BigTV English
Advertisement

Jubilee Hills By Elections: ఫైనల్‌ స్టేజ్‌కు జూబ్లీహిల్స్‌ బైపోల్‌ క్యాంపెయినింగ్‌.. రేపు సాయంత్రానికి ప్రచారం క్లోజ్‌

Jubilee Hills By Elections: ఫైనల్‌ స్టేజ్‌కు జూబ్లీహిల్స్‌ బైపోల్‌ క్యాంపెయినింగ్‌.. రేపు సాయంత్రానికి ప్రచారం క్లోజ్‌

Jubilee Hills By Elections:జూబ్లీహిల్స్‌ బైపోల్‌ క్యాంపెయినింగ్‌ ఫైనల్‌ స్టేజ్‌కు చేరుకుంది. రేపు సాయంత్రానికి ప్రచారం క్లోజ్‌ కానుంది. ఈ నెల 11న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగుతుంది. నెలరోజులుగా పొలిటికల్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి.


హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నిక ప్రచారం ఫైనల్ స్టేజ్‌కు చేరింది. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ సీట్ కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ రేగుతోంది. పోలింగ్ నవంబర్ 11న జరగగా, ప్రచారం రేపు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ కన్స్టిట్యూన్సీలో 24% మైనారిటీలు, మిగిలినవారు వివిధ కులాలు, కమ్యూనిటీల నుంచి.. గెలుపు కోసం 1 లక్ష ఓట్లు కీలకమని విశ్లేషకులు అంచనా. గత ఎన్నికల్లో 50% కంటే తక్కువ పోలింగ్ రికార్డు చేసిన ఈ ప్రాంతంలో ఈసారి 2 లక్షలు పోలింగ్ ఆశ.

కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్‌కు ఏఐఎంఐఎం మద్దతు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఔవైసీ, ఆకబరుద్దీన్ ఔవైసీలు ప్రచారంలో పాల్గొని ముస్లిం ఓట్లను ఆకర్షిస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు బలం. ఇందులో ముస్లిం ఓట్లు కీలకం కావడంతో అన్ని పార్టీలు ఆ వర్గంపై దృష్టి పెట్టాయి.


అందరికంటే ముందుగా ప్రచారం ప్రారంభించిన బీఆర్‌ఎస్ రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా రోడ్‌షోలు చేపట్టి కాంగ్రెస్ ప్రచారాన్ని బలోపేతం చేశారు. ఈ రెండు రోజులు బైక్ ర్యాలీలపై బీఆర్‌ఎస్ దృష్టి. ఇవాళ షేక్‌పేట్‌ నుంచి బోరబండ వరకు కేటీఆర్ బైక్ ర్యాలీ జరిగింది. జనప్రియ అపార్ట్‌మెంట్ సమూహాల వద్ద ఆగి, ఓటర్లను కలిసి మద్దతు తెచ్చుకున్నారు. మరోవైపు బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఎర్రగడ్డలో బ్రేక్‌ఫాస్ట్ మీట్ నిర్వహించారు. దీపక్ రెడ్డి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. సాయంత్రం కేంద్ర మంత్రుల రోడ్‌షోలు జరగనున్నాయి. బండి సంజయ్ రోడ్‌షోకు పోలీసుల అనుమతి ఇస్తారా లేదా అనేది సస్పెన్స్. మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్‌ఎస్-బీజేపీ మధ్య ఓట్ల మార్పిడి జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు.

Also Read: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్షలో ప్రతి ఓటరును నేరుగా కలవాలని, స్థానిక సమస్యలకు పరిష్కార హామీలు ఇవ్వాలని సూచించారు. మూడు రోజులు పూర్తి జోరుతో ప్రచారం చేయాలని, పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లను చేరాలని ఆదేశాలు. బీజేపీ-బీఆర్‌ఎస్ మధ్య ‘సీక్రెట్ అండర్‌స్టాండింగ్’ ఉందని, కేంద్రం ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్ అనుమతి ఆలస్యం చేస్తోందని ఎండగట్టారు.

Related News

Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Flying Squad Raids: కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు..? జూబ్లీ హిల్స్‌లో ఈసీ రైడ్స్

CM Revanth Reddy: సీఎం రేవంత్ పుట్టినరోజు.. PM నుండి CM వరకు శుభాకాంక్షలు

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Big Stories

×