E-Paper
Advertisement

బొద్దింక‌ల ఎఫెక్ట్‌.. జంత‌ర్‌మంత‌ర్ ఎత్తేయ‌లేదు.. కానీ కండిష‌న్స్ అప్లై.. !

బొద్దింక‌ల ఎఫెక్ట్‌.. జంత‌ర్‌మంత‌ర్ ఎత్తేయ‌లేదు.. కానీ కండిష‌న్స్ అప్లై.. !
Advertisement

ఇక్క‌డ తెలంగాణ‌లో ధ‌ర్నాచౌక్ విష‌యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం మాదిరిగానే .. అక్క‌డ జంత‌ర్‌మంత‌ర్ విష‌యంలో కూడా కేంద్రంలోని బీజేపీ మూసివేత‌, ఎత్తివేత చ‌ర్య‌ల‌కు దిగుతుంద‌ని అంతా అనుకున్నారు. దీనిపై విస్తృత ప్ర‌చారం కూడా జ‌రిగింది. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేప‌ట్టిన ఆందోళ‌న‌.. దేశ వ్యాప్త చ‌ర్య‌కు రావ‌డం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసే వ‌ర‌కు ప‌ట్టు వ‌ద‌ల‌క‌పోవ‌డంతో.. కేంద్రం రెండు ర‌కాలుగా న‌ష్ట‌పోయింది.

రాజీనామా చేయించ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డటంతో పాటు కేంద్రంలోని బీజేపీకి ఇది మాయ‌ని మ‌చ్చ‌లా ఉండిపోయింది. దీంతో కేంద్రంలోని పెద్ద‌లు, బీజేపీ నేత‌ల‌కు ఈ జంత‌ర్‌మంత‌ర్ అంటేనే భ‌గ్గుమంటున్న‌ది. ఇదో శ‌త్రు శిబిరానికి ఆశ్రయం క‌ల్పించే ఓ స్థ‌లంలా చూస్తున్నారు. సేమ్‌.. ఇక్క‌డ కేసీఆర్ కూడా ధ‌ర్నా చౌక్ విష‌యంలో ఇలాగే ప్ర‌వ‌ర్తించాడు. నే

Advertisement

ను పాలిస్తున్న రాష్ట్రంలో.. అస‌లు స‌మ‌స్య‌లే లేన‌ప్పుడు.. ఇంకా ధ‌ర్నాలు గిర్నాలు ఎందుకు..? మ‌ళ్లీ దీనికోసం ప్ర‌త్యేకంగా ఓ స్థ‌లం.. దానికో ధ‌ర్నా చౌక్ అనే పేరు కూడానా..? అని ఎద్దేవా చేసిన కేసీఆర్‌.. దీన్ని మొత్తానికే మూసేశారు. దీనిపై ర‌గ‌డ మొద‌లైంది. విష‌యం కోర్టు దాకా పోయింది. ఇప్పుడైతే ఇక్క‌డ ధ‌ర్నాలు చేస్తున్నా.. పేరు మాత్రం ఇందిరాపార్క్ అనే వాడుతున్న‌ది ఇప్ప‌టికీ బీఆరెస్‌. అంత‌లా అధికారంలో ఉన్న‌ప్పుడు దీనిపై క‌క్ష‌క‌ట్టార‌ని తెలిసిపోతూనే ఉంది.

ఇప్పుడు సేమ్‌.. జంత‌ర్‌మంత‌ర్ విష‌యంలో కూడా ఇదే రిపీట్‌ అవుతోంది. అయితే మొత్త‌మే ఎత్తేస్తే ఇంకా చెడ్డ‌పేరు మూట‌గ‌ట్టుకోవ‌డం త‌ప్ప‌.. కేంద్రంలోని బీజేపికి మేలైతే జ‌ర‌గ‌దు. కానీ దీన్ని ఇలాగే వ‌దిలేస్తే ఇది బొద్డింక‌ల‌కు కేంద్రాన్ని బెదిరించే ఓ అస్త్రంగా, నిర‌స‌న‌ల‌కు వేదిక‌గా మారుతుంద‌నే భ‌యం మాత్రం వెంటాడుతోంది. అందుకే దీన్ని పూర్తిగా ఎత్తేయ‌లేద‌ని చెబుతూనే.. య‌థావిధిగా కొన‌సాగుతుంద‌ని, ప్ర‌చారం న‌మ్మ‌వ‌ద్ద‌ని న‌మ్మబ‌లుకుతూనే కండిష‌న్స్ అప్లై చేశారు.

Advertisement

నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌నే.. నిబంధ‌న‌లే ఇప్పుడు అక్క‌డ ప్ర‌ధాన ఆటంకంగా మారనున్నాయి. ఓ వెయ్యి మంది వ‌ర‌కు మాత్ర‌మే నిర‌స‌న తెలిపే అధికారం ఉంద‌ని తెలిపిన ఢిల్లీ పోలీసులు.. అక్క‌డ ఆందోళ‌న చేయాలంటే ప‌ర్మిష‌న్ అవ‌స‌రం అని మెలిక పెట్టారు. అందేంటీ.. మినిమ‌మ్ ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డం కామ‌నే క‌దా అనుకుంటున్నారా? ఇక్క‌డ అది కాదు అస‌లు చిక్కు.. ఆ ప‌ర్మిష‌న్‌ను ఓకే చేయాలంటే దీనికి ఓ ప్ర‌త్యేక అధికారిని నియ‌మించింది కేంద్ర ప్ర‌భుత్వం.

అంటే.. ఆ ప్ర‌త్యేకాధికారి ప‌ర్మిష‌న్ ఇస్తే త‌ప్ప ఇక అక్క‌డ ఆందోళ‌న చేసే అవ‌కాశం లేదు. అంటే ఓ ర‌కంగా జంత‌ర్‌మంతర్ రిమోట్ మోడీ చేతిలోకి వెళ్లిపోయింద‌న్న‌మాట‌. బొద్దింక‌ల భ‌యంతో ఇంత మాత్రం చేయ‌క‌పోతే.. మ‌ళ్లీ పాత ప‌రిస్థితులు పున‌రావృతం అయ్యే అవ‌కాశాలూ లేక‌పోలేద‌నేది కేంద్రం జంకు. అందుకే జంత‌ర్‌మంత‌ర్‌పై నిబంధ‌న‌ల మంత్రం వేసి దాని డోర్ల‌కు లాక్ వేసింద‌న్న‌మాట‌.

Related News

జిల్లాలో ఒకే ఒక్క ఊరు.. దశాబ్దాలుగా ఏకగ్రీవ సర్పంచ్.. సున్నా కేసులు ఎక్కడో తెలుసా..?

కదిరి వైసీపీలో రగులుతున్న వర్గపోరు.. పిలవని పేరంటానికి వచ్చి రచ్చ..!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 22A నిషేధిత జాబితా నుంచి భూములు తొలగింపు?

2029 నాటికి 21 NDA రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్.. అమిత్ షా బిగ్ అనౌన్స్‌మెంట్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. డిఏల విడుదలపై సీఎం రేవంత్ క్లారిటీ!

తెలంగాణ రాజకీయంలో బిగ్ ట్విస్ట్.. అసెంబ్లీకి BRS దూరం కారణం అదేనా..?

మీ దగ్గర ఉన్న 20 రూపాయల నాణెం మంచిదేనా.. వెలుగులోకి నకిలీ కాయిన్ల దందా..!

అప్పుడు మోడల్.. ఇప్పుడు గుంతల జిల్లా.. దారుణంగా మారిన కొత్తగూడెం జిల్లా రోడ్లు!

Big Stories

Advertisement
×