BigTV English

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

Bagram Air Base: ట్రంప్ నయా స్కెచ్. అఫ్ఘానిస్తాన్ లోని బాగ్రాం ఎయిర్ బేస్ ను ఇచ్చేయాలని తాలిబన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాడు. 30 రోజు డెడ్ లైన్ విధించాడు. ఇవ్వకపోతే బ్యాడ్ థింగ్స్ జరుగుతాయని బెదిరించాడు. చెప్పను.. ఏం చేయాలో అది చేసి చూపిస్తా అన్నట్లుగా ఉంది ట్రంప్ తీరు. సో ట్రంప్ ఫారిన్ పాలసీలో ఆఫ్ఘానిస్తాన్ మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. ఏంటి ఈ బాగ్రాం ఎయిర్ బేస్ స్పెషాలిటీ? ట్రంప్ మనసు ఇటువైపు ఎందుకు మళ్లింది?


బాగ్రాంను 2021 జులైలో ఖాళీ చేసిన అమెరికాన్ ట్రూప్స్

ఈ బాగ్రాం ఎయిర్ బేస్ ను జో బైడెన్ హయాంలో అంటే 2021లో అమెరికన్ ట్రూప్స్ ఖాళీ చేసి వెళ్లిపోయాయి. 2001 నుంచి 2021 వరకు అఫ్ఘాన్ లో అమెరికా, నాటో బలగాలు దీన్ని స్ట్రాటజిక్ బేస్ గా వాడుకున్నాయి. తమ అవసరాల కోసం చాలా డెవలప్ చేశాయి కూడా. అమెరికన్ ట్రూప్స్ 2021 జులై 1న రాత్రికి రాత్రే ఖాళీ చేసి వెళ్లిపోయాయి. చాలా వాహనాలు అలాగే వదిలేశారు. పెద్ద బాంబులు తీసుకెళ్లారు. చిన్నచిన్న వాటిలో కొన్ని అక్కడే పేల్చేసి.. ఇంకొన్ని వదిలేసి వెళ్లారు. వాళ్లు వెళ్లిన కొద్ది సేపటికే పవర్ ఆఫ్ అయింది. అఫ్గాన్ సైన్యం తమ అధీనంలోకి తీసుకుంది.


బాగ్రాంను ఇంకా డెవలప్ చేసే పనిలో చైనా

సీన్ కట్ చేస్తే… చైనా రంగంలోకి దిగి దీన్ని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద అభివృద్ధి చేసే పని పెట్టుకుంది. చైనా అణ్వాయుధాలు తయారు చేసే ప్రాంతానికి ఈ ఎయిర్ బేస్ దగ్గరగానే ఉంటుంది. చైనా 200 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసి, రన్‌వే, రాడార్ సిస్టమ్స్ మరింతగా అప్‌గ్రేడ్ చేసింది. అయితే ఇప్పుడు ట్రంప్ కన్ను ఈ ఎయిర్ బేస్ పై పడింది. ట్రంప్ మొదటి టర్మ్‌లో అంటే 2017-2021 మధ్య ఆఫ్ఘాన్ పీస్ డీల్ చేశాడు. దాంతో అమెరికా అక్కడి నుంచి విత్‌డ్రా అయింది. కానీ ఇప్పుడు రెండో టర్మ్‌లో అమెరికా ఫస్ట్ పాలసీ కారణంగా మళ్లీ దీనిపై కన్నేశాడు. ఇరాన్, ఇటు రష్యా, అటు చైనా ఈ మూడు దేశాలకు చెక్ పెట్టాలంటే బాగ్రాం ఎయిర్ బేస్ ను తిరిగి చేతుల్లోకి తెచ్చుకుని మధ్య ఆసియాలో మళ్లీ గేమ్ స్టార్ట్ చేయాలన్న లక్ష్యంతో ట్రంప్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

మధ్య ఆసియాలో మరో కుంపటికి రంగం సిద్ధం

బాగ్రాం ఎయిర్‌బేస్‌ను తామే నిర్మించామని, దాన్ని తిరిగి ఇవ్వాలనడం వెనుక ట్రంప్‌ వ్యూహాలు చాలానే ఉన్నాయి. ఇదే అంశంపై అఫ్ఘాన్‌తో చర్చలు జరుపుతామని దాన్ని తిరిగి తీసుకుంటామంటున్నారు. అందుకు వారు ఒప్పుకోకపోతే తాను ఏం చేస్తానో ఎవరూ ఊహించలేరని అనడం మధ్య ఆసియాలో మరో కుంపటికి దారి తీయబోతోందా అన్న టెన్షన్లు పెరుగుతున్నాయి. చైనా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే కేంద్రాలకు సమీపంలో ఉన్న ఈ స్ట్రాటజిక్ బాగ్రాం ఎయిర్ బేస్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు బ్రిటన్‌ పర్యటనలో ట్రంప్ చెప్పుకొచ్చారు. కేవలం ఒక గంట గ్యాప్ లోనే ఈ అణు ప్రదేశాలకు చేరుకోవచ్చన్నాడు.

