Road Accident: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపు తప్పి ఆరుగురి పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. బస్సు షెల్టర్ లో ప్రయాణికులు ఉండగా.. వారిపై ఈ కారు దూసుకెళ్లింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. అన్నవరం నుంచి జగ్గంపేట నుంచి వస్తున్న పెళ్లి కారు టైర్ పేలడంతో అదుపు తప్పింది. హైవేపై బైక్ ను, అలాగే రిక్షాను ఢీకొట్టింది. అంతమాత్రం ఆగకుండా బస్టాప్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే అక్కడికి వచ్చి బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే మృతి చెందిన వారిలో విద్యార్ధులు ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వాహనం అధిక వేగంతో నడపడం, అలాగే డ్రైవర్ నిర్లక్ష్యం కూడా కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
Also Read: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!
ఈ ప్రమాదంతో రహదారిపై కొంతసేపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందలాది వాహనాలు హైవేపై నిలిచిపోయాయి. పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.