BigTV English

BRS Party: బీఆర్ఎస్‌లో గుబులు రేపుతున్న ఆ రెండు జిల్లాలు

BRS Party: బీఆర్ఎస్‌లో గుబులు రేపుతున్న ఆ రెండు జిల్లాలు

BRS Party: లీడర్ లేరు.. పార్టీని ముందుండి నడిపించే నాయకుడు కరువయ్యాడు. ఆ ఎఫెక్ట్‌తో కేడర్ చెల్లాచెదురవుతున్న పరిస్థితి.. దాంతో స్థానిక సమరం లో పోటీ చెద్దామంటే.. గెలుస్తామన్న గ్యారంటీ లేకుండా పోయిందంట. ఆ భయమే గులాబీ దండు గుండెల్లో‌‌‌ దడ పుట్టిస్తోందంటున్నారు. ఆ క్రమంలో యుద్దానికే ముందే ఓటమి అంగీకరించినట్లు లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు ముందే బిఅర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందంట. ఎన్నికల యుద్దంలో దిగడానికి అభ్యర్ధులే కరువయ్యారంటున్నారు. అసలు గులాబీ పార్టీల్లో అంత గుబులు రేపుతున్న జిల్లా ఏది?


కొమురం భీమ్ , మంచిర్యాల జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల భయం బీఅర్ఎస్‌ను వణికిస్తోందంట. ఒకవైపు సర్కార్ ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతోంది. కాని ఎన్నికలంటేనే కారు పార్టీ భయపడుతోందట. కొమరం బీమ్, మంచిర్యాల జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో నాలుగు అసెంబ్లీ స్థానాలలో గులాబీ పార్టీ ఓడిపోయింది. ఒక ఆసిఫాబాద్‌లో ఆ పార్టీఎమ్మెల్యే కోవ లక్ష్మి ఉండగా.. సిర్పూర్ టి‌ నియోజకవర్గంలో బిజెపి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, బెలంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. ఇక పెద్దపల్లి ఎంపీగా వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ కొనసాగుతున్నారు.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో కారు పార్టీ ఘోర పరజయాన్ని చవి చూసింది. వరుస ఓటములతో కారు పార్టీ పరిస్థితి ఆ పార్టీ నేతలకే అర్థం కాకుండా తయారైందంట. ఇప్పటికే ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. క్యాడర్, లీడర్లు హస్తం గూటికి చేరడంతో గులాబీ పార్టీ దాదాపు ఖాళీ అయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆ పార్టీకి మాజీ ఎమ్మెల్యేలు తప్పితే వారి వెంట నడిచే నాయకులు పెద్దగా లేరంటున్నారు. సిర్పూర్ టీ మాజీ ఎమ్మెల్యే కోనప్ప కూడా కారు దిగి హస్తం నీడకు చేరిపోయారు.


ఆ రెండు జిల్లాలో ఉన్న బీఅర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో కనిపించడం లేదట.‌‌ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మూడు నెలలకోసారి కూడా సెగ్మెంట్లో అడుగు పెట్టడం లేదట.. కేడర్‌కి కనీసం కాంటాక్ట్‌లో కూడా లేరంట. మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, దివాకర్ రావులు సైతం ఏదో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కనిపించడం తప్పితే కేడర్‌తో అంటి‌ముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. సిర్పూర్ లో మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ ఉన్నా.. ఆయన గెస్ట్ లీడరే అంటున్నారు. ఒక ఎమ్మెల్యే కోవ ల‌క్ష్మి తప్పితే.. మిగితా వాళ్లేవరు పార్టీని పట్టించుకోవడం లేదట.

Also Read: ఇదేంటి మేడం.. సీరియస్‌నెస్ లేని సీఎస్‌!

ఇలాంటి పరిస్థితుల్లో ‌‌ సర్పంచ్, ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే పోటీ దిగాలంటే కూడా నాయకులు వణుకుతున్నారట. ఓటమి చవిచూడటానికి ఎందుకు ఎదురు వెళ్లాలని నాయకులు మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారట. అసలే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రజాపాలనతో ప్రజలకు రోజురోజుకి చేరువవుతుంది. ఆ పార్టీని తట్టుకుని నిలబడలేమంటున్నారట‌‌ బిఅర్ ఎస్ నాయకులు.. పోని పార్టీ కోసం పోటీ చేద్దామంటే.. సొంత పార్టీకి చెందిన మాజీ ‌ఎమ్మెల్యేల పై ఉన్నా వ్యతిరేకత ప్రజల్లో తగ్గలేదట. అందుకే స్థానిక సమరమంటేనే జంకుతున్నాయంట గులాబీ శ్రేణులు.

ఓటమి తప్పదని తెలిసీ చేతి చములు వదిలిచ్చుకోవడం ఎందుకుని ద్వితీయ శ్రేణి నాయకులు భయపడుతుంటే.. మాజీ ఎమ్మెల్యేలు మాత్రం మేకపోతు గాంబీర్యం‌ ప్రదర్శిస్తూ ఎన్నికలలో తమదే గెలుపని తెగ బీరాలు పోతున్నారంట. అదేమంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై అప్పుడే వ్యతిరేకత పెరుగుతోందని.. విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులను స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారి ధీమాను చూసి బీఆర్ఎస్ కార్యకర్తలే నవ్వుకుంటున్న పరిస్థితులు రెండు జిల్లాల్లో కనిపిస్తున్నాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికలలో మాజీ ఎమ్మెల్యేల ధీమా ఎంత వరకు నిజమవుతుందో? అసలు వారికి అభ్యర్ధులు దొరుకుతారో? లేదో చూడాలి.

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×