BigTV English

Arvind Kejriwal: సీఎం పదవికి రాజీనామా – అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన

Arvind Kejriwal: సీఎం పదవికి రాజీనామా – అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 13న బెయిల్ పై తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఈ కేసులో తనని తాను నిర్దోషిగా నిరూపించుకునేంతవరకూ సీఎం పదవిలో ఉండబోనని తెలిపారు. రెండ్రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడంతో.. ఒక్కసారిగా ఢిల్లీ రాజకీయం మారింది. ఆదివారం ఢిల్లిలో ఉన్న ఆప్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఈ ప్రకటన చేశారు.


సీఎం పదవికి తాను రాజీనామా చేశాక.. నవంబర్ లో మహారాష్ట్రతో పాటు.. ఢిల్లీలో కూడా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుకునేందుకు అగ్నిపరీక్షకు సైతం సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించినపుడు తన భవిష్యత్ ఏంటో ఓటర్లే నిర్ణయిస్తారని చెప్పారు. మళ్లీ ప్రజల మధ్యలోకి వెళ్తానని, ప్రతి వీధికి, ప్రతి ఇంటికి తిరుగుతానని, తాను నిర్దోషిని అనుకుంటే ప్రజలు ఓట్లు వేస్తారన్నారు.

Also Read: ‘ముఖ్యమంత్రి ఆఫీసులో అడుగుపెట్టకూడదు’.. కేజ్రీవాల్ బెయిల్‌కు సుప్రీం షరతులివే!


ఆమ్ ఆద్మీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ దేవుడే తమను ముందుకు నడిపించాడన్నారు. దైవమిచ్చిన ధైర్యంతోనే శత్రువులతో పోరాడుతామని తెలిపారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆప్ నేతలు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ త్వరలోనే బయటకు వస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఆరునెలల తర్వాత జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్.. తాజాగా రాజీనామాపై ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఇచ్చిన 9 సమన్లకు కేజ్రీవాల్ స్పందించకపోవడంతో.. ఈ ఏడాది మార్చి 21న అరెస్టయ్యారు. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మధ్యంతర బెయిల్ పొందిన ఆయన.. జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయారు. అనంతరం ఆరోగ్య సమస్యల దృష్ట్యా మరోసారి బెయిల్ పొందారు. రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసినా.. ఢిల్లీ హైకోర్టు దానిపై స్టే విధించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లగా.. వాయిదాలపై వాయిదాలు పడి.. సెప్టెంబర్ 13న బెయిల్ మంజూరైంది.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×