Visakhapatnam: ఏపీ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే విశాఖలో ఈ నెల 13, 14 జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు రానుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సులో సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునేందుకు 40 కోట్ల రూపాయలతో విశాఖను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ సిద్ధమవుతోంది. ప్రపంచ స్థాయి వసతులతో అతిధులకు ఆతిథ్యం ఇచ్చేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏర్పాట్లలో ఎక్కడా రాజీ లేకుండా ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక సెక్యూరిటీతో పాటు సదస్సుకి హాజరయ్యే పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు.
పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
మరోవైపు విశాఖలోని ప్రధాన కూడళ్లను ప్రభుత్వం ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. కూడళ్లలో ఏర్పాటు చేస్తున్న అద్భుత కళాఖండాలు, వాటర్ ఫౌంటెన్లు అబ్బుర పరుస్తున్నాయి. పెట్టుబడులకు ముఖద్వారం విశాఖనే అనేలా ముస్తాబు చేస్తున్నారు. రోడ్ డివైడర్లకు సైతం రంగులు అద్దుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు.
Also Read: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!
వాల్‌పెయింటింగ్స్‌తో పాటు డివైడర్లకు కొత్త రంగులు
ఇదిలా ఉంటే అవసరమైన చోట కొత్త రోడ్లను కూడా ప్రభుత్వం నిర్మిస్తోంది. ఎక్కడికక్కడ వేస్తున్న వాల్ పెయింటింగ్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రోడ్లకు ఇరువైపులా ఉండే గోడలన్నీ కొత్త రంగలతో మెరిసిపోతున్నాయి. అలాగే పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా చేస్తున్న ఏర్పాట్లలో పచ్చదనానికి కూడా అధికారులు పెద్ద పీట వేస్తున్నారు. అందం, ఆహ్లాదం కలగలిపి విశాఖను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.