E-Paper
Advertisement

Mallikarjun kharge : మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే.. కాంగ్రెస్ పేదల పక్షం : ఖర్గే

Mallikarjun kharge : మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే.. కాంగ్రెస్ పేదల పక్షం : ఖర్గే
Advertisement

Mallikarjun kharge : తెలంగాణకు ఈ ఎన్నికలు చాలా ముఖ్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అలంపూర్‌, నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభల్లో బీజేపీ, బీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించారు. బీజేపీకి భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ స్ఫూర్తితో పేదల కోసం పనిచేస్తూనే ఉంటామన్నారు. పేదల హక్కుల కోసం పోరాతామని తేల్చిచెప్పారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై ఖర్గే విమర్శలు చేశారు. ఆయన ఎప్పుడూ ప్రజలను కలవలేదన్నారు. ఇలాంటి నాయకుడికి ప్రజలు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరా గాంధీని తిట్టే స్థాయి కేసీఆర్‌ లేదన్నారు.పేదరిక నిర్మూలన కోసం ఇందిరమ్మ ఏం చేయలేదన్న కేసీఆర్‌ వ్యాఖ్యలను ఖండించారు. మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటేనన్నారు. ఈ ఇద్దరు నేతలకు పేదల కష్టాలు పట్టవని మండిపడ్డారు.

Advertisement

కాంగ్రెస్ పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధిని ఖర్గే వివరించారు. కాంగ్రెస్ చేపట్టిన హరిత విప్లవం వల్లే దేశంలో ఆహార కొరత తీరిందన్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మించకుంటే తెలంగాణ ఎలా ఉండేది? అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చింది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. రైతులు, దళితులు, నిరుపేదలకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యమని పేర్కొన్నారు. హరిత, శ్వేత విప్లవం వచ్చినప్పుడు కేసీఆర్‌ ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.

తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని ఖర్గే ఆరోపించారు. భూమి, ఇసుక, మద్యం కుంభకోణాల్లో కేసీఆర్‌ కుటుంబం ఉందన్నారు. కాంగ్రెస్‌ పై మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని.. నెహ్రూ స్థాపించిన నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికపై కుట్ర చేశారని ఆరోపించారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×