E-Paper
Advertisement

Madanapalle: మదనపల్లి జిల్లా క్రెడిట్ ఎవరిది? స్పందించని టీడీపీ నేతలు

Madanapalle: మదనపల్లి జిల్లా క్రెడిట్ ఎవరిది? స్పందించని టీడీపీ నేతలు
Advertisement

Madanapalle:  దశబ్ధాల కల నెర వేరవేర్చారు.. ఆ క్రెడిట్ ను తమదే అని చెప్పు కోవడంలో మాత్రం విఫలం అయ్యారు కూటమి నేతలు.. ప్రజలలో తమ వల్ల దశాబ్దాల కల అయిన జిల్లా వచ్చిందని చెప్పుకోవడం లో విఫలం కావడంతో పాటు తూతూ మంత్రంగా చేసిన సంబరాలలో సైతం గ్రూపులు వారీగా విడిపోయి తమలో గొడవలు ఉన్నాయని చెప్పకనే చెప్పారు .. మొత్తం మీదా మదనపల్లి జిల్లా కేంద్రం గా నూతన జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటనను నీరుగార్చే విధంగా నియోజకవర్గంలో మొత్తం వ్యవహారం నడుస్తుందని అంటున్నారు.. కారణం చేసిన పని చెప్పుకోవడంలో స్థానిక కూటమి నేతల వైఫల్యమే అంటున్నారు మదనపల్లి కూటమి కార్యకర్తలు..

స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మదనపల్లి

మదనపల్లి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన నేల.. ఇక్కడ అనిబిసెంట్ హోంరూల్ ఉద్యమానికి బీజం వేయడమే కాకుండా థియోసోపికల్ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు.. అత్యంత ప్రతిష్టాత్మకమైన బీటీ కాలేజి ఏర్పాటు చేసారు. ఇదే కాలేజ్ లోనే మన జాతీయ గీతం అనువాదం చేశారు. దానికితోడు బ్రిటిష్ వారు ఇక్కడ నుంచి పాలన కొనసాగించారు. సమీపంలోని హార్శీలీ హిల్స్ ను తమ వసతి ప్రాంతంగా ఏర్పాటు చేసుకున్నారు..అంతేకాక దేశంలో మదనపల్లి అతి పెద్ద రెవెన్యూ డివిజన్ గా కూడా కొనసాగింది. మదనపల్లిలో పరిపాలనకు అవసరమైన అన్ని కార్యాలయాలు ఉన్నాయి. విశాలమైన సబ్ కలెక్టర్ కార్యాలయం, విశాలమైన డీఏస్పీ కార్యాలయం, జైలుతో పాటు న్యాయస్థానాలు, పోలీసుల స్టేషన్లు ఉన్నాయి.

మదనపల్లిలో ఇరిగేషన్, ట్రెజరీ కార్యాలయాలు

Advertisement

మదనపల్లిలో ఇరిగేషన్, ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. దీనికితోడు రైల్వేస్టేషన్ , నాలుగు వరసల జాతీయ రహాదారి ఉంది..రెండు బస్ డిపోలు ఉన్నాయి .బెంగుళూరులోని దేవనహాల్లి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడ నుంచి కేవలం గంటన్నర ప్రయాణం మాత్రమే.. .అయితే ఇలాంటి మదనపల్లిని జిల్లా కేంద్రంగా గతంలో ఏర్పాటు చేయకుండా వైసీపీ నేతలు రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసారు..దీంతో అప్పట్లో మదనపల్లి జిల్లా సాదన సమితి పేరుతో పెద్ద ఎత్తున అందోళనలు నిర్వహించారు. నెలల తరబడి అందోళనలు జరిగాయి. ఆ క్రమంలో అప్పటి ప్రతిపక్షనేత ప్రస్తుత సియం చంద్రబాబు నాయుడు మదనపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మదనపల్లిని జిల్లాగా చేస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో నారాలోకేష్ సైతం ఇదే హామీని ఇచ్చారు. తర్వాత తమ హామీని నెరవేర్చారు..కాని హామీ నెర వేర్చినప్పటికి ప్రజలలోకి ఎందుకు స్థానిక నేతలు తీసుకుపోలేకపోతున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది..

కూటమి ప్రభుత్వంలో మదనపల్లి జిల్లా కేంద్రంగా నాలుగు నియోజకవర్గాలతో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. మదనపల్లి, తంబల్లపల్లి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలను కలపి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసారు. ఇందులో నూతనంగా పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసారు. పుంగనూరు నియోజకవర్గంలోని అరుమండలాలలో గతంలో నాలుగు పలమనేరు,రెండు చిత్తూరులో ఉండేవి.. వాటిలో పుంగనూరు, పుంగనూరు రూరల్, సోమల, సదుము,చౌడేపల్లి, రొంపిచెర్ల మండలాలలను పీలేరు రెవెన్యూ డివిజన్ లో కలిపారు..పులిచెర్లను మాత్రం చిత్తూరు రెవెన్యూ డివిజన్ లో ఉంచారు.. పుంగనూరును చిత్తూరు జిల్లా నుంచి మదనపల్లిలో కలిపారు.. మొత్తం మీదా 11.05లక్షల జనాభాతో 21 మండలాలు కలిపి జిల్లాను ఏర్పాటు చేసారు..

