Mp Ayodhya Rami Reddy: నిజం తెలుసుకునే లోపు.. అబద్దం గుమ్మం దాటి పోతుందని ఓ సీనియర్ జర్నలిస్టు చెప్పిన మాట. అక్షరాలా నిజం అవుతోంది. ఒకప్పుడు ఇదే స్ట్రాటజీని ఎత్తుకున్న కొన్ని పార్టీలు ఇప్పుడు అదే ఉచ్చులో పడి గిలగిల కొట్టుకుంటున్నాయి. అందుకు ఎగ్జాంపుల్ వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజీనామా వ్యవహరం.
రీసెంట్‌గా వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. ఆయన వార్త బయటకు వచ్చిన నిమిషాల వ్యవధిలో ఆ పార్టీకి మరో ఎంపీ రాజీనామా చేశారంటూ వార్తలు జోరందుకున్నాయి. దీనిపై మీడియాలో ఒకటే చర్చ. అసలు వైసీపీలో ఏం జరుగుతోందన్న టెన్షన్ ఆ పార్టీ నేతలను వెంటాడింది.
వైసీపీ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది. ఫారెన్ టూర్‌లో ఉన్న ఎంపీ అయోధ్యతో కొన్ని ఛానెళ్లకు ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చారు. తాను ఇండియాకు వచ్చిన తర్వాత అంతా చెబుతానని వెల్లడించారు. ఫారెన్ నుంచి విజయవాడకు చేరుకున్నారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.
ఎంపీ వస్తున్న విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో రిప్లై ఇచ్చేశారు. లైట్‌గా నవ్వుతూ అదంతా ఫేక్ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఆయన రాజీనామాపై జరుగుతన్న ప్రచారానికి బ్రేక్ పడిందనే చెప్పవచ్చు.
ALSO READ: పదవులపై లోకేష్ క్లారిటీ, రంగంలోకి బాలకృష్ణ
నార్మల్‌గా అయితే వ్యాపారవేత్తలు ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. వాళ్లు తమ టర్న్ ముగిసేవరకు సైలెంట్‌గా తమ పనులు చేసుకుంటారు. ప్రభుత్వాలు మారిన తర్వాత సందర్భాన్ని బట్టి అడుగులు వేయడం చూస్తుంటాము. రాంకీ గ్రూపు యజమాని అయోధ్య రామిరెడ్డికి జగన్ అత్యంత సన్నిహితుడు కూడా. జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే రేపటి రోజున రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కూడా.
వైసీపీకి రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన అయోధ్య రామిరెడ్డి
హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తకు క్లారిటీ
రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారా అన్న ప్రశ్నకి… pic.twitter.com/xfDz01b8Ux
— BIG TV Breaking News (@bigtvtelugu) January 28, 2025