BigTV English
Advertisement

Singer Chinmayi : మైనర్ పై జానీ మాస్టర్ అత్యాచారం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన చిన్మయి..!

Singer Chinmayi : మైనర్ పై జానీ మాస్టర్ అత్యాచారం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన చిన్మయి..!

Singer Chinmayi.. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi sripada) ఒక ఫెమినిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోనే కాదు సమాజంలో అమ్మాయిలకు ,చిన్న పిల్లలకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురయ్యాయి అంటే వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. వాటిని ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈమధ్య కాలంలో ఆడవారిపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో బాధితులు ఒక్కొక్కరిగా తమ బాధను చెప్పుకుంటున్న నేపథ్యంలో వారికి అండగా నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా గతంలో కోలీవుడ్ సినిమా పరిశ్రమలో సెలబ్రిటీలపై లైంగిక ఆరోపణలు చేసిన ఈమె రచయిత వైరముత్తు, సింగర్ కార్తీక్ పై కూడా వేధింపుల ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ (Johnny master) పై అత్యాచార ఆరోపణలు వెలుగులోకి రావడంతో బాధిత యువతకి అండగా నిలుస్తూ ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎక్స్ ద్వారా పోస్ట్ చేసింది.


మైనర్ బాలికపై జానీ మాస్టర్ అత్యాచారం – చిన్మయి..

అసలు విషయంలోకి వెళ్తే, జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సింగర్ చిన్మయి శ్రీపాద ఈ విధంగా స్పందించారు. పలు మీడియా కథనాలను ఆమె టాగ్ చేస్తూ.. రిపోర్ట్ల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడు. అత్యాచారం చేయడం ఒక ఎత్తైతే, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడడం మరో పెద్ద నేరం. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి మరింత శక్తి చేకూరాలని నేను కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసింది చిన్మయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

Singer Chinmayi: Johnny Master raped a minor.. Chinmay revealed the shocking truth..!
Singer Chinmayi: Johnny Master raped a minor.. Chinmay revealed the shocking truth..!

మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి పాల్పడ్డ జానీ మాస్టర్..

ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న జానీ మాస్టర్.. 2017లో ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమైన డాన్స్ షోలో ఒక అమ్మాయితో పరిచయం పెంచుకొని, ఆ అమ్మాయిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయించగా.. అందులో తన వయసు 21 సంవత్సరాలు మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తే.. జానీ మాస్టర్ తో యువతికి పరిచయం ఏర్పడినప్పుడు.. ఆ యువతి వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. అయితే అప్పుడు ఆమె ఇంకా మైనర్.. అలాంటి బాలిక పై జానీ మాస్టర్ అత్యాచారం చేసినట్లు వార్తలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి.


లైంగికంగా హింసించాడు..

షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేసిన హోటల్లో జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పకూడదని తనను బెదిరించాడని, ఎవరికైనా చెబితే అవకాశాలు లేకుండా చేస్తానని హెచ్చరించాడు అంటూ ఆమె తన బాధను చెప్పుకుంది. ఇక తాజాగా ఈ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తరలించగా పోలీసులు కేసు విచారణ చేపట్టారు. అత్యాచారం, దౌర్జన్యం, దాడి, బెదిరింపులు ఇలా పలు సెక్షన్ల కింద జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు. ఇక ప్రస్తుతం ఈమె వయసు 21 యేళ్లు.. జానీ మాస్టర్ అత్యాచారం చేసినప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు.. దీన్ని దృష్టిలో పెట్టుకొని మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణలు చేసింది చిన్మయి. మరి చిన్మయి చెప్పిన విషయాన్ని పోలీసులు దృష్టిలో పెట్టుకొని జానీ మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×