BigTV English
Advertisement

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Obesity Awareness: కొన్నేళ్ల కిందటి వరకు ఇండియా అంటే పేద దేశం అన్న ఫీలింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉండేది. ప్రభుత్వ పథకాలు కూడా ఆకలి తీర్చడంపైనే ప్రధానంగా ఉండేవి. కానీ.. ఫస్ట్ టైమ్ ఒబెసిటీపై కేంద్రం వర్కవుట్ చేస్తోంది. ఫిట్ ఇండియా మూమెంట్‌ని ప్రమోట్ చేస్తోంది. ఇప్పుడు దేశంలో ఊబకాయం అనేది పెద్ద సమస్యగా మారిందనే రిపోర్టులు.. ఆందోళన పెంచుతున్నాయ్. దీనికి.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం దగ్గరున్న ప్లానేంటి?


దేశంలో అతి పెద్ద సమస్యగా మారుతున్న ఊబకాయం
ఇప్పుడు దేశంలో ఊబకాయం అనేది చాలా పెద్ద సమస్యగా మారుతోంది. కాబట్టి.. దానికి ఫిట్ ఇండియానే పరిష్కారమనే ప్రచారం మొదలైంది. ఇలాంటి విషయాలను ప్రజలు.. క్రికెటర్ల నుంచి విన్నప్పుడు.. మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు మోడీ. ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు, ఫిట్‌గా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రచారం కల్పించాలని సూచించారు. మహిళా క్రికెటర్లు.. ఫిట్ ఇండియా మూమెంట్‌ని ప్రచారం చేస్తే.. ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.

దేశంలో అన్ని వయసుల వారిలో పెరుగుతున్న ఊబకాయం
ప్రధాని మోడీ చెప్పినట్లు.. దేశంలో అన్ని వయసుల వారిలో ఊబకాయం వేగంగా పెరుగుతోంది. ఇది.. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఊబకాయం కారణంగా.. దేశవ్యాప్తంగా డయాబెటిస్, గుండె జబ్బుల సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2019 నుంచి 2021 మధ్య చేసిన.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దాదాపు నలుగురు భారతీయుల్లో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. వీరిలో.. 24 శాతం మహిళలు ఉంటే, 23 శాతం పురుషులున్నారు. 15 నుంచి 49 సంవత్సరాల వయసున్న వారిలో.. ఒబెసిటీ 6.4 శాతం మంది మహిళల్ని, 4 శాతం మంది పురుషుల్ని ప్రభావితం చేస్తోంది. ఇది గతంలో చేసిన సర్వేలతో పోలిస్తే.. చాలా పెరిగింది. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు కూడా అధిక బరువు పెరుగుతున్నారు. గడిచిన కొన్నేళ్లలోనే.. చిన్నారుల్లో ఊబకాయ సమస్య 2.1 శాతం నుంచి 3.4 శాతానికి పెరిగింది. ముఖ్యంగా.. ఆందోళన కలిగిస్తున్న అంశం ఏమిటంటే.. అబ్డామినల్ ఒబెసిటీ. సాధారణంగా దీనిని బెల్లీ ఫ్యాట్ అంటారు. ఇదే.. డయాబెటిస్, గుండె జబ్బులతో బలంగా ముడిపడి ఉంది. 2023లో వచ్చిన ఓ రిపోర్ట్ ప్రకారం.. భారతదేశ జనాభాలో 40 శాతం మంది మహిళలు, 12 శాతం మంది పురుషులు.. బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నారు. ఇది ముఖ్యంగా.. భారతీయుల్ని కార్డియో-మెటబాలిక్ సంబంధిత ప్రమాదంలో పడేస్తోంది.


