Big Stories

Pawan Kalyan Vs Pawan Kalyan: వైసీపీ Vs పవన్ కళ్యాన్ Vs పవన్ కళ్యాన్.. గ్లాస్ Vs బకెట్.. అందరి టార్గెట్ పిఠాపురం..!

Pawan Kalyan Planning for Pithapuram: పిఠాపురం.. ఏపీ మొత్తం ఎలక్షన్స్‌లో అత్యంత కీలకమైన సెగ్మెంట్.. రీజన్‌.. ఇక్కడి నుంచే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ బరిలోకి దిగడం. పవన్ టార్గెట్.. గెలవడం వైసీపీ టార్గెట్.. పవన్‌ను ఓడించడం.. మరి పవన్ గెలుపు కోసం ఏం చేస్తున్నారు..? వైసీపీ సేనానిని మట్టి కరిపించేందుకు పన్నుతున్న వ్యూహాలేంటి..? పిఠాపురంలోనే కాదు. పోటీ చేసే మరో 20 స్థానాల్లో కూడా ఇప్పుడు సేనానికి బకెట్ టెన్షన్‌ పట్టుకుందట.. అదేంటో కూడా చూద్దాం.

- Advertisement -

పిఠాపురంలో పవన్ ప్రచారం.. ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలకు కామన్‌గా మారిపోయింది. పవన్‌ పేరు అక్కడి ప్రజల నోళ్లల్లో నానుతుంది. అయితే రోడ్‌ షో.. లేదంటే నడుస్తూ.. ఇలా ఆ ప్రాంత ప్రజలను నిత్యం పలకరిస్తున్నారు పవన్ లెటెస్ట్‌గా ఆయన పిఠాపురంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అందులోకి గృహప్రవేశం కూడా చేశారు. అంతేకాదు ఉగాది వేడుకలను కూడా ఆ ఇంట్లోనే జరుపుకున్నారు పవన్.. సో నేను ఎక్కడికి వెళ్లేది లేదు. ఇక్కడే ఉంటున్నానని చెప్పకనే చెబుతున్నారు పవన్.

- Advertisement -

నిజానికి పవన్‌ వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశారు. కానీ రెండు చోట్ల ఓడిపోయారు.. ఆ తర్వాత ఆ నియోజకవర్గాలను పెద్దగా పట్టించుకున్నది లేదు. ఎట్ ది సేమ్‌ టైమ్.. పిఠాపురంలో ఓడిపోతే పవన్ జెండా ఎత్తేస్తారన్న విమర్శలు కూడా చేశారు వైసీపీ నేతలు. ఈ విమర్శలు తన చెవిన పడ్డాయో ఏమో.. పిఠాపురంలో ఓ ఇంటినే కొనేశారు. సో.. నేను ఇక్కడి వాడినే.. మీ వాడినే… తాను ఎక్కడికి వెళ్లేది లేదని మెసేజ్ ఇచ్చారు పవన్.. అంతేకాదు.. మరో కొత్త తరహా చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు పవన్.

Also Read: కాంగ్రెస్, బీజేపీ మేనిఫెస్టో వార్.. ఏది నిజం?

ఒక్కసారి కాస్త పాస్ట్‌కు వెళ్లండి.. పిఠాపురం టికెట్ జనసేనకు కేటాయించగానే ఆ ప్రాంతంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సెగ్మెంట్‌ టికెట్ ఎక్స్‌పెక్ట్‌ చేసి భంగపడ్డ SVSN వర్మ, ఆయన అనుచరులు ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యారు. టీడీపీ జెండాలు తగులపెట్టారు.. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. జనసేన అభ్యర్థి ఎవరైనా ఓడిస్తామని ప్రతిజ్ఞలు చేశారు. కానీ సీన్‌లోకి చంద్రబాబు ఎంటర్‌కాగానే పరిస్థితి మారిపోయింది.. వర్మ సైలెంట్ అయిపోయారు.. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారన్న హామీతో ఆయన వెనక్కి తగ్గారన్న ప్రచారం జరిగింది.

అలాంటి వర్మను ఇప్పుడు తన పక్కనే ఉంచుకుంటున్నారు పవన్.. ప్రచారంలో కూడా వర్మను వెంటే ఉంచుకుంటున్నారు పవన్.. ఉగాది వేడుకల్లో కూడా ఇద్దరు కలిసే పాల్గొన్నారు. సో అటు జనసేన, ఇటు టీడీపీ.. రెండు క్యాడర్‌లకు కలిసి పనిచేయాలని చెప్పకనే చెబుతున్నారు పవన్.. అంతేకాదు పవన్‌ను గెలిపించడమే తన బాధ్యత అంటున్నారు వర్మ.