ఇంచు కూడా ఇవ్వబోమంటున్న తాలిబాన్లు

ఒకవైపు ట్రంప్ ఇంతలా బెదిరిస్తూ ఆ ఎయిర్ బేస్ ఏదో తమ సొంతం అన్నట్లుగా మాట్లాడుతుంటే తాలిబాన్ ప్రభుత్వం ఊరుకుంటుందా.. ఏ దేశానికైనా వారి సార్వభౌమాధికారం కీలకం. నచ్చినప్పుడు వస్తాం.. స్వాధీనం చేసుకుంటాం.. ఇచ్చేయాల్సిందే అని అంటే కుదురుతుందా.. అందుకే తాలిబాన్ సర్కార్ ఘాటుగానే రియాక్ట్ అయింది. అఫ్గాన్ భూమి నుంచి ఒక్క అంగుళం కూడా అమెరికాకు ఇచ్చేది లేదన్నాడు తాలిబన్ డిఫెన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫసివుద్దీన్. కొంతమంది రాజకీయ ఒప్పందం ద్వారా బాగ్రాంను స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నారని, అయితే ఎవరి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. తమ స్వయంప్రతిపత్తి, ప్రాదేశిక సమగ్రత ముఖ్యమంటున్నారు.

ట్రంప్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన చైనా

అటు ట్రంప్‌ వ్యాఖ్యలపై చైనా కూడా ఇటీవలే రియాక్ట్ అయింది. అఫ్గాన్‌ ఫ్యూచర్ అక్కడి ప్రజల చేతుల్లోనే ఉందని అభిప్రాయపడింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచడం వల్ల మద్దతు లభించదని, ఎవరూ బాగుపడేది కూడా లేదన్నారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి. ప్రస్తుతానికి అమెరికా – తాలిబన్ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేవు. దీంతో బాగ్రాం చుట్టూ నెక్ట్స్ ఏం జరగబోతోందన్నది కీలకంగా మారుతోంది. చెప్పాలంటే బాగ్రాం ఎయిర్ బేస్ చాలా దేశాలకు ఓ ప్లేగ్రౌండ్ మాదిరిగా తయారైంది. 1950లో సోవియట్ యూనియన్ దీన్ని నిర్మించిన దగ్గర్నుంచి ఎవరికి నచ్చినట్లు వాళ్లు వాడుకున్నారు. వదిలేయడం, మళ్లీ ఆక్రమించడం ఇదే జరిగింది. 2001లో అమెరికా స్వాధీనం చేసుకోవడం.. 2021 తర్వాత చైనా డెవలప్ చేయడం, తాలిబాన్ ప్రభుత్వం చేతికి వెళ్లడం.. ఇప్పుడు మళ్లీ అమెరికా కావాలనడం బాగ్రాం చుట్టూ భగభగ మామూలుగా లేదు.

ఒకప్పుడు సోవియట్ ట్రూప్స్‌కు హబ్‌గా బాగ్రాం

1950లలో సోవియట్ యూనియన్ ఈ బాగ్రాం ఎయిర్ బేస్ ను నిర్మించింది. 1976లో రన్‌వే పూర్తి చేశారు. 1979 నుంచి 1989 మధ్య సోవియట్-అఫ్ఘాన్ యుద్ధంతో పూర్తిగా ఆక్రమించేసింది. సోవియట్ ఫోర్సెస్ కు ఇది మెయిన్ హబ్ అయింది. ఇక్కడ నుంచే ఆపరేషన్స్, సప్లైలు, ట్రూప్స్ షిఫ్టింగ్ ఇవన్నీ జరిగాయి. డ్రోన్ స్ట్రైక్‌లు, లాజిస్టిక్స్ కోసం కీలకంగా మారింది. అయితే 1989లో సోవియట్ బయటికి వెళ్లిపోయిన తర్వాత, అఫ్ఘాన్ గవర్నమెంట్ ఈ ఎయిర్ బేస్ ను కంట్రోల్‌లోకి తీసుకుంది. నైన్ బై లెవెన్ ఎటాక్ తర్వాత అమెరికా ఈ బాగ్రాం బేస్‌ను స్వాధీనం చేసుకుంది. ఇది అఫ్ఘాన్‌లో అమెరికా అతిపెద్ద మిలిటరీ బేస్ అయింది. US ఎయిర్ ఫోర్స్ దీన్ని డీల్ చేసింది. అదే సమయంలో ఈ బేస్ ను అమెరికా మరింత ఆధునీకరించింది. 3 లార్జ్ హ్యాంగర్లు, కంట్రోల్ టవర్, 50 బెడ్ హాస్పిటల్, 3 ఆపరేటింగ్ థియేటర్లు, ఫ్యూయల్ డిపోలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేసింది. అయితే 2021 జూలైలో ఈ బేస్‌ను ఉన్నఫళంగా సామాన్లు అలాగే వదిలేసి అమెరికన్ ట్రూప్స్ వెళ్లిపోయాయి. ఇప్పుడు చైనా అభివృద్ధి పనులు చేస్తుంటే.. ఇప్పుడు మళ్లీ అమెరికా వచ్చి అది మాకు ఇచ్చేయాలంటోంది.