ప్రపంచవ్యాప్తంగా పది మంది పిల్లలలో ఒకరికి ఊబకాయం
UNICEF చైల్డ్ న్యూట్రిషన్ గ్లోబల్ రిపోర్ట్ 2025 ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పది మంది పిల్లలలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కొన్ని దేశాలకే పరిమితమైన ఒబెసిటీ.. ఇప్పుడు భారత్‌లోనూ వేగంగా వ్యాపిస్తోంది. దక్షిణాసియా దేశాల్లో 2000 సంవత్సరం నాటికి ఊబకాయం సమస్య చాలా తక్కువగా ఉంది. అది..2022 నాటికి అన్ని 20 ఏళ్ల లోపు వారిలో దాదాపు ఐదు రెట్లు పెరిగింది. ఇండియాలో.. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో.. ఒబెసిటీ సమస్య వేగంగా పెరుగుతోంది. మహిళల్లో 91 శాతం, పురుషుల్లో 146 శాతం పెరిగింది. ఇది.. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య సంక్షోభాన్ని సూచిస్తోంది. 2030 నాటికి దేశంలో దాదాపు 3 కోట్ల మంది చిన్నారులు, టీనేజర్లు.. ఊబకాయంతో ఉంటారని రిపోర్టులు చెబుతున్నాయ్. తాజా భారత ఆర్థిక సర్వే ప్రకారం.. ఇండియాలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం.. బాగా పెరిగింది. ఇది.. ప్రతి సంవత్సరం 33 శాతానికంటే ఎక్కువ వృద్ధి చెందుతోంది. చైల్డ్ న్యూట్రిషన్ రిపోర్ట్ కూడా.. ఫాస్ట్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫఉడ్స్, బేవరెజెస్, కొవ్వు, చక్కెర, ఉప్పు స్థాయిలు పెరుగుతున్నాయని సూచించింది. చిన్నతనంలో సరైన పోషకాహారం ఇవ్వకపోవడం, తల్లిదండ్రులు పిల్లల ఆహారం గురించి పట్టించుకోకపోవడం లాంటివి ఉన్నాయి. చక్కెర-తీపి పానీయాల వినియోగం పెరగడం వల్లే.. ఈ సమస్య తలెత్తుతోంది.

టీనేజర్లలో 35 శాతానికి పెరిగిన అధిక బరువు ప్రాబల్యం
వాళ్లకూ, వీళ్లకూ అనే తేడా లేకుండా.. ఊబకాయ సమస్య అన్ని వయసుల వారిలో పెరుగుతోంది. ముఖ్యంగా.. టీనేజ్‌లో ఉన్న వారిలో అధిక బరువు ప్రాబల్యం 6 శాతం నుంచి 35 శాతానికి పెరిగింది. ఊబకాయం 0.3 శాతం నుంచి 18 శాతం మధ్య ఉందని.. రీసెర్చ్ రిపోర్టులు సూచిస్తున్నాయ్. పట్టణ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న టీనేజర్లలో ఇది అధికంగా కనిపిస్తోంది. వారి ఆహార అలవాట్లు, జీవన శైలి, జంక్ ఫుడ్ లాంటివే.. ఊబకాయానికి దారితీస్తున్నాయని చెబుతున్నారు. నగరాలు, పట్టణాల్లో ఊబకాయం రేటు ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ.. ఈ సమస్య వేగంగా పెరుగుతోంది. గ్రామీణ మహిళల్లో ఊబకాయం 8.6 శాతం నించి 20 శాతానికి పెరిగింది. పురుషుల్లో 7.3 శాతం నుంచి 19 శాతానికి పెరిగింది. ఇది.. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వ్యాప్తి, శారీరక శ్రమ తగ్గడాన్ని ప్రతిబింబిస్తోంది. మెటబాలిక్ హెల్త్ పిక్చర్ మరింత ఆందోళనకరంగా ఉంది. ఐసీఎంఆర్ రీసెర్చ్ ప్రకారం.. భారతీయుల్లో సుమారు 27 శాతం మంది మాత్రమే.. జీవక్రియపరంగా ఆరోగ్యంగా ఉన్నారు. అంటే.. పది మందిలో ఏడుగురికి పైగా భారతీయులు.. వారి శరీర పరిమాణంతో సంబంధం లేకుండా.. హై బ్లడ్ షుగర్, బీపీ, అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు కలిగి ఉన్నారు. అందువల్ల.. ఊబకాయాన్ని తగ్గించేందుకు తక్షణ చర్యలు అవసరం అంటున్నారు. వరల్డ్ ఒబెసిటీ అట్లాస్ 2024 ప్రకారం.. 20235 నాటికి ప్రపంచంలో స్థూలకాయంతో బాధపడుతున్న వారిలో ఎక్కువ మంది భారతదేశం లాంటి తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే ఉంటారని హెచ్చరించింది.

