు పౌరులు అన్ని రంగాల్లో కలిసి పనిచేసేందుకు కృషిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ప్రజలందరి అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి సబ్ కా సాథ్ వికాస్ పేరుతో 11 తీర్మానాలు చేస్తున్నట్లు ప్రకటించారు. భారత సంప్రదాయాల పట్లు అందరూ గర్వ పడాలని బానిసత్వ ఆలోచనాధోరణి బయటికి రావాలని చెప్పారు. మహిళలు అన్నిరంగాల్లో నాయకత్వం వహిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది.. అప్పుడే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కల సాకారమవుతుందన్నారు.
అవినీతిని సమాజం ఏ మాత్రం రాజకీపడకూడదని.. దేశ చట్టాలు, నియమాలు, నిబంధనలు అందరూ గౌరవిస్తేనే అవినీతి అంతమవుతుందని వ్యాఖ్యానించారు. రాజ్యంగాన్ని రాజకీయ లబ్ది కోసం కాదని సమాజ హితం కోసం మాత్రమేనని గుర్తు చేశారు.