Infinix Hot 50i Launching Soon: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ అందరి దృష్టి తన వైపుకు తిప్పుకుంటుంది. వరల్డ్ వైడ్‌గానే కాకుండా దేశీయ మార్కెట్‌లో కూడా సత్తా చాటుతోంది. తరచూ అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ ఇతర బ్రాండ్‌లకు గట్టి పోటీనిస్తుంది. ఇప్పటికే ఎన్నో మోడళ్లను తీసుకొచ్చిన ఇన్‌ఫినిక్స్ త్వరలో మరొక కొత్త ఫోన్‌ను పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Infinix ఈ ఏడాది ప్రారంభంలో Hot 40iని పరిచయం చేసింది.
అయితే ఇప్పుడు కంపెనీ త్వరలో Hot 50iని ప్రారంభించాలని సన్నాహాలు చేస్తుంది. తాజాగా మార్కెటింగ్ ఇమేజ్ లీక్ నుండి ఈ స్మార్ట్‌ఫోన్ గురించి సమాచారం అందింది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా MediaTek Helio G81 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ టిప్‌స్టర్ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మార్కెటింగ్ పోస్టర్‌ను షేర్ చేసారు. దీని ప్రకారం.. ఇది డిస్‌ప్లేపై సెల్ఫీ కెమెరా కోసం హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. దీని వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రీన్, గ్రే అండ్ బ్లాక్ కలర్‌లలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: లీకైన గెలాక్సీ ఎస్25 అల్ట్రా రెండర్స్.. భయ్యా ఫీచర్స్ మామూలుగా లేవుగా!
Hot 50i స్మార్ట్‌ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇందులో 12 nm MediaTek Helio G81 ప్రాసెసర్‌గా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ 4 GB RAM + 256 GB స్టోరేజ్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఇది 300 శాతం అల్ట్రా వాల్యూమ్ ఫీచర్‌తో డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంటుంది. Hot 50i స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ వెనుక కెమెరా యూనిట్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని చెప్పబడింది.
ఇక ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించవచ్చని అంటున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 18 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని అంటున్నారు. అయితే దీని ముందు మోడల్ అయిన Infinix హాట్ 40i మోడల్‌లోని 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్‌ను కంపెనీ రూ. 8,999కి విడుదల చేసింది.
ఇక ఈ పాత ఫోన్ స్పెసిఫికేషన్‌లలో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే, Unisoc T606 చిప్‌సెట్, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలు, 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీ వంటివి ఉన్నాయి. ఇదిలా ఉంటే గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం ప్రథమార్థంలో దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్లు 60 శాతం పెరిగాయి.