Central Cabinet Decisions: ఈ-మొబిలిటీ, రోడ్స్, హెల్త్ కవర్.. ఇలా అనేక సంక్షేమం, అభివృద్ధిపై కేంద్రం ఖర్చు చేయబోయే మొత్తం. సెంట్రల్ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు కేంద్రం ఇప్పుడు ఇంత మొత్తాన్ని ఖర్చు చేయనుంది. ఇంతకీ ఇంత భారీగా నిధులను ఏయే కార్యక్రమాలకు వినియోగించనుంది? నిజంగా ఆ కార్యక్రమాలు అమల్లోకి వస్తే వచ్చే మార్పులేంటి?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ కీలక నిర్ణయాలు ఏంటో తెలుసా? ఆ నిర్ణయాలు ఎందుకంత కీలకమయ్యాయో తెలుసా? రోడ్లు, హైడ్రో పవర్, ఎలక్ట్రిక్ మొబిలిటి, హెల్త్, వెదర్.. వీటన్నింటికీ సంబంధించి నిర్ణయాలు తీసుకుంది సెంట్రల్ కేబినెట్. రూ.70 వేల 125 కోట్లతో గ్రామీణ రోడ్లు, రూ.3 వేల 437 కోట్లతో 70 ఏళ్లు దాటిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్, రూ.12 వేల 461 కోట్లతో హైడ్రో పవర్, రూ.10 వేల 900 కోట్లతో ఈ-మొబిలిటీ సబ్సిడీలు, రూ.3 వేల 435 కోట్లతో ఇ-బస్సు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్స్, రూ.2 వేల కోట్లతో మిషన్ మోసమ్.. ఇలా అనేక కార్యక్రమాలకు అటు ఇటుగా లక్ష కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తూ డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యింది.
నిజానికి లక్ష కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఇందులో అత్యంత ముఖ్యమైనది 70 ఏళ్లకు పైబడిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం. ఈ నిర్ణయంతో లబ్ధి పొందే కుటుంబాల సంఖ్య నాలుగున్నర కోట్లుగా ఉంటుందని అంచనా. మొత్తం 6 కోట్ల మందికి ఈ స్కీమ్ ద్వారా లబ్ది దక్కనుంది. వీరందరికి రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కింది. ఈ పథకానికి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ యోజన అని నామకరణం చేశారు. ఈ స్కీమ్ కోసం 3 వేల 437 కోట్లు ఖర్చు చేయనుంది కేంద్రం.
Also Read: మీటింగ్ కోసం 2 గంటలు ఎదురుచూపులు.. సీఎంగా రాజీనామాకు రెడీ
తర్వాత రోడ్లు.. అదీకూడా గ్రామీణ ప్రాంతాల్లో సరైన కనెక్టివిటీని మెరుగు పర్చాలని డిసైడ్ అయ్యింది. దేశవ్యాప్తంగా 62 వేల 500 కిలోమీటర్ల మేర రోడ్లు వేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం 70 వేల 125 కోట్లు ఖర్చు చేయనుంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలలో ఇదే అతి పెద్దది. వచ్చే ఐదేళ్లలో ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. దేశంలో ఇప్పటికీ కూడా కనెక్టివిటీ లేని 25 వేల ప్రాంతాలకు ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీని కల్పించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ రోడ్లు ఆ ప్రాంతాల సోషియో ఎకనమిక్ డెవలప్‌మెంట్‌లో కీ రోల్ ప్లే చేస్తాయి. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఈ రోడ్లు వేసేందుకు 70 శాతం నిధులు కేంద్రం ఇస్తుండగా.. 30 శాతం మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించుకోవాల్సి ఉంటుంది.
నెక్ట్స్.. రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచేందుకు కేంద్రం నడుం బిగించింది. దీని కోసం ఏకంగా 12 వేల 461 కోట్లను కేటాయించింది. ఈ నిధులను జలవిద్యుత్ ప్రాజెక్టులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం.. అంటే.. రోడ్స్, బ్రిడ్జెస్, ట్రాన్స్‌మిషన్ లైన్స్, రోప్ వేస్, రైల్వే బ్రిడ్జిలు, ఇలా అవసరమైన వాటి నిర్మాణానికి ఈ నిధులను ఖర్చు చేస్తారు. వీటి వల్ల 31.35 గిగా వాట్ విద్యుత్ అదనంగా ఉత్పత్తి చేయాలనేది టార్గెట్. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఏకంగా 200 కోట్ల వరకు నిధులు అందనున్నాయి. దీనికి తోడు ఒక్కో మెగా వాట్ ఉత్పత్తికి 75 లక్షల వరకు నిధులు అందుతాయి. అంతేకాదు 2030 వరకు 500 గిగావాట్ నాన్ ఫాసిల్ పవర్ జనరేషన్ కెపాసిటీని రీచ్ అవ్వాలని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ ఇది అంత ఈజీ కాదనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం మన ఇండియాలో హైడ్రో ఎలక్ట్రీక్ పవర్ కేపాసిటీ 47 గిగా వాట్స్ మాత్రమే.. మరో 15 గిగావాట్స్ కేపాసిటీ అండర్ కన్‌స్ట్రక్షన్స్‌లో ఉంది.
ఇక ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను పెంచేందుకు ఏకంగా 10 వేల 900 కోట్లను ఖర్చు చేయబోతుంది. PM E-Drive పేరుతో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వనున్నారు. టూ, త్రీ వీలర్స్, బస్సు, ట్రక్స్‌తో పాటు హైబ్రీడ్ అంబులెన్స్‌ల కొనుగోలులో సబ్సిడీ ఇవ్వనున్నాయి. అయితే ఫోర్ వీలర్స్‌కు మాత్రం ఎలాంటి సబ్సిడీ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది.
సెంట్రల్ కేబినెట్ తీసుకున్న మరో నిర్ణయం మిషన్ మౌసమ్. వాతావరణ అంచనాల్లో ఖచ్చితత్వాన్ని మెరుగు పర్చడంతో పాటు.. క్లైమెట్ చేంజ్ ఇంపాక్ట్స్‌ను స్టడీ చేయడానికి రూ.2 వేల కోట్లను ఖర్చు చేయనున్నారు. నిజానికి ఈ నిర్ణయాలన్నీ చాలా మంచివే. ప్రజలకు డైరెక్ట్‌గా కొన్ని, ఇన్‌డైరెక్ట్‌గా మరికొన్ని ఉపయోగపడతాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ కీలక నిర్ణయాలను ప్రకటించింది కేంద్రం. అందుకే కాస్త కాంట్రవర్సీ ఉన్నా.. ఈ నిర్ణయాలన్నీ రాజకీయాలకి అతీతంగా ఆచరణలోకి రావాలని ఆశిద్దాం.