BigTV English

Manchu: బాబూ.. మోహనా!.. కొడుకులు కొట్టుకుంటుంటే ఏం చేస్తున్నావు తండ్రీ!!

Manchu: బాబూ.. మోహనా!.. కొడుకులు కొట్టుకుంటుంటే ఏం చేస్తున్నావు తండ్రీ!!

Manchu: సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. మంచు ఫ్యామిలీ ట్రెండింగ్‌లో ఉంది. విష్ణు కొడుతున్న వీడియో ఫుల్‌గా వైరల్ అయింది. మనోజ్ ఆ వీడియోను డిలీట్ చేసినా.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. వేలల్లో డౌన్‌లోడ్స్. లక్షల్లో షేర్స్. మీడియాకైతే కొబ్బరిచిప్ప దొరికినట్టే. గంటల తరబడి నాన్‌స్టాప్ కవరేజ్. మంచు ఫ్యామిలీ గొడవ మినహా మరో న్యూసే లేదు.


మంచు ఫ్యామిలీలో గొడవంటే అయ్యో పాపం అనే వారికంటే.. ఎంజాయ్ చేసేవారి సంఖ్యే ఎక్కువ కనబడుతోంది. సోషల్ మీడియాకు, ట్రోలర్స్‌కి మంచు.. మంచి సరుకు. విష్ణునైతే తెగ ఆడేసుకుంటారు. మెగా ఫ్యాన్స్‌కి మంచు ఫ్యామిలీ ఓ ఆట వస్తువు. అలాంటి వారంతా ఇప్పుడు ట్రోల్స్‌తో, కామెంట్స్‌తో పండగ చేసుకుంటున్నారు. విష్ణుతో పోలిస్తే మనోజ్‌కు ఫ్యాన్స్ ఎక్కువ. మనోడు ఓపెన్‌గా ఉంటాడని.. ఉన్నదున్నట్టు మాట్లాడతాడని.. అవసరమైతే తండ్రినీ వ్యతిరేకిస్తాడనే పేరుంది. ‘మా’ ఎన్నికల సమయంలో మనోజ్ బిహేవియర్ ఆకట్టుకుంది. మెగా ఫ్యాన్స్‌లో చాలామంది మనోజ్‌కు సపోర్ట్‌ కూడా చేస్తుంటారు.

ఇక, మోహన్‌బాబుకు నోటి దురుసు చాలా ఎక్కువ. తరుచూ ఎవరోఒకరిని, ఏదోఒకటి గిల్లుతుంటారు. చిరంజీవితో టామ్ అండ్ జెర్రీలా ఉంటారు. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ ఇంటర్వ్యూల్లో చెబుతూనే.. ఛాన్స్ చిక్కినప్పుడల్లా మాటలతో కవ్విస్తుంటారు. టాలీవుడ్ వజ్రోత్సవ ఫంక్షన్‌లో చిరంజీవి టార్గెట్‌గా మోహన్‌బాబు చేసిన రచ్చ అంతాఇంతా కాదు. పవన్ కల్యాణ్ పూనకంతో ఊగిపోతూ.. డయాస్ మీదే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినా మంచు తీరు మారలేదు.


మోహన్‌బాబు అదో టైప్. ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారు. మా డాడీ అంటే మాకు భయం అంటూ విష్ణు, మనోజ్, లక్ష్మిలు అనేకసార్లు చెప్పారు. మంచు మోహన్ బాబు ఏ కార్యక్రమానికి వెళ్లినా, ఏ వేదికపై మాట్లాడినా తాను క్రమశిక్షణకు మారుపేరని ఎప్పుడూ అంటూ ఉంటారు. తన పిల్లలను అలాగే పెంచానని చెబుతూ ఉంటారు. అలాంటి కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. అంత స్ట్రిక్ట్‌గా ఉండే మోహన్‌బాబు.. మరి ఇద్దరు కొడుకులు ఇలా గొడవ పడే వరకూ పరిస్థితి దిగజారుతుంటే ఇన్నాళ్లూ ఏం చేసినట్టు? రెండేళ్లుగా అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయని అంటున్నారు.. తండ్రిగా మోహన్‌బాబు కొడుకులను కంట్రోల్ చేయలేకపోయారా? జనాలకు నీతులు చెప్పే పెదరాయుడు.. ఇంట్లోవాళ్లను అలా వదిలేశారేంటి? మోహన్‌బాబు సర్ది చెప్పలేదా? ఆయన చెప్పినా కొడుకులు వినలేదా? లక్ష్మి అక్క ఏం చేస్తున్నట్టు? కనీసం ఆమె అయినా కాంప్రమైజ్ చేయలేకపోయారా?

ఇటీవలే మనోజ్ పెళ్లి జరిగింది.. ఇష్టంలేకపోయినా విష్ణు అటెండ్ అయ్యారని అంటున్నారు. పెళ్లి టైమ్‌లోనైనా సయోధ్య కుదరలేదంటే.. వారిమధ్య వార్ పెద్ద స్థాయిలోనే జరుగుతోందని తెలుస్తోంది. మంచు విష్ణు.. మనోజ్ సహాయకుడి ఇంటికెళ్లి మరీ కొట్టారంటే.. ఎంత కోపం ఉండి ఉండాలి? ఇంత జరిగాకా.. విషయం మీడియాకు ఎక్కాక.. ఇక మంచు ఫ్యామిలీ కలిసి ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పటికే వేరు వేరుగా ఉంటున్న అన్నదమ్ములు.. ఇప్పుడిక శాశ్వతంగా దూరమవుతారా? వారి మధ్య దగ్గర కాలేనంత దూరం పెరిగిపోయిందా?

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×