BigTV English

panchathantram : పంచతంత్రం.. విభిన్నమైన కథల సమాహారం..

panchathantram : పంచతంత్రం.. విభిన్నమైన కథల సమాహారం..

panchathantram : పంచతంత్రం రివ్యూ
ఎప్పుడు కమర్షియల్ సినిమాలే కాదు..అప్పుడప్పుడు మనసును తాకే మంచి సినిమాలు కూడా వస్తుంటాయి..హర్ష పులిపాక తెరకెక్కించిన పంచతంత్రం అలాంటి సినిమానే.. మనిషిలో ఉండే 5 సెన్సెస్.. రంగు, రుచి, వాసన, స్పర్శ, చూపు.. వీటిని కథల రూపంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు హర్ష. మరి హర్ష చేసిన ఈ ప్రయత్నం ఎంతమేరకు సక్సెస్ అయిందో ఇప్పుడు చూద్దాం.


కథ:
ఒక 60 ఏళ్ళ వ్యక్తి బ్రహ్మానందం (వేద వ్యాస మూర్తి )ని తన కూతురు( స్వాతిరెడ్డి) ఇంట్లో రెస్ట్ తీసుకోమంటే, నేను కథల కాంపిటేషన్ లో పాల్గొని కథలు చెప్తాను అంటాడు. ఇప్పుడు అంతా యంగ్ జనరేషన్ నువ్వు ఆ కాంపిటేషన్ కి వెళ్లిన ఎలిమినేట్ అయిపోతాయి. ఈ ఏజ్ లో నీకెందుకు అవన్నీ అంటుంది. ఆ 60 ఏళ్ళ వ్యక్తి తాను అనుకున్న పనిని సాధించాడా.? ఆ కాంపిటేషన్ లో ఎటువంటి కథలను చెప్పాడు.? ఆ కథలు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నాయో అని తెలియాలి అంటే ఈ సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ సినిమా ఐదు కథలతో సాగే ఒక ఆంథాలజీ. అందుకే ఈ సినిమాకు పంచతంత్రం అనే టైటిల్ ను పెట్టాడు దర్శకుడు. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో సాగే సినిమా కాదు, ఐదు విభిన్నమైన కథలు.. ఐదుగురు భిన్నమైన జీవితాలు, వాటి చుట్టూ అల్లుకున్న అనుబంధాలు, ఎమోషన్స్, బాధలు, కష్టాలు, సుఖాలు కథే ఈ సినిమా.


నటీనటులు: డా. బ్రహ్మానందం, స్వాతిరెడ్డి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీ విద్యా మహర్షి
దర్శకుడు : హర్ష పులిపాక
నిర్మాతలు: అఖిలేష్ వర్ధన్, సృజన్
సంగీత దర్శకుడు: శ్రవణ్ భరద్వాజ్, ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫీ: రాజ్ కె నల్లి
ఎడిటర్: గ్యారీ బి హెచ్

నటీనటుల పనితీరు :
వీటన్నింటినీ మనకు చెప్పే పాత్రలో బ్రహ్మానందం అద్భుతంగా నటించారు..ఎవరి కథలో వాళ్ళు చాలా చక్కగా ఇమిడిపోయారు..
ఫస్ట్ ఆఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది..కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎమోషనల్ గా సాగింది..సముద్ర ఖని, దివ్య శ్రీపాద, కలర్ స్వాతి కథలు అందంగా ఉన్నాయి..మరీ ముఖ్యంగా కలర్ స్వాతి కథలో ఎమోషన్స్ అద్భుతంగా కనెక్ట్ అవుతాయి.

రేపటి ప్రశ్నలకు నిన్నొక బదులంటా
నేటికి ఘటనంతా మరునాటికి గతమంటా
తన రాతల సారం అంతా తలరాతల ఆటంటా
అని చివర్లో వచ్చే సాంగ్ కళ్ళలో నీళ్లు తిరిగేలా చేస్తుంది.

సాంకేతిక నిపుణుల పని తీరు :
ఈ సినిమా క్లైమాక్స్ ను అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు. ఈ సినిమాకి శ్రవణ్ భరద్వాజ్, ప్రశాంత్ విహారి అందించిన మ్యూజిక్ మంచి ఫీల్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలోని కొన్ని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

ఇది సినిమా కంటే వెబ్ సిరీస్ చేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది అనిపించింది..తను అనుకున్నంతలో 5 కథలను చాలా బాగా మిక్స్ చేశారు దర్శకుడు హర్ష పులిపాక..అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి.. చాలా బాగా నటించారు.కమర్షియల్ పంథాలో ఈ సినిమాను చూడడం కష్టం..
డిఫరెంట్ ఎమోషన్స్ క్యారీ చేయాలనుకుంటే మాత్రం ఈ వీకెండ్ మంచి ఛాయిస్.

మొత్తంగా పంచతంత్రం.. విభిన్నమైన కథల సమాహారం.. 3/5

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×