Kejriwal Resign: కేజ్రీవాల్.. 2011లో ఇండియా ఆగ్నెస్ట్ కరప్షన్ ఉద్యమంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు అదే కరప్షన్ ఆరోపణలతో పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి. కేజ్రీవాల్‌కు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ముందుగా మనం ఆయన పొలిటికల్ కేరీర్‌ను ఒకసారి చేసుకుందాం. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్.. డిసెంబర్ 28, 2013లో ఢిల్లీ సీఎంగా మొదటిసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 2020లో మళ్లీ రెండోసారి కేజ్రీవాల్ సీఎం బాధ్యతలు చేపట్టారు. కేజ్రీవాల్ తొలి టర్మ్ అంతా సాఫీగానే జరిగింది. రెండో టర్మ్ నుంచే అసలు సిసలు మ్యాచ్‌లను మనం చూస్తున్నాం. ఇక రీసెంట్ గాబెయిల్‌పై జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ ఆల్‌ఆఫ్ సడెన్‌గా తన సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇంతకీ కేజ్రీవాల్ క్రేజీ ప్లాన్స్ ఏంటి?
విధి ఎంత విచిత్రమైంది అంటే.. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వ్యక్తికి అవే అవినీతి మరకలు అంటుకున్నాయి. ఇదే ఆయన క్రెడిబులిటిని దెబ్బకొట్టింది. ఆయన మళ్లీ జీరో నుంచి రావాల్సి ఉంది. అందుకు కేజ్రీవాల్ ఎంచుకున్న అస్త్రమే రాజీనామా. వాస్తవానికి కేజ్రీవాల్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం.. లేదా సీఎం పదవికి రాజీనామా చేసి మరొకరిని ఆ కుర్చీపై కూర్చోబెట్టడం. ఢిల్లీ ప్రభుత్వ కాలపరిమితి 2025 ఫిబ్రవరి వరకు ఉంది. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి నవంబర్ లో మహారాష్ట్ర, జార్ఖండ్ తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు. ఒకవేళ ఎన్నికల సంఘం ఆ రాష్ట్రాలతో కలిసి ఎన్నికలు నిర్వహించకపోతే అప్పటివరకు మరొకరు సీఎంగా ఉంటారు. తనపై వచ్చిన అవినీతి మరకలను వదిలించుకోవాలని కేజ్రీవాల్ తెగ ప్రయత్నం చేస్తున్నారు. అందులోభాగంగానే ఈ స్టంట్స్ అని మేథావులు చెబుతున్నారు. సీఎం పదవికి రాజీనామా చేయడం వల్ల కేజ్రీవాల్ కు కొన్ని ప్లస్ లు అయితే ఉండనున్నాయి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: సీఎం పదవికి రాజీనామా – అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
ముందుగా మనం శీష్‌మహల్ గురించి మాట్లాడుకోవాలి. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత కేజ్రీవాల్ తన అధికారిక నివాసం శీష్ మహల్ ఖాళీ చేయాలి. ఆ ఇంటిపైనే ఇప్పుడో పెద్ద వివాదం నడుస్తోంది. ఆ ఇంటిలో సీఎం కేజ్రీవాల్ 45 కోట్లతో రెనోవేషన్ పనులు చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఖరీదైన ఫర్నీచర్ ను ఏర్పాటుచేసుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ ఇష్యూలో ఇప్పటికే ఎంక్వైరీ నడుస్తోంది. ముగ్గురు ఇంజినీర్లు ఇదే కేసులో సస్పెండ్ కూడా అయ్యారు. సీఎం పదవికి రాజీనామాతో ఈ ఇంటిని సీఎం వదులుకుంటారు.
సుప్రీంకోర్టు బెయిల్ సందర్భంగా కేజ్రీవాల్కు కొన్ని ఆంక్షలు విధించింది. అందులో ఒకటి సచివాలయానికి వెళ్లొద్దు, ఫైల్స్ పై స్వతహాగా సంతకాలు చేయరాదు. కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పటికీ తన ఆఫీస్‌కు, కనీసం సచివాలయం కూడా వెళ్లడానికి వీల్లేదు. ఫైల్స్‌పై స్వతహాగా సంతకాలు చేయడానికి లేదు. ఫైల్స్ లెఫ్టినెంట్ గవర్నర్ అప్రూవల్ తర్వాతే కేజ్రీవాల్ సంతకం చేయాల్సి ఉంటుంది. అంటే పేరుకే సీఎం.. కానీ ఏం చేయలేని పరిస్థితి కేజ్రీవాల్‌ది. ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిట్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టానికి సవరణలు చేశారు. దాంతో లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్ని విశేష అధికారాలు ఇచ్చినట్లైంది. తాను తప్పుకోవాలి అనుకోవడానికి ఇవన్నీ కూడా కారణాలే.
కేజ్రీవాల్ ఎపిసోడ్ పై అన్నా హజారే స్పందించారు. రాజకీయాలు వద్దని తాను మొదటి నుంచి చెబుతున్నట్టు చెప్పారు. కానీ తన మాట వినకుండా పాలిటిక్స్ లో వెళ్లాడన్నారు. ఇప్పుడు ఆ నిజాయితీ తన గుండెల్లో ఉందో లేదో తనకు ఎలా తెలుస్తుందన్నారు.
సిసోడియాతో సహా కేజ్రీవాల్ ప్రభుత్వంలో లేకపోతే పార్టీని మరింత స్ట్రెంతెన్ చేయడానికి వీలుంటుంది. ఇదే స్కెచ్ తో ఆప్ నేతలు ముందుకుపోతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మరో పాయింట్ కూడా హైలెట్ అవుతోంది. అదే హర్యానా ఎలక్షన్. బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా అసెంబ్లీకి మరికొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా కేజ్రీవాల్ పనిచేయనున్నట్టు తెలుస్తోంది. హర్యానాలో ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగింది. పట్టణ ఓటర్లపై ఆప్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందట. అందుకే కేజ్రీవాల్ ఈ రెండు మూడు నెలల సీఎం పదవిని వదులుకోని గ్రౌండ్‌లోకి దిగాలని చూస్తున్నారు.