బాగ్రాం ఎయిర్ బేస్ కోసం ట్రంప్ ఒత్తిడి

మీరు చైనాకు ఇచ్చేస్తే, మేము దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం. అమెరికా ఎప్పటికీ బలహీనపడదు అన్న డైలాగ్ లను ట్రంప్ వినిపిస్తున్నారు. చైనా ఈ బేస్ దగ్గర బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ను బలోపేతం చేస్తోంది. అమెరికా చైనా ట్రేడ్ వార్‌ తర్వాత కథ మారుస్తోంది. అయితే స్ట్రాంగ్ లీడర్ గా ఇమేజ్ బిల్డ్ చేసుకునే పనిలో ట్రంప్ ఉన్నాడు. అందుకే ఈ బాగ్రాం ఎయిర్ బేస్ పై ఒత్తిడి పెంచుతున్నాడు. 30 రోజుల్లో ఈ ఎయిర్ బేస్ ను తాలిబన్లు అమెరికాకు ఇవ్వకపోతే ట్రంప్ ఏం చేయొచ్చు.. అన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. B2 బాంబర్ ను మళ్లీ రంగంలోకి దింపుతాడా.. ఏం జరగబోతోంది?

అఫ్ఘాన్ పై ఎటాక్స్ చేయిస్తారా?

దౌత్యపరంగా ఒత్తిడి చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు తాలిబాన్ సర్కారుకు అమెరికా ఇప్పటికే అందిస్తున్న సహాయాన్ని ఆపేయడం, గుర్తింపును రద్దు చేయడం, తాలిబాన్లను ఒంటరి చేయడం ఇలాంటివి జరిగే అవకాశం ఉందంటున్నారు. ఆర్థికంగా ముప్పు తిప్పలు పెట్టడం, తాలిబాన్ లింక్ నెట్ వర్క్ లపై ఆంక్షలు విధించండం, కోవర్ట్ ఆపరేషన్స్ అంటే రెయిడ్స్, ఇంటెలిజెన్స్ మిషన్స్, పారామిలటరీ యాక్టివిటీ పెంచడం, లేదంటే సైబర్ ఎటాక్స్ చేయడం తాలిబాన్ కమ్యూనికేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై ఎటాక్స్ చేయడం, వీటితో పాటు ఫైనల్ ఆప్షన్ గా బాగ్రాం చుట్టూ ఎయిర్ స్ట్రైక్స్ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. సైన్యంతో బాగ్రాం ఎయిర్ బేస్ ను ముట్టడించి స్వాధీనం చేసుకోవడం ఇలాంటి ఆప్షన్లు చూసే అవకాశం ఉంది.

ఓవరాల్ గా ట్రంప్ ఈ చర్యతో శాంతిమాటున బలోపేతం అవడం అన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. అఫ్ఘాన్ సంఘర్షణ మళ్లీ పెరిగితే మధ్య ఆసియాలో స్థిరత్వం, శాంతికి మరోసారి విఘాతం కలగడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక భారత్ వైపు నుంచి చూస్తే అఫ్ఘాన్ రీ బిల్డ్ కోసం మనం ఆల్రెడీ 3 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాం. బాగ్రాం సహా అఫ్ఘాన్ లో చైనా ఇన్‌ఫ్లూయెన్స్ పెరిగితే, ఇండియా-సెంట్రల్ ఆసియా కారిడార్ కు ఆటంకం. వీటికి తోడు భారత్ ఇప్పటికే తాలిబాన్‌ సర్కారుతో చర్చలు జరుపుతోంది. అభివృద్ధికి సహాయం అందిస్తోంది. ఇప్పుడు ట్రంప్ చర్యలతో చైనాపై ఒత్తిడైతే పెరుగుతుంది గానీ.. అభివృద్ధికి, అఫ్ఘాన్ రీ బిల్డ్ కు బ్రేక్ పడుతుంది. మరి 30 రోజుల డెడ్ లైన్ తర్వాత అఫ్ఘాన్ పై ట్రంప్ ఏ అస్త్రం ప్రయోగించబోతున్నాడో చూడాలి.

story By Vidya Sagar, Bigtv

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×