Also Read: Lokesh Phone Tapping : ఫోన్ ట్యాపింగ్.. నారా లోకేశ్ యాపిల్ అలర్ట్

ఇదంతా కూటమి వర్షన్.. మరి వైసీపీ పరిస్తితి ఎలా ఉంది..? వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు కూడా పవన్‌కు అనుకూలంగా పనిచేస్తాయా..? ఈ క్వశ్చన్‌ కొంచెం ట్రిక్కీ.. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత.. ఆమె సిట్టింగ్ ఎంపీ కూడా.. మూడు నెలలుగా ఆమె పిఠాపురంలోనే ఉన్నారు. అయితే వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే దొరబాబు మొదట సహకరించలేదు ఆమెకు.. అక్కడ చంద్రబాబు ఎలాగైతే వర్మకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారో.. ఇక్కడ సీఎం జగన్ కూడా దొరబాబుతో మాట్లాడి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు..
గీత గెలుపుకు సహకరించాలని సూచించారు. అయితే గ్రౌండ్‌ లెవల్‌లో క్యాడర్‌లో అంత కో ఆర్డినేషన్‌ ఉన్నట్టు కనిపించడం లేదన్న ప్రచారం ఉంది.

అయితే సీఎం జగన్‌ పిఠాపురం ఫుల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. వెరీ సూన్ పిఠాపురంలో ఆయన భారీ బహిరంగసభ ఉండబోతుందని సమాచారం. ఈ సభలోనే టీడీపీ, జనసేన నుంచి కొందరు నేతలు వైసీపీలో చేరతారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాపుఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పవన్‌కు ఏమాత్రం తగ్గకుండా వంగా గీత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తే కాస్త ఇంపాక్ట్ ఉండటం ఖాయం.

Also Read: కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో విడుదల.. పాంచ్ పటాకా..!

ఇవన్నీ ఒకవైపు అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కొత్త తలనొప్పి స్టార్టయ్యింది. జనసేన సింబల్ గాజు గ్లాసును పోలిన సింబల్‌తో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. దాని పేరు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడీ పార్టీ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయింది. కేవలం సింబల్ మాత్రమే కాదు.. జనసేన లీడర్ల పేరుతో ఉన్నవారినే తమ పార్టీ తరఫున బరిలో దించేలా స్కెచ్ వేశారు. అంటే పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా పవన్‌కల్యాణ్‌.. అదే పిఠాపురం నుంచి బరిలో మరో పవన్‌ కల్యాణ్‌. తెనాలి నుంచి జనసేన టికెట్‌పై నాదెండ్ల మనోహర్‌.. అదే తెనాలి నుంచి మరో మనోహర్‌ పోటీ. సో చూస్తేంటే ఇది ఓటర్లను కన్‌ఫ్యూజ్ చేసే ఎత్తుగడ అని క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీకి దేశం మొత్తం గాజు గ్లాసు గుర్తే ఉంది.
ఏపీకి వచ్చేసరికి బకెట్‌ గుర్తు కేటాయించారు.

ఎందుకంటే ఆల్రెడీ ఏపీలో జనసేనకు గ్లాసు గుర్తు కేటాయించారు కాబట్టి.. సో వచ్చే ఎన్నికల్లో పవన్‌కు కొత్త తలనొప్పి మొదలైనట్టే. ఇవన్నీ రాజకీయ పార్టీల వ్యూహాలు.. ఎత్తుగడలు.. మరి నియోజకవర్గ హిస్టరీ చూస్తే.. మరో ఇంట్రెస్టింగ్‌ పాయింట్ ఉంది. లాస్ట్ 40 ఇయర్స్ పొలిటికల్ హిస్టరీ చూస్తే ఇక్కడ ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు. మరి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలిచారు. మరి ఈసారి అదే రీపిట్ అవుతుందా..? లేదా..? అన్నది బిగ్ క్వశ్చన్.. విభిన్నతీర్పును ఇచ్చే పిఠాపురం ప్రజలు.. 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి జై కొడతారు..? అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News