E-Paper
Advertisement

ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. 15 బిలియన్ డాలర్లతో గూగుల్ హబ్ ఇక్కడే..?

ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. 15 బిలియన్ డాలర్లతో గూగుల్ హబ్ ఇక్కడే..?
Advertisement

Bay Tech: ఒకప్పుడు విశాఖపట్నం అంటే పోర్టులు.. స్టీల్ ప్లాంట్లు అందమైన బీచ్‌లు టూరిస్ట్‌ స్పాట్‌లు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు అదే విశాఖ గూగుల్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజాల పెట్టుబడులతో గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకునేందుకు రెడీ అవుతోంది. ఏకంగా 15 బిలియన్ డాలర్ల గూగుల్ ఇన్వెస్ట్‌మెంట్.. భారీ ఏఐ, డేటా సెంటర్ ప్రాజెక్టులు.. వేలాది ఉద్యోగాల అవకాశాలు. హైదరాబాద్‌లో సైబరాబాద్ తరహాలో విశాఖలోనూ బే టెక్ సిటీని డెవలప్ చేయాలనేది ఏపీ ప్రభుత్వ లక్ష్యం. మరి ఈ ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే విశాఖ నిజంగానే మరో హైదరాబాద్‌గా మారుతుందా? బెంగళూరు, చెన్నై వంటి టెక్ నగరాలకు పోటీ ఇవ్వగలదా? అసలు బే టెక్ సిటీ వెనుక ఉన్న ప్రణాళికలేంటి?

విశాఖలోనూ బే టెక్ సిటీ..

ఏపీ ప్రభుత్వం ఇప్పుడు విశాఖపట్నంపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటివరకు పోర్ట్ సిటీగా, పారిశ్రామిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన విశాఖను.. దేశంలోనే కీలకమైన టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ హబ్‌గా తీర్చిదిద్దాలని భావిస్తోంది. హైదరాబాద్‌లో సైబరాబాద్ తరహాలో విశాఖలోనూ బే టెక్ సిటీని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే బే టెక్ సిటీ అంటే విశాఖ నగరానికి కొత్త పేరు పెట్టడం కాదు. ఇది మరింత విస్తృతమైన విశాఖ ఆర్థిక ప్రాంత అభివృద్ధి ప్రణాళికలో ఒక భాగం మాత్రమే. శ్రీకాకుళం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ వరకు తొమ్మిది జిల్లాల్లో 21,880 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించిన ఈ ఫైనాన్షియల్ జోన్‌ని.. 2032 నాటికి 125 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ ప్రణాళికకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తున్న అంశం గూగుల్ ప్రతిపాదించిన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి.

గూగుల్ రెడీ..

Advertisement

విశాఖ సమీపంలోని తార్లువాడలో భారీ ఏఐ, డేటా సెంటర్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి గూగుల్ రెడీ అయ్యింది. 2028లో తొలి దశ అందుబాటులోకి తీసుకురావాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆపరేషన్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం లక్ష్యం ఒక్క గూగుల్ ప్రాజెక్టుతోనే ఆగిపోవడం లేదు. TCS, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకురావడంతో పాటు.. రాబోయే రెండేళ్లలో మరో 15 నుంచి 20 కొత్త కంపెనీలను తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఒక్కో కంపెనీ ద్వారా 15 వేల నుంచి 20 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉండేలా లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు చెబుతోంది.

Also Read: బచ్చలికూర టమాటో కర్రీ..వేడివేడి అన్నంలోకి అదిరిపోయే రెసిపీ!

109 అవగాహన ఒప్పందాలు..

Advertisement

మరోవైపు విశాఖకు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కూడా భారీగా వస్తున్నాయి. నవంబర్ 13న విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో ఏపీ ప్రభుత్వం రూ.9 లక్షల కోట్ల విలువైన 109 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటిలో అగ్నికుల్ కాస్మోస్ 510 కోట్లు, హాథోర్ రాకెట్స్ 250 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లను ప్రతిపాదించాయి. గ్రీన్‌జోన్ రెన్యూవబుల్ ఎనర్జీ 8 వేల కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 6 వేల 600 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నాయి. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే విశాఖలో ఇండస్ట్రీస్‌ మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇక పోర్ట్ బేస్‌డ్ బిజినెస్, మోడ్రన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఐటీ, ఏఐ టెక్నాలజీని కలిపి డెవలప్‌ చేయడం ద్వారా విశాఖను సమగ్ర ఆర్థిక కేంద్రంగా మార్చాలన్నది ప్రభుత్వ వ్యూహం.

వైజాగ్ 2.0 గ్రోత్ కారిడార్..

అయితే భారీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రకటిస్తేనే ఒక నగరం గ్లోబల్ టెక్ హబ్‌గా మారిపోదు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా అదే స్థాయిలో డెవలప్‌ చేయాలి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ వరకు వైజాగ్ 2.0 గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక ఇందులో కీలకం. అంతర్జాతీయ విమాన కనెక్టివిటీ, మెరుగైన రోడ్లు, పట్టణ రవాణా వ్యవస్థ, నాణ్యమైన నివాస ప్రాంతాలు, అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావాలి. అంతేకాదు.. ఐటీ కంపెనీలతో పాటు స్టార్టప్‌లు, రీసెర్చ్ ఏజెన్సీలు, కో-వర్కింగ్ స్పేస్‌లు కూడా డెవలప్ అవ్వాలి. స్థానిక యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించి, వారికి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగితేనే ఈ ప్రణాళికలకు నిజమైన సార్థకత లభిస్తుంది.

