Shah Rukh Khan – Pujara : టీమిండియా క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా కెరీర్ కి 2009లో బాలీవుడ్ సూపర్ స్టార్, కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారూఖ్ ఖాన్ చేసిన సహాయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పుజారా కెరీర్ ను ప్రమాదం నుంచి రక్షించిందని.. అతనికి గొప్ప ఊరటనిచ్చిందని పుజారా తండ్రి అరవింద్ పుజారా వెల్లడించారు. 2009 ఐపీఎల్ సీజన్ సందర్భంగా యువ క్రికెటర్ చటేశ్వర్ పుజారాకి హామ్ స్ట్రాంగ్ తీవ్రంగా గాయమైంది. దీనికి తక్షణ శస్త్ర చికిత్స అవసరం అయింది. గాయం కారణంగా పుజారా మానసికంగా క్రుంగిపోయాడు.
Also Read : IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజర్ ఫినిషర్ వస్తున్నాడు
షారూఖ్ ఖాన్ అద్భుతమైన ఆఫర్
అయితే పుజారా కుటుంబం అతనికి సొంత ఊరు రాజ్ కోట్ లో చికిత్స చేయించాలని భావించింది. ఈ సమయంలోనే షారూఖ్ ఖాన్ జోక్యం చేసుకున్నాడు. పుజారాకి అద్భుతమైన భవిస్యత్ ఉందని.. నమ్మిన షారూఖ్ ఖాన్ అతనికి ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యం అందించాలని పట్టుబడ్డాడు. రగ్బీ క్రీడాకారులకు కూడా తరుచూ ఇలాంటి గాయాలు అవుతాయి. సౌతాఫ్రికాలోని వైద్యులు ఈ శస్త్ర చికిత్సల్లో అత్యంత నిపుణులు అని షారూఖ్ ఖాన్ వివరించారు. పుజారా కుటుంబ సభ్యులను ఒప్పించడానికి షారూఖ్ ఖాన్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడట. పుజారా కి చికిత్స చేయించడానికి అతని కుటుంబ వైద్యుడు డాక్టర్ షా ఎంత మంది కుటుంబ సభ్యులనైనా సౌతాఫ్రికాకు విమానంలో తీసుకెళ్లడానికి ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని హామీ ఇచ్చాడు. పుజారా తండ్రి అరవింద్ పుజారా కి పాస్ పోర్ట్ లేకపోవడంతో షారూఖ్ ఖాన్ తరపున కోల్ కతా నైట్ రైడర్స్ మేనేజ్ మెంట్ అతి తక్కువ సమయంలో అన్ని పత్రాలను సిద్ధం చేయించింది.
అరవింద్ పుజారా త్వరగా దక్షిణాఫ్రికాకు చేరుకోవడానికి వీలు కల్పించింది. తన తండ్రిని, కుటుంబ వైద్యుడిని సౌతాఫ్రికాలో చూసిన పుజారా కళ్లలో ఆనందాన్ని అరవింద్ పుజారా గుర్తు చేసుకున్నారు. అతను ఒంటరిగా విదేశీ గడ్డపై గదికి పరిమితమై చాలా నిరాశగా ఉన్నాడు. నన్ను చూసినప్పుడు అతని ముఖంలో చిన్న పిల్లాడి చిరునవ్వు కనిపించింది అని ఆయన తెలిపారు. సౌతాఫ్రికాలో శస్త్ర చికిత్స విజయవంతం అయింది. ఇక ఆ తరువాత పుజారా పూర్తిగా కొలుకొని భారత టెస్ట్ జట్టులో స్థానం సంపాదించుకోగలిగాడు. ప్రస్తుతం పుజారాకి షారూఖ్ శస్త్ర చికిత్స చేయించాడు.. తండ్రి పాస్ పోర్ట్ ఇప్పించాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం. 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన స్వదేశీ సిరీస్‌లో చటేశ్వర్ పుజారాకు జాతీయ జట్టులోకి అవకాశం లభించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆడలేని బౌలర్ LBW అవుట్ కావడంతో, రెండో ఇన్నింగ్స్‌లో తన ‘ముందున్న’ రాహుల్ ద్రవిడ్ స్థానంలో 3వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, బెంగళూరులో 4వ ఇన్నింగ్స్‌లో పొడిగా, మలుపు తిరుగుతున్న వికెట్‌పై గమ్మత్తైన 72 పరుగులు చేసి అరంగేట్రంలో 4వ ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించిన ఐదవ భారతీయుడిగా నిలిచాడు.
Also Read : Mohammed Shami : రూ .4 లక్షలు చాలడం లేదు నెలకు రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే..షమీ భార్య సంచలనం