Mass jathara: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు వంటి అగ్ర హీరోల తర్వాత అంతటి పేరు సొంతం చేసుకున్న హీరోల జాబితాలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున నిలుస్తారు. ఆ తర్వాత హీరోల జాబితాలో నిలిచిన వారిలో రవితేజ (Raviteja ) కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇన్స్పిరేషన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి.. ఆయన లాగే కష్టపడి పైకొస్తూ తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తన మాస్ పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న రవితేజ.. గత కొద్దిరోజులుగా హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు. కానీ ‘ధమాకా’ తర్వాత ఆయన కెరియర్లో ఆ రేంజ్ లో హిట్టు పడలేదని చెప్పవచ్చు.
ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించిన రవితేజ ఒక్క హిట్టు కూడా దక్కించుకోకపోవడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేశారు. దీంతో ఎలాగైనా సరే మాస్ జాతర సినిమాతో సరైన సక్సెస్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేశారు. అందుకు తగ్గట్టుగా ఇతర సినిమాలతో మింగిలై మరి సినిమా ప్రమోషన్స్ చేసుకున్నారు. అలా ఎట్టకేలకు భాను భోగవరపు దర్శకత్వంలో.. రవితేజ, శ్రీ లీలా జంటగా వచ్చిన మాస్ జాతర అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గానే నిలిచింది. ఫుల్ రన్ ముగిసే సరికి కేవలం 15 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాకి నష్టం ఏ రేంజ్ లో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
also read:Rahul Ravindran: ది గర్ల్ ఫ్రెండ్ మూవీ… క్షమాపణలు చెప్పిన డైరెక్టర్.. ఎందుకంటే?
ఇకపోతే ఈ కలెక్షన్స్ చూసి నెటిజన్స్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హీరోగా రవితేజకి బుట్ట సర్దే టైం వచ్చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేసినా.. ఒకటి కూడా సరైన సక్సెస్ అందించలేదు. కాబట్టి ఈయన హీరోగా ట్రై చేయడం కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కెరియర్ ఆరంభించడం బెటర్ అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం వాస్తవానికి ఇదివరకే చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్ర పోషించి మంచి సక్సెస్ అందుకున్నారు రవితేజ. కానీ సోలో హీరోగా ఈయనకు ఒక్క సినిమా కూడా కలిసి రావడం లేదు. అందుకే నెటిజన్స్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా రవితేజ కాస్త కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడితే నెక్స్ట్ సక్సెస్ లభించడం గ్యారెంటీ అని అభిమానులు సలహాలు ఇస్తూ ఉండడం గమనార్హం.
రవితేజ తదుపరి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన ఆర్టీ 76 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో… ఖిలాడీ సినిమాలో రవితేజతో మాస్ స్టెప్స్ తో అదరగొట్టేసిన డింపుల్ హయతి ఇందులో భాగమైనట్లు స్వయంగా ప్రకటించింది. అలాగే ఆషిక రంగనాథ్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో రాబోతున్న ఈ సినిమా అయినా రవితేజకు సక్సెస్ అందించి.. ఆయనపై వస్తున్న నెగిటివ్ రూమర్స్ కి గట్టిగా కౌంటర్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు