Sharwanand : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకుల మనసులో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈమధ్య ఈ హీరో చేస్తున్న సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వలేదు.. కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.. ప్రస్తుతం శర్వా బైకర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్లో హీరో బిజీగా ఉన్నాడు. తాజాగా చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తన వెయిట్ లాస్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. ముఖ్యంగా ఓ యాక్సిడెంట్ గురించి ఆయన బయట పెట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరో మూవీ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ మూవీ ని ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న విషయాల గురించి ఆయన వివరించారు. అంతేకాదు తనకి గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి బయట పెట్టారు. దానివల్ల కొన్ని నెలల పాటు యాంటీ బయోటిక్స్ పై ఉన్నాను. చాలా ఆకలిగా అనిపించేది. దీంతో తింటూ వెళ్తే బరువు పెరుగుతూ వెళ్లాను. చాలా రోజుల పాటు ఎలా అయ్యానో గుర్తించలేదు. రెండేళ్ల కిందట బైకర్ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు అందులో 18 ఏళ్ల కుర్రాడిలా కనిపించాల్సి రావడంతో తన వెయిట్ లాస్ జర్నీని మొదలుపెట్టినట్లు చెప్పాడు. అలా ఎంతో కఠినంగా డైట్ చేసి వెయిట్ తగ్గినట్లు శర్వా చెబుతున్నారు.. అదే ఇప్పుడు ఈ లుక్ అని అంటున్నారు..
Also Read : మరో వివాదంలో ఐశ్వర్య రాయ్.. కేసులో సంచలన తీర్పు.. ఏం జరిగిందంటే..?
సినిమా స్టోరీ నాకు బాగా నచ్చింది ఎలాగైనా సరే నేను బైకర్ లో నటించాలని ఫిక్స్ అయ్యాను. దాంతో ఇంత బరువుని త్వరగా తగ్గించాలని అనుకున్నాను. అలా వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నం చేశాను. ఉదయాన్ని 4.30 గంటల కే లేచి, కేబీఆర్ పార్క్ చుట్టూ పరుగు ప్రారంభించాడు. ఆ తర్వాత జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేశాడు.. ఓపిక లేకున్నా ఈ ప్లాన్ మిస్ అవ్వలేదని ఆయన అన్నాడు..ఆహారం విషయంలో తనను తాను చాలా కంట్రోల్ చేసుకున్నానని తెలిపాడు. అందుకే రెండేళ్ల లోనే తాను 22 కిలోల బరువు తగ్గినట్లు చెప్పాడు.. ఇప్పుడు తను ఉన్న లుక్కు ఒరిజినల్ అని శర్మ ఆ ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవడంతో అతని కష్టం వృధా అయిపోదు కచ్చితంగా ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుంది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక బైకర్ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని వచ్చే నెల 6 తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ అయినా శర్వా ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టేస్తుందేమో చూడాలి..