BigTV English

Allu Arjun – Jr NTR: అల్లు అర్జున్ ను ఎన్టీఆర్ ఎందుకు కలవలేదంటే..?

Allu Arjun – Jr NTR:  అల్లు అర్జున్ ను ఎన్టీఆర్ ఎందుకు కలవలేదంటే..?

Allu Arjun – Jr NTR: పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఒక మహిళ ప్రాణాలు పోయాయి. ఆమె ప్రాణాలు పోవడానికి కారణాలు అల్లు అర్జున్ కారణం అని పోలీసులు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు.. మొన్న బన్నీ నివాసం వద్దే పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలో ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఇక అదే సమయంలో బన్నీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని టెక్నీకల్ కారణం వల్ల శుక్రవారం రాత్రి జైలులోనే అల్లు అర్జున్ ఉన్నారు.. శనివారం ఉదయం ఆయనను రిలీజ్ చేశారు. శనివారం ఆయన ఇంటికి సినీ ప్రముఖులు వచ్చి పరామర్శిస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం రాలేదు. దీనిపై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ రాకపోవడానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


థియేటర్ వద్దకు ఎటువంటి సమాచారం లేకుండా వచ్చారని అందుకే తొక్కిసలాట జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ పై కేసు పెట్టారు. ఈ కేసు పై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల శుక్రవారం రాత్రి జైలులోనే అల్లు అర్జున్ ఉన్నారు. శనివారం ఉదయం చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు. న్యాయవాదులతో చర్చలు జరిపి తన నివాసానికి చేరుకున్నారు బన్నీ. అనంతరం జూబ్లీహిల్స్‌ లోని అల్లు అర్జున్ ఇంటికి అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు విచ్చేశారు. దర్శకులు రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్‌, రవి, దిల్‌రాజు, హీరోలు విజయ్ దేవరకొండ, సుధీర్ బాబు, అఖిల్, అడవి శేషు తదితరులు వెళ్లి పరామర్శించారు.

అయితే హీరో ప్రభాస్, ఎన్టీఆర్ లు ఫోన్లో మాట్లాడారు.. ఎన్టీఆర్, బన్నీ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి అందరికి తెలుసు. అల్లు అర్జున్, తారక్ చాలా క్లోజ్ గా ఉంటారు. ఇద్దరూ కలిసి ఒకసారి కూడా నటించకపోయినా.. మంచి బాండింగ్ మైంటైన్ చేస్తారు. ఒకరినొకరు బావ అని ప్రేమగాపిలుచుకొనేంత క్లోజ్ గా ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఏమో అనేంతగా ఉంటారు. సమయం వచ్చినప్పుడల్లా తమ బాండింగ్ కోసం మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు తారక్ ఎందుకు వచ్చి కలవలేదోనని కొందరు నెటిజన్లు అనుకుంటున్నారు. నిజానికి ఎన్టీఆర్ ముంబైలో ఉన్నారని తెలుస్తుంది. వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారని తెలుస్తుంది.. ప్రస్తుతం వార్-2 కొత్త షెడ్యూల్ జరుగుతోంది. తారక్, హృతిక్ రోషన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అందుకే హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ ను ఎన్టీఆర్ కలవలేదని తెలుస్తోంది. ఫోన్ చేసి బన్నీతో ఆయన మాట్లాడారని టాక్.. ఇక హైదరాబాద్ వచ్చిన వెంటనే ఎన్టీఆర్ ను తారక్ ను కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×