BigTV English
Advertisement

Hyderabad History : మన సిటీలోని ఈ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?

Hyderabad History : మన సిటీలోని ఈ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?
Hyderabad History

Hyderabad History : హైదరాబాద్ నగరానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడి ప్రతి వీధి పేరు వెనక బోలెడంత చరిత్ర ఉంది. ఆ కాలపు పాలకులు, అక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా ఏర్పడిన ఈ పేర్లలో కొన్ని కాలక్రమంలో మారిపోయినా.. కొన్ని పేర్లు అలాగే కొనసాగుతున్నాయి. అలాంటి కొన్ని ఏరియాల పేర్లు.. వాటికి ఆ పేరు రావటం వెనకగల కారణాలను తెలుసుకుందాం.


చిక్కడపల్లి: దీని అసలు పేరు చిక్కడ్ – పల్లి. మరాఠీలో ‘చిక్కడ్’ అంటే బురద. అప్పట్లో వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండి.. లోయర్​ట్యాంక్ బండ్‌లో ఉన్న ఈ ప్రాంతమంతా మోకాళ్లలోతు బురద పేరుకుపోయేదట. దీంతో దీనికి చిక్కడ్ పల్లి.. అని వచ్చింది.

బాగ్‌లింగంపల్లి: గోల్కొండను 1550 నుండి 1580 వరకు పాలించిన ఇబ్రహీం కులీ కుతుబ్‌షా విధిగా వాకింగ్ చేసేవాడు. ఆయన మార్నింగ్ వాక్ కోసం.. నాటి అధికారులు పెద్ద తోటను పెంచారు. ట్యాంక్‌బండ్​ నుంచి ఆయన ఈ తోట వరకు ఆయన వాకింగ్ సాగేది. ఈ తోట ఉన్న ఏరియాకే బాగ్‌లింగంపల్లి అని పేరు.


తాడ్​బండ్: దీని అసలు పేరు తాడ్ బన్(తాటి చెట్ల వనం). సికింద్రాబాద్‌ను ఆనుకుని ఉండే ఈ ప్రాంతమంతా ఒకప్పుడు వేలాది తాటిచెట్లతో నిండి ఉండేది. దీంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.

ఫతే మైదాన్: ఫతే అంటే విజయం. మైదాన్ అంటే గ్రౌండ్. ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఇక్కడ బస చేశాడు. ముట్టడి పూర్తయిందనే విజయప్రకటన ఇక్కడే చేయటంతో దీని పేరు ఫతే మైదాన్ అయింది. అందులోనే ఎల్బీ స్టేడియాన్ని నిర్మించారు.

పబ్లిక్ గార్డెన్స్ అసలు పేరు.. ‘ బాగ్-ఏ-ఆమ్’. బాగ్ అంటే తోట. ఆమ్ అంటే సాధారణ ప్రజలు. సాయంత్రం పూట పౌరులు తమ పిల్లాపాపలు, కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా కాలక్షేపం చేయటానికి దీనిని ఏర్పాటు చేశారు. అదే కాలక్రమంలో పబ్లిక్ గార్డెన్స్ అయింది.

యాకుత్ పుర: పాతబస్తీకి గుండెకాయ వంటి ప్రాంతం ఇది. ఉర్దూలో యాఖుత్ అంటే.. నీలిరంగు రత్నం అని అర్ధం. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కి పచ్చలంటే చాలా ఇష్టం. దీంతో ఆ ఏరియాకు యాఖుత్ పురా అని పేరు పెట్టారట.

బేగంపేట: ఆరవ నిజాం.. మహబూబ్ అలీ ఖాన్(అసఫ్ జా VI) కుమార్తె పేరు.. బషీరున్నీసా బేగం. ఆమె వివాహ సమయంలో ఆమె తండ్రి.. నేటి ప్రాంతాన్నంతా కట్నం కింద రాసిచ్చేశాడు. ఆమె పేరులోని బేగం పేరుతో దీనికి బేగంపేట అని వచ్చింది.

సరూర్ నగర్: రెండో నిజాం హయాంలో ప్రధానిగా పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య పేరు.. సరూర్ అఫ్జాబాయి. భార్యకు ఆయన రాసిచ్చిన ఆ ప్రాంతం.. ఆమె పేరుతో స్థిరపడిపోయింది.

డబీర్ పురా: ఉర్దూలో డబీర్ అంటే పండితుడు(ఇంటెలెక్చువల్ అనుకోవచ్చు) అని అర్ధం. నిజాంల కాలంలో పండితులు, మేధావులు, మంత్రులు ఎక్కువగా ఆ ప్రాంతంలోనే నివసించేవారు. దీంతో ఆ ప్రాంతానికి ఆ పేరు స్థిరపడిపోయింది.

అంబర్ పేట: ఉర్దూలో అంబర్ అంటే ఆకాశం( మేఘాలు). అప్పట్లో తీయని నీటితో నిండిన ముచికుందా నది(నేటి మూసీ) ప్రాంతమంతా ఎప్పుడూ మబ్బుపట్టినట్లు ఉండేది. వాతావరణం కాస్త చల్లబడగానే.. వెంటనే ఇక్కడ వానకురిసేదట. దీంతో అది అంబర్‌ పేట అయింది.

చాంద్రాయణగుట్ట: ఒకప్పుడు ఇక్కడ ఒక బ్రహ్మాండమైన చెన్నకేశవ స్వామి ఆలయం ఉండేది. దీంతో ఈ ప్రాంతాన్ని చెన్నారాయుడి గుట్ట అని పిలిచేవారు. కాలక్రమంలో ఇదే చాంద్రాయణ గుట్ట అయింది.

చిలకల గూడ: వందల ఏళ్లనాడు.. నగరం వేలాది దట్టమైన వృక్షాలతో ఉండేదట. ఆ సమయంలో సాయంత్రం కాగానే.. అక్కడి మార్కెట్లోకి వేలాది చిలకల గుంపులు వచ్చి, పండ్లు తినేవట. దీంతో దీనికి ఆ పేరు స్థిరపడిపోయింది.

మంగళ్ హాట్: దీని అసలు పేరు మంగళ్‌ హత్! మంగళ్ అంటే మంగళవారం అని అర్థం. హత్ అంటే సంత. ఈ ప్రాంతంలోని పెద్ద ఖాళీ మైదానంలో ఒకప్పుడు పెద్ద సంత జరిగేదట. దీంతో ఆ పేరు స్థిరపడిపోయింది.

తార్నాక అసలు పేరు తార్.. నాకా! తార్ అంటే ముళ్లకంచె. నాకా అంటే పోలీస్ అవుట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో ఓ తోట ఉండేది. దానికి అతడు చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేశాడు. దీంతో దానికి ఆ పేరే స్థిరపడిపోయింది.

కాచీగూడ: నిజాం పాలనలో ‘కచ్’ అనే తెగ వాసులు నివసించిన కారణంగా.. కాచీగూడ అనే పేరు వచ్చింది.

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×