టీడీపీ మాజీ ఎమ్మెల్యే రమేష్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన

Advertisement

జిల్లా సాదన సమితి పేరుతో అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న ప్రస్తుత ప్రస్తుత టిడిపి ఎంఎల్ ఎ షాజహాన్ భాషాతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ నాయకత్వంలో పెద్ద ఎత్తున అందోళనలు జరిగాయి.. జనసేన నేత రాందాస్ , తెలుగు యువత రాష్ట అద్యక్షుడు అయిన శ్రీరామ్ చినబాబుతో పాటు బీఎస్‌పీ నేతలు , పీలేరు ,తంబల్లపల్లి, పుంగనూరు నేతలు సమిష్టంగా సభలు, సమావేశాలు, అందోళనలు నిర్వహించారు..అయితే తర్వాత ఎన్నికలలో గ్రూపులుగా విడిపోయారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన షాజహాన్ భాషా కు టికెట్ రావడంతో కూటమి నేతలు మెజార్టీ నాయకులు టిటిడి ఉపులో భాషా విజయం సాదించారు..తర్వాత అప్పటి నుంచి మదనపల్లిలో గ్రూపులుగా ఉండిపోయారు.. ఇక మంత్రి పదవి రాకపోవడంతో తన నియోజకవర్గం సహా మిగతా పాలిటిక్స్ దూరంగా ఉండి పోయారు పీలేరు ఎంఎల్ ఎ నల్లారి కిషోర్ కూమార్ రెడ్డి.ఇలాంటి స్థితిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు జనసేన, టిడిపి, బిజెపి నేతలు మదనపల్లిలో ఉండి పోయారు..

జిల్లా ఏర్పాటైనా స్పందించని టీడీపీ నేతలు

కాని జిల్లా ప్రకటన తర్వాత అందరు ఏకతాటిపైకి వచ్చి సంబరాలు చేస్తారని క్యాడర్ అశించింది. దీనికితోడు పార్టీ నుంచి స్ఫష్టమైన సందేశం కూడా వచ్చింది.. అయితే వాటిని పట్టించికోని నేతలు ఎవ్వరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండి పోయారు. సీనియర్ నాయకుడు మాజీ ఎంఎల్ ఎ రమేశ్ నుంచి కనీసం స్పందన కూడా రాలేదని తెలుస్తోంది.. మరో వైపు తెలుగు యువత రాష్ట అధ్యక్షుడు అయిన శ్రీరాం చినబాబు రెండు రోజుల క్రితం ఓ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్‌కు పాలాభిషేకం నిర్వహించి మమ అనిపించారు. తర్వాత తీరిగ్గా విజయ వాడ నుంచి వచ్చి తాజాగా కాశీరావు పేట నుంచి ఓ ర్యాలీ నిర్వహించి బెంగుళూరు బస్టాండ్ సమీపంలో చిన్న విజయోత్సవ సభ నిర్వహించారు.

అంతే తప్ప జిల్లా మంత్రులు, ఇన్చార్జులు అయిన పార్టీ కోఅర్డినేటర్లతో సమావేశం భారీగా పెట్టాలని పార్టీ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.. దానికితోడు మదనపల్లిలో ప్రతి ఇంటికి జిల్లా కేంద్రం తామే తెచ్చామనే సమాచారం పంచాలని కరపత్రాలు పంచమని కూడా పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందంట.. అయితే దాని ఖర్చు ఎవ్వరు పెట్టుకుంటారనే రీతిలో స్థానిక నేతలు సమాధానం ఇచ్చారంట..ప్రతి విషయంలో కూడా కూటమి లోని లుకలుకలు బయటపడుతున్నాయి.. తాజాగా జరిగిన మార్కెట్ యార్డు పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో సైతం ఇదే బయటపడింది.. టిడిపి సభ్యులు తమ ఫోటో వేయ్యలేదని దూరంగా ఉన్నారంట..చివరకు ఎంఎల్ ఎ వారిని సమాధాన పర్చి తీసుకు వచ్చారంట.. మదనపల్లి వాసుల దశాబ్ధల కల నెరవేర్చినా దానిని తమ ఖాతాలో వేసుకోవడంలో కూటమి నేతల వైఫల్యం అడుగడుగునా కనిపిస్తుందని క్యాడర్ వాపోతుంది.. ఇప్పటికి మదనపల్లి ని సియం సెట్ చేయాలని క్యాడర్ కొరుకుంటుంది.

Story by Apparao, Big Tv

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×