ఒబెసిటీ.. ఇప్పుడు కేవలం పశ్చిమ దేశాలకే పరిమితమైన సమస్య కాదు. ప్రస్తుతం ఇండియా ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ఆరోగ్య సవాళ్లలో ఒకటి. ఊబకాయ సంబంధిత వ్యాధుల పెరుగుదల.. పిల్లల నుంచి వృద్ధుల దాకా అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. అందువల్లే.. వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. ఇదే సమయంలో.. ఇన్‌స్టంట్‌గా బరువు తగ్గేందుకు వాడుతున్న మందుల సేల్స్ కూడా భారీగా పెరిగాయ్. ఇది.. మరింత ఆందోళన పెంచుతోంది. అందుకే.. ఇప్పుడు దేశానికి ఫిట్ ఇండియా అవసరముందని చెబుతున్నారు.

ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న ఊబకాయ సమస్య
భారత్‌లో ఊబకాయ సమస్య.. ప్రమాదకరస్థాయిలో పెరుగుతుండటం కొత్త ఆందోళనలు రేకెత్తిస్తోంది. అనేక సర్వే రిపోర్టులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయ్. బిజీ లైఫ్ స్టైల్, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, అంతగా శారీరక శ్రమ లేకపోవడం లాంటి కారాణాలతో.. చాలా మంది అధిక బరువు, ఊబకాయం బారిన పడుతున్నారు. ఈ సమస్యని త్వరగా అధిగమించే ఆలోచనతో.. చాలా మంది వెయిట్ లాస్ డ్రగ్స్‌ని, ఇంజెక్షన్లని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే.. మార్కెట్‌లో రకరకాల బ్రాండ్ల ఔషధాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇవి.. బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయడంతో పాటు జీర్ణక్రియని నెమ్మదింపజేసి.. బరువు తగ్గడానికి సాయపడతాయ్. అయితే.. ఈ షార్ట్ కట్ పద్ధతి.. దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ.. అనేక బరువు తగ్గించే మందుల విక్రయాలు విపరీతంగా పెరుగుతున్నాయ్.

అధిక బరువుని తగ్గించే ఎలీ లిల్లీ మౌంజారో డ్రగ్
అధిక బరువుని తగ్గించే ఎలీ లిల్లీ కంపెనీకి చెందిన మౌంజారో డ్రగ్.. అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన ఔషధంగా మారింది. వీటి అమ్మకాలు వంద కోట్లకు చేరుకున్నాయ్. ఈ మౌంజారో డ్రగ్.. మానవ శరీరంలో బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేలా మారుస్తుంది. ఇప్పుడు.. ఇండియాలో ఇలాంటి మందులకు డిమాండ్ పెరగడం ఆందోళన రేపుతోంది. 2030 నాటికి.. మౌంజారో అమ్మకాలు 150 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బరువు తగ్గించే చికిత్స రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ఈ విషయంలో.. డ్రగ్ మేకర్స్‌కి ఇండియా ఓ బ్యాటిల్ గ్రౌండ్‌గా మారింది. బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసే ఈ మౌంజారో డ్రగ్.. మార్చిలో ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. కొద్ది నెలల్లోనే.. దాని అమ్మాకాలు డబుల్ అయ్యాయ్. అక్టోబర్ చివరి నాటికి ఈ డ్రగ్ సేల్స్ వల్ల.. ఎలీ లిల్లి కంపెనీకి వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. చాలా మందికి ఇంజెక్షన్లు తీసుకున్న కొద్ది కాలంలోనే బరువు తగ్గడం ఆకర్షణీయంగా అనిపిస్తుంది. కానీ.. అదంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం చేయడం కష్టంగా భావించే వారు.. సులభమైన మార్గంగా వీటిని చూస్తున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, ఇతరులు వీటి వాడకం గురించి ప్రచారం చేయడం వల్ల సాధారణ ప్రజల్లోనూ ఈ విధమైన ఔషధాల పట్ల ఆసక్తి పెరుగుతోంది. అధిక బరువు తగ్గేందుకు.. వీటిని విచక్షణారహితంగా వాడటం చాలా ప్రమాదకరం.

