మన నాయకులకు రాజకీయాలే ప్రయార్టీ. ఆ రాజకీయాల కోసం ఏమైనా చేస్తారు మన తెలుగు నేతలు. జనం ఏమనుకుంటున్నారో కూడా డోంట్ కేర్. ఆ పనులన్నీ మేమే చేశాం.. మా వల్లే ఇదంతా..! మాదే ఈ క్రెడిట్.. అంటు బాకా ఊదుకోవడం మనకు బాగా అలవాటు.
ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు తరుచూ వినిపిస్తున్న పదం క్రెడిట్ చోరీ. మామూలుగా ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటివి కామన్‌గా తెరపైకి వస్తాయి. కానీ ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రెడిట్ రచ్చ ఎక్కువైంది. ఇప్పుడు ఈ గోలంతా ఎందుకంటే.. క్రిడిట్ విషయంలో కేరళం లో రాజకీయాలు మనకంటే ఎంత హైట్‌లో ఉన్నాయో.. వారి ఆలోచనలు ఎంత విశాలంగా ఉన్నాయో ఇది చదివితే తెలుస్తుంది.
అక్కడ జరిగిన ఉదంతాన్ని.. మన వాళ్లు అదో గుణపాఠంగా తీసుకుంటారని మనం అనుకోవడం ఓ పెద్ద భ్రమ. కానీ చెప్పడం మన బాధ్యత కదా? అందుకే ఈ క్రెడిట్‌ను దక్కించుకునే క్రమంలోనే అక్కడా, ఇక్కడా క్రెడిట్ చోరీ కథలు ఎలా ఉన్నాయని చెప్పడంతో పాటు .. నేతలంగా మన తెలుగు నేతల్లాగే ఉండరనే విషయాన్ని ఓసారి గుర్తు చేస్తూ.. జనం దిల్ చోరీ చేసే నేతలూ ఉంటారని జనానికి చేరవేసే ప్రయత్నంలో భాగమన్నమాట ఇదంతా. మరీ సోది ఎక్కువైందా? అయినా సరే, చదవండి. విషయం చిన్నదే. సందేశమే పెద్దది.
కేరళం రాష్ట్రంలోని పూంజార్ నియోజకవర్గంలో ఇటీవల ఓ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే ఎంజే సెబాస్టియన్‌ను పిలిచారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే రావడం, ప్రారంభించడం.. ఆ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశాన్నుద్దేశించి.. సర్కార్ గొప్పలు చెప్పడం సహజం. అది ఎక్కడైనా జరుగుతంది. కానీ ఇక్కడ సీన్ రివర్సయ్యింది.
సెబాస్టిషన్ ఆశ్చర్యంగా ముఖం పెట్టి.. ఆ బ్రిడ్జి నిర్మాణం, దానికి కావల్సిన నిధులు తెచ్చి పూర్తి చేసిందంతా మాజీ ఎమ్మెల్యే కదా! మరి అతని చేతుల మీదుగానే దీన్ని ప్రారంభిచండమే సరైన పని అన్నారట. దీనికి అధికారులు నోరెళ్లబెట్టారట. ఇలా ఎప్పుడూ ఉండదే.. వచ్చిందే అవకాశం.. ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకే నాయకులు ఉత్సాహం చూపుతారు కదా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారట.
ఆ ఎమ్మెల్యేనే స్వయంగా ఆ ప్రారంభ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేను ఆహ్వానించి, సన్మానించి ఆ ఘతనను ఆయనకే దక్కేలా చేశారు. ఇది చూసిన కేరళం జనం.. శభాష్ సెబాస్టియన్ అని ప్రసంశలతో ముంచెత్తారట.
ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నేతల క్రెడిట్ చోరీ రచ్చ విషయానికొద్దాం. ఆ ప్రభుత్వం కట్టి మధ్యలో వదిలేసిన బ్రిడ్జిలను మేమే కట్టామని బాజాప్తా చెప్పుకుంటుంది ఇప్పుడున్న సర్కార్. ఆ ఆస్పిటల్ సగానికి పైగా మేమే చేశాం కదా..? అని అంటే .. పూర్తి చేసింది మేము.. మీకు చేతనైతే అప్పుడే ఎందుకు కంప్లీట్ చేయలేదని క్రెడిట్ చోరీ విషయంలో ఏమాత్రం తగ్గని సర్కార్ ఇక్కడ.
ఆ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేసి ప్రారంభించిందే మా నాయకుడు.. ఆ విమానాశ్రయానికి నాంది పలికిందే మేము.. మీరిప్పుడు దాన్ని ఏదో మేమే మొత్తం చేశామనే బిల్డప్పేలా? అని ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. క్రెడిట్ చోరీ అని ఆరోపిస్తుంది. దాన్ని అధికార పక్షం.. మేము తలుచుకుంటేనే అది ముందు పడింది..ముగింపుకొచ్చింది. లేకపోతే అయ్యోదా.. పొయ్యేదా? ఆ క్రెడిటంతా మాదేనని తమ ఖాతాలో వేసేసుకుంటారు.
ఈ క్రెడిట్ చోరీ రాజకీయాలపై రచ్చ నడుస్తూనే ఉంటుంది. ఒకటి సద్దుమణిగిందో లేదో.. మరో క్రెడిట్ చోరీ అంటూ కొత్త కథ తెరపైకి వస్తోంది. అది మాదేననని వారంటారు. కాదు కాదు… మేమే పూర్తి చేశామని వీరంటారు. కేరళం మాదిరిగా క్రెడిట్‌నుప్రతిపక్షానికి ఇచ్చేంత విశాల హృదయం మన నేతలకు ఉందనుకుంటున్నారా? క్రెడిట్ అటుంచండి.. కనీసం వారి పేరును కూడా తీసుకునే సీన్ లేదు.
పైగా అదే వేదికగా చెడామడా తిట్టే రాజకీయానికే మొగ్గు చూపుతారు తప్ప.. ఒప్పుకోను గాక ఒప్పుకోరు. జనానికి నిజనిజాలు తెలిసినా.