ఏఐ హబ్‌గా ఎదుగుతుందా?

మొత్తానికి వైజాగ్‌ ముందు ఇప్పుడు ఒక భారీ అవకాశం ఉంది. గూగుల్ 15 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రతిపాదన లక్షల కోట్ల ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఏఐ, డేటా సెంటర్ ప్రాజెక్టులు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ఇవన్నీ వైజాగ్‌ డెవలప్‌మెంట్‌కు కొత్త డైరెక్షన్ చూపిస్తున్నాయి. కానీ అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. పెట్టుబడుల ప్రకటనలు వాస్తవ ప్రాజెక్టులుగా మారాలి. కంపెనీలు తన బిజినెస్‌ను ప్రారంభించాలి. ఉద్యోగాలు స్థానిక యువతకు అందాలి. అప్పుడే హైదరాబాద్‌లో సైబరాబాద్ తరహాలో విశాఖలో బే టెక్ సిటీ కల సాకారమవుతుంది. మరి విశాఖ నిజంగానే భారతదేశపు నెక్ట్స్‌ ఐటీ, ఏఐ హబ్‌గా ఎదుగుతుందా? లేక భారీ పెట్టుబడుల ప్రకటనలకే పరిమితమవుతుందా? దీనికి ఆన్సర్‌ తెలియాలంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.

Also Read: వైజాక్ కైలాసగిరి కొండపై స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే?

విశాఖ గ్లోబల్ టెక్నాలజీ..

ఒకప్పుడు విశాఖపట్నం అంటే పోర్టులు, స్టీల్ ప్లాంట్లు, బీచ్‌లు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు అదే విశాఖ గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌లో నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఏకంగా 15 బిలియన్ డాలర్ల గూగుల్ ఇన్వెస్ట్‌మెంట్.. భారీ ఏఐ, డేటా సెంటర్ ప్రాజెక్టులు.. మరి విశాఖ మరో టెక్ హబ్‌గా మారబోతుందా? హైదరాబాద్‌లో సైబరాబాద్ తరహాలో విశాఖలోనూ బే టెక్ సిటీని డెవలప్‌ చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది కేవలం విశాఖ నగరానికి కొత్త పేరు కాదు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు తొమ్మిది జిల్లాల్లో 21 వేల 880 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించిన విశాఖ ఫైనాన్షియల్ జోన్ డెవలప్‌ ప్రణాళికలో ఇదొక భాగం. 2032 నాటికి ఈ ప్రాంతాన్ని 125 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

బెంగళూరుకు పోటీగా..

ఇందులో భాగంగా విశాఖ సమీపంలోని తార్లువాడలో గూగుల్ భారీ ఏఐ, డేటా సెంటర్ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. 2028లో తొలి దశ అందుబాటులోకి రావాలన్నది లక్ష్యం. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ దిగ్గజాలతో పాటు మరో 15 నుంచి 20 కంపెనీలను విశాఖకు తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. మరోవైపు సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో 9 లక్షల కోట్ల విలువైన 109 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్, వైజాగ్ 2.0 గ్రోత్ కారిడార్ కూడా ఈ అభివృద్ధికి కీలకం కానున్నాయి. అయితే పెట్టుబడుల ప్రకటనలతోనే టెక్ హబ్ ఏర్పడదు. మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన యువత, వాస్తవ ఉద్యోగాలు కూడా అవసరం. మరి విశాఖ నిజంగానే హైదరాబాద్, బెంగళూరుకు పోటీగా ఎదుగుతుందా? గ్లోబల్ ఏఐ హబ్‌గా మారుతుందా? లేక ఇవన్నీ కేవలం ప్రకటనలకే పరిమితమవుతాయా? రాబోయే సంవత్సరాలే సమాధానం చెప్పనున్నాయి.

Also Read: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో హీరో సత్తా.. ఏకంగా ఓలాను దాటేసిందిగా!

Tags

Related News

డీలిమిటేషన్‌కు బీఆరెస్‌ సై! బీజేపీకి జైకొట్టే కేసీఆర్‌ వ్యూహం! కేంద్రంలో సంకీర్ణం వస్తే కీలకం కావాలనేదే ఆ పార్టీ వ్యూహం!

NRIలకు IBM బిగ్ షాక్.. ఇండియాకు తిరిగి రావాల్సిందేనా?

తన కూతురికి ఇండియా అని పేరు పెట్టిన విదేశీ క్రికెటర్.. ఎందుకో తెలుసా?

మధ్యతరగతికి అందని సొంతిల్లు.. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు చూస్తే షాకే!

హైదరాబాద్‌ను భయపెడుతున్న నీటి గండం.. ఏడాదిలో 4 రెట్లు పెరిగిన ట్యాంకర్ బుకింగ్స్!

గ్రేటర్‌ ఓటరు దూరం దూరం..! 35 శాతమే ఓటర్లుగా నమోదైన వైనం..! 12 లక్షలకు 36,837 మందే ఓటర్లుగా నమోదు..!

అమెరికాలో 10 ఏళ్లు ఉంటే గ్రీన్‌కార్డు! డెమోక్రాట్ల కొత్త బిల్లులో ఏముంది?

Big Stories

Advertisement
×