జీవనశైలిలో మార్పులు లేకపోతే మళ్లీ బరువు పెరిగే చాన్స్
ఇలా.. బరువు తగ్గించే మందులు అధికంగా వాడటం వల్ల.. జీర్ణకోశ సమస్యల్లాంటి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇటీవల జరిగిన పరిశోధనల్లో.. ఈ ఇంజెక్షన్లు తీసుకునే కొంతమందిలో.. కంటి నరాలకు రక్త ప్రసరణ తగ్గిపోయే ఐ స్ట్రోక్ లాంటి తీవ్రమైన కంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేలింది. కొన్నిసార్లు ఈ మందులు వాడటం ఆపేసిన తర్వాత.. సరైన జీవనశైలి మార్పులు లేకపోతే.. చాలా మంది మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. నిపుణులు, వైద్యులు చెబుతున్న ప్రకారం.. అధిక బరువుని అధిగమించడం అనేది.. కేవలం జీవనశైలి మార్పుల ద్వారానే సాధ్యమవుతుంది. బరువు తగ్గడానికి మనం తీసుకునే కేలరీల కంటే.. ఎక్కువ కేలరీలను ఖర్చు చేయాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు.. చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలంటున్నారు. ప్రతి రోజూ.. కొంత దూరం నడవడం గానీ జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ లాంటివి చేయడం మంచిది. వారానికి కనీసం రెండు సార్లయినా.. వ్యాయామం చేయాలి.

పోషణ్ అభియాన్ 2.0, పాఠశాల ఆధారిత ఆరోగ్యం
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే.. ఫిట్ ఇండియా ఉద్యమం, ఈట్ రైట్ ఇండియా ప్రచారం, పోషణ్ అభియాన్ 2.0, పాఠశాల ఆధారిత ఆరోగ్యం, వెల్‌నెస్ ప్రోగ్రామ్స్ లాంటి అనేక చర్యల్ని చేపట్టింది. పాఠశాలలు, ఆఫీసుల్లో.. చక్కెర, నూనె స్థాయిల వాడకానికి సంబంధించిన బోర్డులను ఉంచేందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ.. తన పంద్రాగస్ట్ స్పీచ్‌లోనూ.. కుటుంబాలు వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించాలని కోరారు. ఇలాంటి చిన్న మార్పులే.. ప్రజారోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయన్నారు.

Also Read: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

ఊబకాయం సమస్య కోట్లాది మంది భారతీయుల్లో అనారోగ్య సమస్యలకు కారమణవుతోంది. అందువల్ల.. ఇంజెక్షన్లు, ఇతర బరువు తగ్గించే మందులని నమ్ముకోకుండా ఆరోగ్యకరమైన, స్థిరమైన బరువు తగ్గింపు కోసం ఆహార నియంత్రణ, ఎక్సర్‌సైజులు మాత్రమే మేలు చేస్తాయని చెబుతున్నారు. త్వరగా బరువు తగ్గాలనే ఆశతో.. ఆరోగ్యాన్నే ఫణంగా పెట్టకండి. అందుకే.. భారత ప్రభుత్వం ఇప్పుడు.. ఫిట్ ఇండియా మూమెంట్‌పై ఫోకస్ పెంచింది.

Story By Anup, Bigtv

Related News

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×